‘మార్కెట్‌ కమిటీలపై’ నేతల్లో ఆశలు | Sakshi
Sakshi News home page

‘మార్కెట్‌ కమిటీలపై’ నేతల్లో ఆశలు

Published Wed, Jan 17 2024 11:56 PM

కథలాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ  - Sakshi

● రిజర్వేషన్లపై అయోమయం

కథలాపూర్‌: వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ర ద్దు చేస్తున్నామని, కొత్త పాలకవర్గం ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించడంతో కాంగ్రెస్‌ నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మార్కెట్‌ కమిటీ చైర్మన్ల పదవులకు రోస్టర్‌ విధానంతో రిజర్వేషన్లు అమలు చేసి పదవీకాలాన్ని రెండేళ్లు చేసింది. వాటి ప్రకారమే చైర్మన్లను నియమించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రిజర్వేషన్లపై అయోమయం నెలకొంది. జి ల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్‌, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, మేడిపెల్లి, రాయికల్‌, ధర్మపురి, గొల్లపెల్లి, పెగడపల్లి, మల్యాల, వెల్గటూర్‌లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలున్నాయి. ఆ యా మార్కెట్‌ కమిటీల పరిధిలో ఉన్న అధికార పా ర్టీ నాయకులు పదవులపై ఆశలు పెంచుకొని తమ అనుచరవర్గాలతో మంతనాలు చేస్తున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఇన్నా ళ్లు పార్టీకి చేసిన సేవలను ఎమ్మెల్యే, మంత్రికి వివరించి పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పదవి పొందాలంటే ఆయా మార్కెట్‌ కమిటీ పరిధిలోని గ్రామానికి చెందిన రైతులై ఉండాలి. అధ్యక్షుడు సహా పాలకవర్గం మొ త్తాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదించాల్సి ఉంటుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే లేకుంటే ఇన్‌చార్జి మంత్రి సూచించాల్సి ఉంటుంది. జిల్లాలో కోరుట్ల, జగి త్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండగా.. ధర్మపు రి, చొప్పదండి, వేములవాడలో అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే గత రిజర్వేషన్ల ప్రకా రం ప్రతిపాదనలు తీసుకుంటారా..? లేక వాటిని పూర్తిగా రద్దు చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది.

Advertisement
Advertisement