శ్రీశోభ కృత్‌.. శుభప్రదం | Sakshi
Sakshi News home page

శ్రీశోభ కృత్‌.. శుభప్రదం

Published Wed, Mar 22 2023 11:38 PM

పంచాంగ శ్రవణంలో పాల్గొన్న 
కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తదితరులు - Sakshi

సుబ్బాలమ్మకు

మంత్రి విశ్వరూప్‌ ఉగాది పూజలు

అమలాపురం టౌన్‌: స్థానిక సుబ్బాలమ్మ అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ బుధవారం సందర్శించి అమ్మవారికి ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తొలుత మంత్రి విశ్వరూప్‌ను ఆలయ చైర్మన్‌ బిళ్ల మల్లికార్జునరావు, ఈవో బీవీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పండితులు పూర్ణ కుంభంతో స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ సుబ్బాలయ్మ సన్నిధిలో కొద్దిసేపు గడిపి ఉగాది పచ్చడిని స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ హిమాన్షు శుక్లా కూడా సుబ్బాలమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు, అధికారులు కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర అమ్మవారిని దర్శించుకున్నారు.

అమలాపురం టౌన్‌: కొత్తగా ఏర్పడ్డ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు శ్రీ శోభ కృత్‌ నామ సంవత్సరం ఈ ఉగాది నుంచి శుభ ప్రదంగా ఉంటుందని వేద పండితులు పంచాంగ పఠనం ద్వారా ఉద్ఘాటించారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఉగాది వేడుకలు సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా జరిగాయి. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సంప్రదాయ దుస్తులు ధరించి తన తల్లి మంజుల శుక్లాతో పాల్గొని తొలుత వేద పండితుల సమక్షంలో ఉగాది మంత్రోచ్ఛారణ నడుమ గణపతి పూజలు చేశారు. జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. వేడుకల్లో పాల్గొన్న వారంతా ఉగాది పచ్చడి రుచి చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ తెలుగు వారి తొలి పండుగైన ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ ఉగాది ఉషస్సులతో జిల్లాలోని అన్ని రంగాలూ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆ వేడుకల వేదిక నుంచి కలెక్టర్‌ శుక్లా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేప పువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడి, చెరుకు, అరటి ఇలా షడ్రుచుల సమ్మేళనంలో తయారు చేసే ఉగాది పచ్చడి విశిష్టతను కూడా కలెక్టర్‌ తన ఉపన్యాసంలో చక్కగా వివరించారు. పెద్దింటి సాయి దీక్షితులు ఆధ్వర్యంతో వేద పండితులు పంచాంగ పఠనాన్ని చేశారు. కప్పగంతుల సూర్యనారాయణ, తేజోమూర్తుల అచ్యుత నాగంద్ర శర్మ వేద పఠనం, మహాదాశీర్వచన కార్యక్రమం గావించారు.

కోనసీమ ఉగాది కోయిల పేరుతో కవితాలాపన

అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో కవులు డాక్టర్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ కొల్లూరి, డాక్టర్‌ ఎంఏకే భీమారావు, డాక్టర్‌ కేటీ పద్మ, జాన దుర్గా మల్లికార్జునరావు, మొంగం అమృతరావు, దొండపాటి నాగజ్యోతి ఉగాది కవితాలాపన చేశారు. కోనసీమ ఉగాది కోయిల అంటూ తమ ఉగాది కవితా గానాలను వినిపించి సభికులకు వీనుల విందు చేశారు. అనంతరం కవులను కలెక్టర్‌ శుక్లా పండిత శాలువలతో సత్కరించి నగదు బహుమతులను అందించారు. వేడుకల్లో తొలుత మానేపల్లి చిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ గణపతి సన్నాయి బృందం నాద స్వర ఆలాపన చేసింది. సన్నాయి మేళ బృందాన్ని కలెక్టర్‌ అభినందించారు. ఈ వేడుకల్లో దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, డీఈవో ఎం.కమలకుమారి, డీఆర్‌డీఏ పీడీ వి.శివశంకర ప్రసాద్‌, డీఐ పీఆర్వో కె.లక్ష్మీనారాయణ, డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ ఎం.దుర్గారావు దొర, హిత కారిణి సమాజం చైర్‌పర్సన్‌ కాశి బాల మునికుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ ఒమ్మి అయ్యప్పనాయుడు, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, పార్టీ నాయకుడు కుడుపూడి భరత్‌ భూషణ్‌ పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించిన కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

పంచాంగ పఠనంలో పండితుల ఉద్ఘాటన

కలెక్టర్‌ కార్యాలయంలో

శాస్త్రోక్తంగా ఉగాది వేడుకలు

అలరించిన కవి సమ్మేళనం, సన్నాయి మేళం

సుబ్బాలమ్మను దర్శించుకున్న మంత్రి విశ్వరూప్‌
1/1

సుబ్బాలమ్మను దర్శించుకున్న మంత్రి విశ్వరూప్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement