విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి..

సాక్షి, జోగులాంబ గద్వాల: జిల్లాలోని మానవపాడు మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతిచెందారు.
వివరాల ప్రకారం.. పల్లెపాడులో నలుగురు చిన్నారులు కలిసి కృష్ణా నదిలోకి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో నలుగురు చిన్నారులు నది నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో స్థానికులు వారిన రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నలుగురు చిన్నారులు మృతిచెందారు. కాగా, మృతిచెందిన వారిని అఫ్రీన్(17), రిహాన్(15), సమీర్(8), నౌషిన్(7)లుగా గుర్తించారు. ఇక, మృతిచెందిన చిన్నారులంతా ఒకే కుటుంబానికి వల్లూరు వాసులుగా స్థానికులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: గుంటూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురు మృతి