ఇంటి వద్ద తండ్రి శవం.. పది పరీక్షకు హాజరు

- - Sakshi

గంగాధర నెల్లూరు: తండ్రిని కోల్పోయిన బాధనంతా గుండెల్లో దాచుకుని, పదో తరగతి పరీక్ష రాసింది కుమార్తె. మండలంలోని లక్ష్మీరెడ్డిపల్లి దళితవాడకు చెందిన మహేంద్ర ట్రాక్టర్‌లో కూర్చుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి జారిపడి మంగళవారం మరణించాడు. అయితే తండ్రి మృతదేహాన్ని ఇంటి వద్ద పెట్టుకుని మృతుడి కుమార్తె మమత విషణ్ణ వదనంతో గంగాధర నెల్లూరు హైస్కూల్లో బుధవారం పదో తరగతి పరీక్షకు హాజరైంది. ఆ తర్వాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది.

రాష్ట్ర స్థాయి స్కేటింగ్‌ పోటీలు ప్రారంభం

తిరుపతి ఎడ్యుకేషన్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన రెండు రోజుల రాష్ట్ర స్థాయి అండర్‌–11, 14 స్కేటింగ్‌ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. డీఈఓ శేఖర్‌ ఈ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం వస్తుందని తెలిపారు. అనంతరం బాలబాలికలకు విడివిడిగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ సయ్యద్‌ సాహెబ్‌, ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు, కార్యదర్శులు పాల్గొన్నారు.

బయోటెక్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌కు నిధులు

తిరుపతి సిటీ : శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఉమెన్‌ బయోటెక్‌ ఇంక్యుబేషన్‌ ఫెసిలిటీ సెంటర్‌కు మూడో విడతగా రూ.47.09లక్షలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు వీసీ భారతి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రజనితో కలసి మంజూరైన నిధుల పత్రాన్ని ఇంక్యుబేషన్‌ సెంటర్‌ సీఈఓ ప్రొఫెసర్‌ కళారాణి, ప్రాజెక్ట్‌ ఇన్వెస్టిగేటర్‌ విద్యావతికి అందజేశారు.

Election 2024

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top