రెండూ సైజులలో రానున్న ఎయిర్‌పాడ్స్ ప్రో2 | Sakshi
Sakshi News home page

రెండూ సైజులలో రానున్న ఎయిర్‌పాడ్స్ ప్రో2

Published Thu, Dec 31 2020 3:46 PM

Apple Upcoming AirPods Pro 2 Will Come in Two Sizes - Sakshi

ఆపిల్ కొద్దీ రోజుల క్రితమే ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌ను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అప్పుడే ఆపిల్ తర్వాత తీసుకురాబోయే ఎయిర్‌పాడ్స్ ప్రో 2 కోసం యూజర్లు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానికి సంబందించిన ఒక సమాచారం బయటకి వచ్చింది. మిస్టర్ వైట్ అనే టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌పాడ్స్ ప్రో2ను రెండు వేర్వేరు పరిమాణాల్లో ఆపిల్ విడుదల చేయబోతోంది అని సమాచారం. మిస్టర్ వైట్ గతంలో విడుదల చేసిన కొన్ని లీక్స్ చాలా వరకు నిజమయ్యాయి. మిస్టర్ వైట్ ఎయిర్ పాడ్స్ ప్రో2 యొక్క అంతర్గత హార్డ్వేర్ యొక్క చిత్రాలను కూడా తన ట్విటర్ లో షేర్ చేసారు. అతడు షేర్ చేసిన హార్డ్వేర్ ఎయిర్ పాడ్స్ ప్రో2 చిత్రాలు రెండు వేర్వేరు పరిమాణాలలో ఉన్నాయి. ఎయిర్‌పాడ్స్ ప్రో 2 రెండు వేర్వేరు పరిమాణాలలో రావచ్చని వేర్వేరు కేబుల్ పొడవులు టిప్‌స్టర్ సూచించారు. ఒకటి ప్రస్తుత ఎయిర్‌పాడ్స్ ప్రోలో మనం చూసే సాధారణ పరిమాణం, మరొకటి సాధారణం కంటే పెద్ద వెర్షన్. శామ్సంగ్ గెలాక్సీ బడ్స్ మాదిరిగా గుండ్రని అంచులతో కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉన్న ఎయిర్‌పాడ్స్ ప్రో2ను తీసుకురానున్నట్లు సమాచారం.

 
Advertisement
 
Advertisement