సరైన పత్రాలు లేని 75 వాహనాలు సీజ్‌ | Sakshi
Sakshi News home page

సరైన పత్రాలు లేని 75 వాహనాలు సీజ్‌

Published Thu, May 23 2024 6:45 AM

సరైన పత్రాలు లేని 75 వాహనాలు సీజ్‌

రావికమతం : నేర నియంత్రణలో భాగంగా కొత్తకోట సీఐ ఎల్‌.అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొత్తకోట గ్రామంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఇర్వహించారు. బుధవారం ఉదయాన్నే పలు వీధుల్లో గుంపులుగా పోలీసులు తిరుగుతూ రోడ్డుపై వచ్చే వాహనాలతో పాటు ఇళ్ల వద్ద గల వాహనాలను కూడా పరిశీలించారు. ఆయా వాహనాల లైసెన్సులు, ఇతర పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాటిని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా , బయటి వ్యక్తులు నివారించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని దీని వల్ల నేర నియంత్రణ జరుగుతుందని సీఐ అప్పలనాయుడు ఈ సందర్భంగా తెలిపారు. 75 బైక్‌లు,10 వరకూ ఆటోలు, ఇతర వాహనాలను ఈ విధంగా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎస్‌ఐ లక్ష్మణరావు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement