నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

Published Thu, May 23 2024 12:00 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

● కట్టడికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ● కలెక్టర్‌ రాజర్షి షా

కైలాస్‌నగర్‌: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్‌ రాజర్షి షా హెచ్చరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, పోలీస్‌శాఖల అధికారులతో బుధవా రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల కట్ట డికి వ్యవసాయ, పోలీస్‌, ఇతర ప్రభుత్వ శాఖల సి బ్బందితో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాస్థాయిలో డీఎస్పీ, ఏడీఏ, ఆర్డీ వో, మండల, డివిజన్‌ స్థాయిలో తహసీల్దార్‌, సీఐ, ఏవోలు ఉంటారన్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిని ఈ బృందాలు గుర్తించాలన్నారు. ఈమేరకు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ.. జిల్లాలోని విత్తన, ఎరువుల దుకాణాలు, గోడౌన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అనుమానం వచ్చిన వాటి శాంపిల్స్‌ను పరీక్షలకు పంపాలన్నారు. రవా ణా వాహనాలను కూడా తనిఖీ చేయాలన్నారు. నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్‌ అమలుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, జిల్లా వ్యవసాయశాఖ అధి కారి పుల్ల్ల య్య, డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆర్డీవోలు వినోద్‌ కుమార్‌, జీవాకర్‌ రెడ్డి, తహసీల్దార్లు, పోలీస్‌, వ్యవసాయశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ధరణి, ప్రజావాణి దరఖాస్తులు వారంలోగా పరిష్కరించాలి

కై లాస్‌నగర్‌: పెండింగ్‌లో ఉన్న ధరణి, ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాజర్షిషా అధికారులను ఆదేశించా రు. జిల్లాలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, కలెక్టరేట్‌ అధికారులతో బుధవారం సమావేశమయ్యా రు. మండలాల వారీగా తహసీల్దార్ల లాగిన్‌లో ఉన్న ధరణి దరఖాస్తులతో పాటు వారి పరిధి లోని ప్రజా వాణి పెండింగ్‌ అర్జీలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న ప్రతీ దరఖా స్తును క్షుణ్ణంగా పరి శీలించి, అవసరమైతే క్షేత్రస్థా యి పరిశీలన చేసి ప రిష్కరించాలన్నారు. ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌ లైన్‌లోనూ ఫైల్స్‌ను సిద్ధం చేయాలన్నారు. జూన్‌ రెండోవారంలో ప్రజావాణి కార్యక్రమం పునః ప్రారంభమవుతుందని అప్పటిలోగా అన్నిరకాల పెండింగ్‌ దరఖాస్తులు పరి ష్కరించాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, ఆర్డీవోలు టి.వినోద్‌ కుమార్‌, జీవాకర్‌ రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో అరవింద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement