Sakshi News home page

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి

Published Fri, Mar 29 2024 1:50 AM

మాట్లాడుతున్న పీవో
 - Sakshi

● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా

ఉట్నూర్‌రూరల్‌: విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహా రం అందించడంతో పాటు నాణ్యమైన విద్యాబోధ న చేయాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికా రులకు సూచించారు. గురువారం ఉట్నూర్‌ ఐటీడీ ఏ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ని గిరిజన గురుకుల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. పిల్లలకు పౌష్టకాహారంతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అప్పుడే పిల్ల లు ఆరోగ్యంగా ఉంటూ చదువుపై దృష్టి సారిస్తార ని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై శ్రద్ధ వహించాలని వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. వేసవిలో నీటి సౌకర్యం, వసతుల కల్పనపై అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ప్రాంతీయ సమన్వయ కర్త గంగాధర్‌, వివిధ గిరిజన గురుకుల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

పీవీటీజీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి..

వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల ద్వారా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉన్న పీఈటీజీలను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సూచించారు. గురువారం ఐటీడీఏ కార్యాలయంలో సెర్ఫ్‌, జిల్లా, మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పేపర్‌ ప్లేట్‌ తయారీ, ఇప్పపువ్వు ప్రాసెసింగ్‌, పేపర్‌ బ్యాగ్‌ తయారీ లాంటి మరెన్నో యూనిట్లను స్థాపించి పీవీటీజీల జీవనోపాధికి సహకరించి తగిన శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీడీ దిలీప్‌కుమార్‌, జేడీఎం నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement