1300 మందితో బందోబస్తు | Sakshi
Sakshi News home page

1300 మందితో బందోబస్తు

Published Tue, May 14 2024 3:50 AM

1300 మందితో బందోబస్తు

నారాయణపేట: పార్లమెంట్‌ ఎన్నికలకు 1300 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పోలీస్‌ వారు అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలు నుంచి ఇప్పటివరకు రూ.1,48,96,300 నగదు, రూ.17,18,036 విలువ గల లిక్కర్‌, రూ.17లక్షల విలువ గల బంగారుం, రూ.31వేల విలువ గల వెండి, సీజ్‌ చేయడం జరిగిందని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement