-
'దీదీ గిరి'ని అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
కోల్‌కతా: ఇటీవల పశ్చిమ బెంగాల్ గవర్నర్ 'సీవీ ఆనంద బోస్' మీద లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. దీనిపైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీఎంసీ అధినేత్రి వ్యాఖ్యలపై ఆనంద బోస్ స్పందించారు.తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మాట్లాడుతూ.. నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నందుకు చాలా చింతిస్తున్నాను.ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. అవమానకరమైన వ్యాఖ్యల చేశారు. ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె ఆలా మాట్లాడకూడదు. ఆమెను (మమతా బెనర్జీ) రక్షించమని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇది దేవునికి కూడా కష్టతమైన బాధ్యత. నేను ఎప్పుడూ 'దీదీ గిరి'ని అంగీకరించను అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ అన్నారు.#WATCH | On sexual harassment allegation against him, West Bengal Governor CV Ananda Bose says, "The Governor is supposed to stay away from politics. Now I am very sorry that the Chief Minister has dragged me into politics, especially at a time when the elections are going on...… pic.twitter.com/u624O6gHOx— ANI (@ANI) May 6, 2024 -
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని పాండువా ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మీడియా కథనాల ప్రకారం కొంతమంది చిన్నారులు బంతిగా భావించి ఒక బాంబుతో ఆడుతుండగా, అది హఠాత్తుగా పేలింది. గాయపడిన వారిలో ఒకరు కుడి చేయి కోల్పోయినట్లు సమాచారం. కాగా టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇదే ప్రాంతంలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాల్సివుందిఈ పేలుడులో గాయపడిన ఇద్దరు చిన్నారులను రూపమ్ వల్లభ్, సౌరభ్ చౌదరిగా గుర్తించారు. చిన్నారుల వయసు 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం బాధితులు చుంచుర ఇమాంబర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం 8:30 గంటల సమయంలో తిన్నా ప్రాంతంలోని చెరువు దగ్గర పెద్ద పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో సమీపంలోని వారు చెరువు గట్టు వద్దకు పరుగులు తీయగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన స్థితిలో వారికి కనిపించారు. ఈ ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ఒకరు మృతి చెందారు.ఈ ఘటనపై హుగ్లీ రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన భద్రతా లోపంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక నేత అభిషేక్ బెనర్జీ సమావేశం జరగాల్సిన స్థలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. -
Buddhadeb Bhattacharya: నేను బుద్ధదేవ్ మాట్లాడుతున్నా...!
లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి పారీ్టలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రచారం పర్వంలో కృత్రిమ మేధ (ఏఐ)తో ఇప్పటికే జోరుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పశి్చబెంగాల్లో సీపీఎం కూడా ఇదే దారి పట్టింది. కొద్ది రోజుల క్రితం ఏఐ యాంకర్ ‘సమత’ను ప్రచారంలోకి దింపిన ఆ పార్టీ, తాజాగా బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్య వీడియోను కూడా అలాగే తయారు చేసింది! ఏఐ సహాయంతో సరిగ్గా మాజీ బుద్ధదేవ్ ప్రతిరూపాన్ని, వాయిస్‌ను రూపొందించింది. 2 నిమిషాల 6 సెకన్ల నిడివితో కూడిన వీడియో సందేశం సాయంతో అటు బీజేపీ, ఇటు తృణమూల్‌పై ఏకకాలంలో దాడి చేసింది. ‘‘బెంగాల్లో ఉపాధి లేదు, మహిళలకు గౌరవం లేదు. రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారుతోంది. రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, పరిశ్రమలొస్తాయని, వ్యవసాయం మెరుగుపడుతుందని, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని తృణమూల్ చెప్పిన మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. అంతా అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ కూడా జనాల జీవితాలతో ఆడుకుంటోంది. నోట్ల రద్దు నుంచి మొదలుకుని కార్పొరేట్ లూటీ దాకా సర్వం కొద్ది మంది కుబేరులకు మేలు చేసే నిర్ణయాలే. తాజాగా మోదీ సర్కారు ఎన్నికల బాండ్ల అవినీతికి పాల్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. దేశాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసే పనిలో పడింది. ఈ ఆటలను సాగనీయొద్దు. అందుకు మన ముందున్న మార్గం పోరాటం ఒక్కటే. ఈ పోరాటంలో గెలవాలంటే ఈ ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ సెక్యులర్ అభ్యర్థులనే గెలిపించండి’’ అంటూ వీడియోలో బుద్ధదేవ్ విజ్ఞప్తి చేశారు! ఇంటికే పరిమితం... తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బుద్ధదేవ్ కొంతకాలం కిందట ఆస్పత్రిలో చేరారు. కోలుకుని ఇంటికి తిరిగొచి్చన తర్వాత బయటికి కనిపించడమే లేదు. పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వామపక్ష కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపడానికి సీపీఎం ఇలా బుద్ధదేవ్‌తో కూడిన ఏఐ వీడియోను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే వీడియోను రూపొందించిన తరువాత బుద్ధదేవ్ కుటుంబానికి వినిపించి, వారి అనుమతితోనే సామాజిక వేదికల్లో పోస్ట్ చేసింది పార్టీ. బుద్ధదేవ్ సందేశం వామపక్ష కార్యకర్తలకు ఎంతో ఉత్తేజాన్నిస్తుందని సీపీఎం నమ్ముతోంది. అంతేకాకుండా రాష్ట్ర ఓటర్లను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుందని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఆరోపణలపై విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని నలుగురు రాజ్‌భవన్ ఉద్యోగులకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సెట్)సమన్లు జారీ చేసింది. ఇంతేకాకుండా రాజ్‌భవన్‌లోని సీసీటీవీ వీడియోలను తమకు ఇవ్వాలని సెట్ అక్కడి అధికారులను కోరింది. ‘గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఈ బృందం రానున్న రోజుల్లో కొందరు సాక్షులను విచారించనుంది.లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కొన్ని వీడియోలు కావాలని రాజ్‌భవన్‌ను ఇప్పటికే కోరాం’అని ఒక పోలీసు అధికారి చెప్పారు. కాగా, రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి గవర్నర్‌పై రాతపూర్వక ఫిర్యాదు చేసింది. తనను గవర్నర్ సివి ఆనంద్‌బోస్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది.అయితే గవర్నర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండటం వల్ల పోలీసులు, కోర్టులు క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి వీలు లేదు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లోకి పోలీసులను రానివ్వద్దని సిబ్బందికి ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
బెంగాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఓ మహిళా ఉద్యోగి లైంగిన వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. బెంగాల్ రాజ్‌భవన్‌లో పని చేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి.. గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గవర్నర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఆశచూపి గవర్నర్ తనపై పలుసార్లు లైంగికంగా వేధించారని సదరు మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. సదురు ఉద్యోగిని ఆరోపణలను గవర్నర్ ఆనంద బోస్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఆనంద్ బోస్ స్పందిస్తూ..‘ఇది దురుద్దేశంతో అల్లిన కట్టుకథ. ఇదంతా కల్పితమే. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలను కోరుకుంటే.. వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బెంగాల్లో హింస, అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని కామెంట్స్ చేశారు. “Truth shall triumph. I refuse to be cowed down by engineered narratives. If anybody wants some election benefits by maligning me, God Bless them. But they cannot stop my fight against corruption and violence in Bengal.”— Raj Bhavan Kolkata (@BengalGovernor) May 2, 2024 మరోవైపు.. ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బెంగాల్లో రెండు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇలాంటి నేపథ్యంలో గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బీజేపీకి షాకిచ్చినట్టు అయ్యింది. ఇక, ఈ వ్యవహారంపై అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం గవర్నర్‌పై మండిపడుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement