-
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ వేయడంపై వయనాడ్ ప్రజలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘తప్పేముంది రాహుల్ ఇండియా కూటమిలో అగ్రనేత’ అని ఒకరు అనగా రాయ్‌బరేలీలో గెలిస్తే వయనాడ్ సీటును రాహుల్ వదిలేస్తారని మరొకరన్నారు. అయితే రాహుల్ వయనాడ్‌ను వదిలేయడం తమకు అంత మంచిది కాదని చెప్పాురు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి మేలు చేస్తుందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)నేత కున్హలికుట్టి అన్నారు. ప్రధాని మోదీ కూడా గతంలో రెండు సీట్లలో పోటీ చేశారని కుట్టి గుర్తు చేశారు. -
మోదీతో విజయన్ రహస్య ఒప్పందం: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోదీతో కుమ్మక్కై కేరళ ప్రజలనే గాక, సొంత పార్టీ సీపీఎంను కూడా మోసం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తా రు. పినరయి విజయన్, ఆయన కుటుంబసభ్యులు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. బంగారం స్మగ్లింగ్‌లో సీఎం, ఆయన కుటుంబసభ్యుల పాత్ర ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నా రు. విజయన్‌పై ఈడీ, ఐటీ కేసులున్నప్పటికీ మోదీ చర్యలు తీసుకోవడం లేదని, ప్రధాని మోదీతో కేరళ సీఎం రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో పర్యటిస్తున్న రేవంత్ గురువారం అక్కడ జరిగిన రైతుల సమావేశంలో ప్రసంగించారు. కమ్యూనిస్టు కాదు... కమ్యూనలిస్టు రాష్ట్రాల ప్రయోజనాలు, రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయాలని, ఈ దిశగా తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు నిధుల కోసం పోరాడుతున్నాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే కేరళ సీఎం విజయన్ మాత్రం కేంద్రంతో పోరాటం చేయకుండా, మతతత్వ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. పైకి సీపీఎం పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న విజయన్ కమ్యూనిస్టు కాదని, కమ్యూనలిస్టు అని వ్యాఖ్యానించారు. వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు విజయన్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈడీ, ఐటీ కేసులున్నన్ని రోజులు సీపీఎం కోసం విజయన్ పని చేయరని దుయ్యబట్టారు. వయనాడ్ ప్రజల అభిమానాన్ని చూసేందుకే వచ్చా.. కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారని, తెలివైన వారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయి కానీ కేరళ మాత్రం అభివద్ధి చెందలేదన్నారు. మణిపూర్‌లో వందలాది మంది క్రిస్టియన్లు బీజేపీ గూండాల చేతిలో చనిపోయారని, అయినా మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌లో పర్యటించలేదని మండిపడ్డారు. కానీ రాహుల్ గాంధీ అక్కడి బాధితులను కలిసి మాట్లాడారని గుర్తు చేశారు. జూన్ 9న రాహుల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని, వయనాడ్ ప్రజలు ఓటేసేది ఒక ఎంపీకి కాదని, దేశానికి కాబోయే ప్రధానికి అని అన్నారు. దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందని, మోదీ పరివార్‌లో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఇన్‌కం ట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారని పేర్కొన్నారు. అదే ఇండియా పరివార్‌లో సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాందీతోపాటు వయనాడ్ కుటుంబ సభ్యులున్నారన్నారు. ఇందిరా, రాజీవ్‌లు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే, సోనియా, రాహుల్ ప్రధాని పదవిని త్యాగం చేశారని చెప్పారు. వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారని, తాను ఇక్కడ ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, కేవలం రాహుల్‌పై వయనాడ్ ప్రజల అభిమానాన్ని చూసేందుకే తెలంగాణ నుంచి వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని తాము రాహుల్‌ని కోరామని, కానీ ఆయన వయనాడ్ వైపే మొగ్గు చూపారని చెప్పారు. గత ఎన్నికల్లో వయనాడ్‌లో 65 శాతం ఓట్లు వచ్చాయని, ఈసారి 75 శాతం ఓట్లు రావాలని ఆకాంక్షించారు. వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు. -
Rahul Gandhi: రాజ్యాంగ సంస్థలు మోదీ సొత్తు కాదు
వయనాడ్/నీలగిరి: సీబీఐ, ఈడీ మొదలుకుని కేంద్ర ఎన్నికల సంఘం దాకా ప్రతి రాజ్యాంగబద్ద సంస్థల్లోకి తమ వారిని జొప్పిస్తూ ప్రధాని మోదీ వాటిని తన సొంత ఆస్తులుగా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేరళలోని సొంత ఎంపీ నియోజకవర్గం వయనాడ్‌లో ప్రచారంలో భాగంగా సోమవారం వల్లిమండలో రోడ్‌షో నిర్వహించి అక్కడి పార్టీ కార్యకర్తలు, ఓటర్లనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటనీ బీజేపీ హస్తగతం చేసుకుంటున్న తీరు మీకందరికీ అర్థమయ్యే ఉంటుంది. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఇలా ప్రతి రాజ్యాంగబద్ధ విభాగంలోనూ తమ అస్మదీయులను జొప్పించడంలో ఆర్ఎస్ఎ‹స్, బీజేపీ బిజీగా ఉన్నాయి. అవే రాజ్యాంగబద్ధ సంస్థల పరిరక్షణ కోసం విపక్షాల ‘ఇండియా’ కూటమి పాటుపడుతోంది. ఇవి ఎవరి సొంత సంస్థలుకావు. ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తులు అస్సలు కావు. ఇవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడివి. రాజ్యాంగాన్ని సవరించబోతున్నట్లు ఒక బీజేపీ ఎంపీ ఇటీవలే ప్రకటించారు. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. రాజ్యాంగాన్ని తమకు నచి్చనట్లు మార్చేసి జాతి సమున్నత ఆశయాలను సమాధిచేయాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. ‘‘ కేరళను నాగ్‌పూర్(ఆర్ఎస్ఎస్ ప్రధానకేంద్రం) పాలించకూడదు. సొంత పట్టణాలు, పల్లెల నుంచే పరిపాలన సాగాలి. కేరళ ప్రజలకు ఏం కావాలో, వాళ్లేం ఆశిస్తున్నారో ఢిల్లీ(మోదీ సర్కార్)కి ఎలా తెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు. ‘‘ఎంతోకాలంగా డిమాండ్‌చేస్తున్నా సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ వయనాడ్ జిల్లాలో ఇంతవరకు ఒక్క వైద్యకళాశాలను ఏర్పాటుచేయలేదు. యూడీఎఫ్ ప్రభుత్వం వస్తేగానీ కాలేజీ రాదేమో’’ అని విమర్శించారు. ‘ఇంతటి అందమైన ప్రదేశం వయనాడ్‌లో ఓ వారం పది రోజులు గడపమని మా అమ్మ(సోనియా)కు చెప్పా. ఆమెకు అతి ఉక్కబోత పడదు. భువిపైనే అందమైన ప్రదేశాన్ని మిస్ అవుతున్నావని గుర్తుచేశా’’ అని రాహుల్ అన్నారు. రాహుల్ హెలికాప్టర్లో తనిఖీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి రాహుల్ వచ్చినపుడు ఆయన ప్రయాణించిన హెలీకాప్టర్‌లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లైయింగ్ స్వా్కడ్ తనిఖీల్లో ఎలాంటి చట్టవ్యతిరేక వస్తువులు లభించలేదు. -
‘అమేథీ’లోనూ రాహుల్ పోటీ..!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే ఆయన ఉత్తరప్రదేశ్‌లోని తన పాత నియోజకవర్గం అమేథీ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వయనాడ్‌లో పోలింగ్ ముగిశాక అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనే దానిపై రాహుల్ నిర్ణయించుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు అమేథీ నుంచి కూడా రాహుల్ పోటీ చేశారు. అయితే వయనాడ్‌లో విజయం సాధించిన రాహుల్ గాంధీ అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఓడిపోయారు. ఈసారి రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారా అనే విషయంలో పార్టీ క్యాడర్‌తో పాటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర భారత దేశంలోనూ పార్టీకి ఊపు తీసుకురావాలంటే రాహుల్ అమేథీ నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి.. అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం.. రాహుల్ గాంధీ -
రాహుల్ గాంధీ కోటీశ్వరుడేనా?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన అదే స్థానం నుంచి ఈసారి లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం... ఆయన వద్ద స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు రూ.3.81 కోట్లు, బ్యాంకు ఖాతాలో రూ.26.25 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం తన వద్ద రూ. 55,000 నగదు ఉందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1,02,78,680 ఆర్జించినట్లు పేర్కన్నారు. #Congress leader Rahul Gandhi's Asset and Liability!!👇👇 Assets worth 20,29,52,000. Liability- 49,70,000. Also Invested in Stocks-Mutual Fund and Gold Bond.#stockmarkets #stockmarkets #RahulGandhi #BJP #NarendraModi pic.twitter.com/tx6eCcrWrf — House of Stocks~NISM certified (@CommonInsan) April 4, 2024 రాహుల్ గాంధీ వద్ద రూ.15.2 లక్షల విలువైన బంగారు బాండ్లు కూడా ఉన్నాయి. అలాగే జాతీయ పొదుపు పథకాలు, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో రూ. 61.52 లక్షల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. ఇక ఆయన దగ్గరున్న ఆభరణాల విలువ రూ.4.2 లక్షలు. రాహుల్ గాంధీ చరాస్తుల మొత్తం విలువ రూ.9.24 కోట్లు కాగా, స్థిరాస్తుల మొత్తం విలువ దాదాపు రూ.11.14 కోట్లు. ఆయన నామినేషన్‌తోపాటు అందించిన వివరాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగా ఉంది. అదే సమయంలో సుమారు రూ.49.7 లక్షల అప్పు కూడా ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement