-
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
ఎటావా/సీతాపూర్: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలను పక్కనపెట్టి, కేవలం సొంత కుటుంబాల బాగు కోసమే ఆరాటపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రాబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి తాను శ్రమిస్తున్నానని చెప్పారు. తనకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బిడ్డలు లేరని, ప్రజల బిడ్డల శ్రేయస్సు కోసం తాము తపన పడుతున్నామని వివరించారు.ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా, దౌరాహ్రాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే 1,000 సంవత్సరాల పాటు భారత్ శక్తివంతమైన దేశంగా కొనసాగడానికి పునాది రాయి వేస్తున్నానని ప్రకటించారు. తాను ఉన్నా, లేకున్నా భారతదేశం ఉంటుందని, అందుకే దేశాన్ని శక్తివంతంగా మార్చాలని సంకలి్పంచానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టల నాయకులు కేవలం సొంత భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కోసమే ఎన్నికల్లో నెగ్గాలనుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నేతలు వారి కుటుంబాలకు, ఓటు బ్యాంక్‌కు మాత్రమే లబ్ధి చేకూర్చాలని తహతహలాడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... మోదీ వారసత్వం అంటే ఇదే.. ‘‘వారసత్వ పార్టీల నేతలు సాధించేదేమిటి? కార్లు, బంగళాలు, రాజకీయ పలుకుబడి సంపాదించుకోవడం తప్ప వారికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఏం తెలుసు? ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి, కన్నౌజ్, ఎటావా లోక్‌సభ స్థానాలను కొందరు వారి సొంత సామ్రాజ్యాలు అనుకుంటున్నారు. మరికొందరు ఆమేథీ, రాయ్‌బరేలీని వారి సొంత జాగీర్లుగా భావిస్తున్నారు. నా వారసత్వం ప్రజలందరికీ చెందుతుంది. 2047లో పేద ప్రజల కుమారులు, కుమార్తెలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కావాలన్నదే నా కోరిక. రాజకుటుంబాల వారసులు మాత్రమే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యే దుష్ట సంప్రదాయాన్ని ఈ చాయ్‌వాలా బద్ధలు కొట్టాడు. సమాజంలో దురాచారాలపై నిషేధం కోసం పోరాడిన రాజారామ్ మోహన్ రాయ్‌ను ఇప్పటికీ స్మరించుకుంటున్నాం. పాత సంప్రదాయానికి చరమగీతం పాడేసి, పేదల బిడ్డలు సైతం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేసిన ప్రధానమంత్రి ఉండేవాడు, ఆయన ఒక చాయ్‌వాలా అని భవిష్యత్తు తరాలు చెప్పుకొనే రోజు వస్తుంది. మోదీ వారసత్వం అంటే పేదలకు పక్కా ఇళ్లు, కోట్లాది మంది మహిళలకు మరుగుదొడ్లు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు విద్యుత్, గ్యాస్ కనెక్షన్, కుళాయి నీళ్లు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మట్లేదు కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి తమను పావులుగా వాడుకుంటున్నాయని ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వారు విపక్షాలకు దూరంగా ఉంటున్నారు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మడం లేదు. ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రభుత్వ పథకాలతో మైనార్టీలూ లబ్ధి పొందుతున్నారు. దూరమవుతున్న ముస్లిం ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు కొత్త ఆట మొదలుపెట్టాయి. బుజ్జగింపు వ్యవహారాలకు దిగుతున్నాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని బాబా సాహెబ్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ స్పష్టం చెప్పారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మొండిగా వాదిస్తున్నాయి. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా? కాంగ్రెస్ రాజకుమారుడు ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో ఆలయాల చుట్టూ తిరిగాడు. కోటుపై జంధ్యం కూడా ధరించాడు. ఈసారి మాత్రం ఆయన ఆలయాలకు వెళ్లడం మానేశారు. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత ఆలయం నిర్మించుకున్నాం. దేశ ప్రజలంతా సంతోíÙంచారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహ్వానం పంపిస్తే కాంగ్రెస్ నాయకులు తిరస్కరించారు. నేను ద్వారకలో సముద్రగర్భంలో కృష్ణుడికి పూజలు చేయడాన్ని కాంగ్రెస్ రాజకుమారుడు విమర్శించాడు. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా?’’ అని ప్రధాని మోదీ ఆక్షేపించారు. అయోధ్య బాలరాముడి సేవలో మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఆలయ ప్రాణప్రతిష్ట తర్వాత బాలరాముడిని మోదీ దర్శించుకోవడం ఇదే మొదటిసారి. అనంతరం అయోధ్యలో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. -
Viral Video: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్ దాడి
విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్మిస్ట్రెస్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్‌పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్‌పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ గొడవకు దిగింది. అంతేగాక టీచర్‌పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్‌తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024 -
Lok Sabha Election 2024: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాల్లో ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం ఉదయం ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి అనూహ్యంగా రాహుల్ గాంధీ పోటీకి దిగుతున్నారు. సోనియా గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన కిశోరీలాల్ శర్మ అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. రాహుల్, కిశోరీలాల్ శుక్రవారమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరుగనుంది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ అభ్యరి్థత్వం ఖరారు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ స్థానంలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దింపాలని పలువురు కాంగ్రెస్ సీనియర్లు పట్టుబట్టారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు చేస్తోందని, ఆ పారీ్టలో సోనియా గాంధీ కుటుంబానిదే అసలు పెత్తనం అంటూ బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరూ ఊహించని విధంగా రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన సోనియా గాంధీ ఈసారి పోటీ చేయడం లేదు. ఆమె ఇప్పటికే రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. రాహుల్ గాం«దీని పోటీ చేయించడం ద్వారా ఇక్కడ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని, తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తన తల్లి సోనియా గాంధీ 20 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«దీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలతో కలిసి రాహుల్ తన నామినేషన్ పత్రాలను రాయ్‌బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ హర్షితా మాథుర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు ‘గో బ్యాక్ రాహుల్’ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యరి్థగా ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్‌తో బరిలో నిలిచారు. రూ.20 కోట్లకు పైగా ఆస్తులు తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు రాహుల్ తన నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.3.81 కోట్ల విలువైన షేర్లతో కలిపి రూ.9.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలియజేశారు. రూ.26.25 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.15.21 కోట్ల విలువైన గోల్డ్ బాండ్ల ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేతిలో రూ.55 వేల నగదు ఉందని, రూ.49.79 లక్షల అప్పులు ఉన్నాయని ప్రస్తావించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాహుల్ వార్షికాదాయం రూ.1.02 కోట్లు. మా కర్మభూమి రాయ్‌బరేలీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడం తనకు భావోద్వేగ సమయమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘మా కుటుంబానికి కర్మభూమి అయిన రాయ్‌బరేలీని మా తల్లి సోనియా గాంధీ ఎంతో నమ్మకంతో నాకు అప్పగించారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసుకొనే భాగ్యం కల్పించారు. అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలు నాకు వేర్వేరు కాదు. ఇవి రెండూ నా సొంత కుటుంబం లాంటివే. 40 ఏళ్లుగా ఆమేథీ నియోజకవర్గానికి సేవలందిస్తున్న కిశోరీలాల్ శర్మ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేస్తుండడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు సాగుతున్న ఈ పోరాటంలో అందరూ నాకు అండగా నిలుస్తున్నారన్న విశ్వాసం ఉంది’’ అని రాహుల్ వెల్లడించారు. -
PM Narendra Modi: డరో మత్.. భాగో మత్
బర్ధమాన్/కృష్ణనగర్/చైబాసా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా ్రస్తాలు విసిరారు. డరో మత్.. భాగో మత్(భయపడొద్దు.. దూరంగా పారిపోవద్దు) అంటూ రాహుల్‌కు సూచించారు. కేరళలోని వయనాడ్‌లో పోలింగ్ పూర్తికాగానే కాంగ్రెస్ యువరాజు అక్కడి నుంచి పారిపోయి మరో స్థానం వెతుక్కుంటాడని ఇంతకుముందే చెప్పానని, తాను చెప్పినట్లే జరిగిందని అన్నారు. కాంగ్రెస్ యువరాజు వయనాడ్‌లో ఓటమి తప్పదని గ్రహించి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వయనాడ్‌కు పారిపోయాడని, ఇప్పుడు అక్కడినుంచి రాయ్‌బరేలీకి వచ్చాడని పేర్కొన్నారు. ఈసారి అమేథీలో పోటీ చేసే ధైర్యం లేక రాయ్‌బరేలీని ఎంచుకున్నాడని ఎద్దేవా చేశారు. భయపడొద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు తరచుగా ప్రజలకు చెబుతుంటారని, తాను అదే మాట ఇప్పుడు వారికి చెబుతున్నానని అన్నారు. ఇకనైనా భయపడడం, దూరంగా పారిపోవడం ఆపేయాలని రాహుల్ గాం«దీకి హితవు పలికారు. శుక్రవారం పశి్చమ బెంగాల్‌లోని బర్ధమాన్–దుర్గాపూర్, కృష్ణనగర్, బీర్భుమ్, బోల్పూర్ లోక్‌సభ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచార సభల్లో, జార్ఖండ్‌లోని చైబాసాలో ‘మహా విజయ్ సంకల్ప సభ’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభ మసకబారుతోందని, ప్రజాదరణ కోల్పోతోందని, ఈ ఎన్నికల్లో ఆ పారీ్టకి చరిత్రలోనే అత్యంత తక్కువ స్థానాలు లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కనీసం 50 సీట్లయినా గెలుచుకోవడం కష్టమేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని చెప్పడానికి ఒపీనియన్ పోల్స్ గానీ, ఎగ్జిట్ పోల్స్ గానీ అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ఓటమి గురించి తాను గతంలోనే పార్లమెంట్లో స్పష్టంగా చెప్పానని గుర్తుచేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు(సోనియా గాం«దీ) లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గుర్తించి, రాజస్తాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నేతలకే లేదన్నారు. ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ ఇంకా మాట్టాడారంటే.. దశాబ్దాలుగా నిశ్శబ్దంగా ‘ఓటు జిహాద్’ దేశంలో ఓటు జిహాద్ ఆట గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. మోదీకి వ్యతిరేకంగా ఓటు జిహాద్ చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలు నోరెత్తడం లేదు. అంటే ఈ పిలుపును ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నట్లే లెక్క. ఓటు జిహాద్లో పాలుపంచుకున్నవారికి ప్రజల ఆస్తులను దోచిపెట్టాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి బుజ్జగింపు తప్ప మరో విధానం లేదు. మతం ఆధారంగా ఇప్పటికే మన దేశాన్ని ముక్కలు చేశారు. సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు అవతలి గట్టుపై చిక్కుకొని నానా కష్టాలూ పడుతున్నారు. వారికి న్యాయం చేకూర్చడానికి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. కానీ, విపక్షాలు మాత్రం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో వనరులపై, సందపపై ముమ్మాటికీ పేదలకే మొదటి హక్కు ఉంది. ఈ భూగోళంపై ఏ శక్తి కూడా మన రాజ్యాంగాన్ని మార్చేయలేదు. 15 సీట్లు కూడా నెగ్గలేని తృణమూల్ కాంగ్రెస్, 50 సీట్లయినా దక్కించుకోలేని కాంగ్రెస్ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మాత్రమే ఉంది. పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందువులను రెండో తరగతి పౌరులుగా మార్చేసింది. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోంది. ఎన్నికల్లో ఆ పారీ్టకి బుద్ధి చెప్పాలి. చిత్తుచిత్తుగా ఓడించాలి. ప్రజలను లూటీ చేసినవారిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని గ్యారంటీ ఇస్తున్నా’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. మూడు సవాళ్లపై సమాధానమేదీ? దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీలు బీజేపీకి మద్దతుగా నిలుస్తుండడం చూసి కాంగ్రెస్ భరించలేకపోతోంది. అందుకే వారి రిజర్వేషన్లు లాక్కొని మైనారీ్టలకు కట్టబెట్టాలని పథకం వేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘జిహాదీ ఓటు బ్యాంక్’ కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడం తథ్యం. కాంగ్రెస్‌తోపాట విపక్ష కూటమికి నేను 3 సవాళ్లు విసురుతున్నా. మొదటిది.. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చబోమని లేదా మతం ఆధారం రిజర్వేషన్లు ఇవ్వబోమని దేశ ప్రజలకు లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి. రెండోది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాజేయబోమని, మతం ఆధారంగా ఆయా వర్గాల ప్రజలను విభజించబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. మూడోది.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు కలి్పంచబోమని లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి. ఈ మూడు సవాళ్లపై ప్రతిపక్షాలు నోరుమెదపడం లేదు. నాకు సమాధానం ఇవ్వడం లేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్‌లైట్స్
కాంగ్రెస్‌కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్‌కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement