-
ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం మరో ఛాన్స్ - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం మార్చి 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 జూన్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండంతో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఫ్రీ సర్వీస్ మై ఆధార్ (#myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనే వారు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. మీ ఆధార్ కార్డును ఎలా అప్డేట్ చేసుకోవాలంటే.. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని ఉపయోగించి లాగిన్ చేయాలి. లాగిన్ అయిన తరువాత మీకు డాక్యుమెంట్ అప్డేట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. ఏ వివరాలను అప్డేట్ చేసుకోవాలో దాన్ని సెలక్ట్ చేసుకుని, అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయడానికి ముందు మీ వివరాలను ద్రువీకరించుకోవాలి. కేవలం myAadhaar పోర్టల్ మాత్రమే జూన్ 14 వరకు డాక్యుమెంట్ల ఆధార్ అప్డేట్లను ఉచితంగా అందిస్తుంది. ఫిజికల్ ఆధార్ కేంద్రాలలో ఈ దీని కోసం రూ. 50 ఫీజు వసూలు చేస్తారు. 50 రూపాయలకంటే ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే ఆపరేటర్ మీద చర్యలు తీసుకుంటారు. #UIDAI extends free online document upload facility till 14th June 2024; to benefit millions of Aadhaar holders. This free service is available only on the #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar pic.twitter.com/eaSvSWLvvt — Aadhaar (@UIDAI) March 12, 2024 -
ఒరిజినల్ ఆధార్ పీవీసీ కార్డు.. ఇంటికే కావాలంటే ఇలా చేయండి..
Aadhar PVC Card: ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ. 50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. పీవీసీ కార్డ్‌లను పాలీ వినైల్ క్లోరైడ్‌తో తయారు చేస్తారు. అందుకే వీటిని పీవీసీ కార్డ్‌లు అంటారు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ కార్డ్. దీనిపై ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయండిలా.. యూఐడీఏఐ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యూఐడీఏఐ వెబ్సైట్లో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్ చేయండి ఓటీపీ కోసం ‘Send OTP’పై క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయండి అనంతరం 'మై ఆధార్' విభాగానికి వెళ్లి, 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు వస్తాయి. దీని తర్వాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ రూ. 50 రుసుము డిపాజిట్ చేయాలి. చెల్లింపును పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ పీవీసీ కార్డ్ కోసం ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత యూఐడీఏఐ ఆధార్‌ను ప్రింట్ చేసి ఐదు రోజుల్లోగా ఇండియా పోస్ట్‌కి అందజేస్తుంది. పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఆధార్ పీవీసీ కార్డును డెలివరీ చేస్తుంది. -
ఆధార్ కార్డ్ దారులకు ముఖ్యగమనిక.. త్వరలో ముగియనున్న డెడ్‌లైన్!
ఆధార్ కార్డ్ దారులకు ముఖ్య గమనిక. ఆధార్‌లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉచితంగా చేసుకునేందుకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు ఈ ఏడాది మార్చి 14తో ముగియనుంది. ఈ తేదీలోపే ఏమైనా మార్పులు చేసుకోవాలని ఆధార్ ప్రతినిధులు కోరుతున్నారు. 2023 డిసెంబర్లో మూడు నెలల పాటు పొడిగించబడిన ఉచిత ఆధార్ అప్డేట్ మార్చి 14, 2024కి ముగియనుంది. ఈ గడువు గతంలో చాలాసార్లు పొడిగించింది కేంద్రం. మార్చి 14 తర్వాత ఈ గడువు పొడిగిస్తుందా?లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఉచిత ఆధార్ అప్డేట్ గడువు: మార్చి 14, 2024 (ఇది చివరి పొడిగింపు) ఎవరు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు: ఇప్పటికే తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయని వారు ఎవరైనా ఏ వివరాల్ని ఆధార్‌లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు: పేరు, చిరునామా,మొబైల్ నంబర్ వంటి జనాభా వివరాలు (బయోమెట్రిక్ అప్డేట్లకు ఇప్పటికీ ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం అవసరం) మార్చి 14 తర్వాత ఏం జరుగుతుంది: ఆధార్ అప్డేట్ల కోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆధార్‌ను ఆన్లైన్లో ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలంటే ♦ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://myaadhaar.uidai.gov.in/ ♦ మీ ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయండి. ♦ ‘సెండ్ ఓటీపీ’ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన కోడ్‌ను ఎంటర్ చేయండి ♦ అనంతరం అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. ♦ ఇక్కడే మీరు ఆధార్‌లో ఏం మార్పులు చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. సంబంధిత కాలమ్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ♦ అవసరమైన మార్పులను చేయండి, ఇందుకోసం అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. ♦ సంబంధిత వివరాలను నమోదు చేసి రిక్వెస్ట్‌పై క్లిక్ చేయండి. -
ఆధార్ కార్డు రద్దు చేసుకునే అవకాశం - ఎప్పుడు.. ఎలా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని ప్రకటించింది. అయితే ఇప్పుడు యూఐడీఏఐ ప్రకారం.. కొత్త ఫామ్ ఉపయోగించి 18 సంవత్సరాలు నిండిన వారు ఆధార్ నెంబర్ సైతం రద్దు చేసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త ఆధార్ రూల్స్ ప్రకారం, ఆధార్ కార్డు ఉన్న వారు 18 ఏళ్ళు నిండిన తరువాత కార్డుని రద్దు చేసుకోవచ్చు. దీనికోసం యూఐడీఏఐ ఫామ్-9ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. కొన్ని సందర్భాల్లో మాత్రమే రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డబుల్ ఆధార్ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లను కలిగి ఉన్న సందర్భంలో.. ఒక ఆధార్ నెంబర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకటి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అందులో కూడా ఏవైనా మార్పులు.. చేర్పులు వంటివి చేఉకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది. ఫోటోపై ఫోటో వచ్చినప్పుడు ఆధార్ కార్డులో ఫోటొపైన ఫోటో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది. కొన్ని సందర్భాల్లో కొత్త ఫోటో గ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను వినియోగించడం, లేదా బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ నమోదు చేసిన సందర్భంలో వినియోగదారుడు ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు. బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించకుండా ఉండటానికి పెద్దలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడిగా నమోదు చేసుకుని ఉంటే.. అలాంటి ఆధార్ నెంబర్ కూడా రద్దు చేసుకోవచ్చు. షెడ్యూల్ VI 27(1)(c) ప్రకారం, ఆధార్ నంబర్ హోల్డర్ అయిన నివాసి, పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, అతని/ఆమె ఆధార్ నంబర్‌ను రద్దు చేయడానికి ప్రాంతీయ అధికార కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడు నెలల్లో కార్డు రద్దు చేస్తారు. ఆధార్ నెంబర్ రద్దు చేసుకున్న తర్వాత.. ఆధార్ నంబర్ హోల్డర్‌కు అథారిటీ అందించే సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇదీ చదవండి: రోహిత్ శర్మ అపార్ట్మెంట్స్ అద్దెకు.. నెలకు లక్షల్లో సంపాదన ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ 5 లేదా 15 సంవత్సరాలు నిండిన ఆధార్ నంబర్ హోల్డర్ అతని/ఆమె బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడంలో విఫలమైతే, అతని/ఆమె ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత అప్డేట్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు. -
Aadhaar rules: మారిన ఆధార్ రూల్స్.. ఇకపై మరింత సులువుగా..
ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త నిబంధనలను జారీ చేసింది. ఆధార్ (నమోదు మరియు నవీకరణ) సవరణ నిబంధనలు, 2024గా పేర్కొంటూ దేశ పౌరులు, ప్రవాస భారతీయులకు ఆధార్ నమోదు, అప్డేట్ ప్రక్రియ మరింత సులువుగా ఉండేలా కొత్త మార్పులు చేసింది. యూఐడీఏఐ విడుదల చేసిన జనవరి 16 నాటి నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ నమోదు చేసుకోవడానికి, దానిలోని సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడానికి రెండు కొత్త ఫారమ్‌లను యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. ఆధార్ ఎన్రోల్మెంట్/అప్డేషన్ కోసం దేశ పౌరులు, ఎన్నారైలకు వేర్వేరు ఫారమ్‌లను జారీ చేసింది. సమాచారం అప్డేట్ యూఐడీఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కార్డుదారులు సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో తమ సమాచారాన్ని సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. నమోదు కేంద్రం, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ తాజాగా అవకాశం కల్పించింది. అంతకుముందు 2016లో ప్రవేశపెట్టిన నియమాల ప్రకారం.. చిరునామాల మార్పునకు మాత్రమే ఆన్లైన్ మోడ్‌లో అవకాశం ఉండేది. డాక్యుమెంట్ అప్డేషన్, సమాచారం, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉండేది. వయసు రుజువు తప్పనిసరి సవరించిన నిబంధనల ప్రకారం.. వయసు రుజువు కోసం డాక్యుమెంటరీ ఫ్రూఫ్ కచ్చితంగా ఉండాలి. దీని ఆధారంగానే ఆధార్ కార్డ్‌పై పూర్తి పుట్టిన తేదీని ముద్రిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా లేదా కుటుంబ పెద్ద నిర్ధారణ ఆధారంగా ఆధార్ కోసం ఎన్రోల్మెంట్, వివరాల అప్డేట్ చేయవచ్చని యూఏడీఏఐ తెలిపింది. మరోవైపు ఎన్నారైలు ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ ఎన్నారైలు విదేశీ మొబైల్ నంబర్‌ను అందిస్తే ఆ నంబర్‌కు ఆధార్ సంబంధిత మెసేజ్‌లు వెళ్లవు. సవరించిన ఫారాలు దరఖాస్తుదారులకు మరింత సులువుగా ఉండేందుకు యూఐడీఏఐ పాత ఫారమ్‌లను సవరించింది. ఫారం 1: ఆధార్ నమోదు, నవీకరణ ఫారం 2: ఎన్నారైల కోసం ఫారం 3: దేశంలో చిరునామా ఉన్న ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల కోసం ఫారం 4: ఐదు నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న ఎన్నారై పిల్లల కోసం ఫారం 5: భారతీయ చిరునామా ఉన్న ఐదేళ్లలోపు పిల్లల కోసం ఫారం 6: ఐదేళ్ల లోపు ఎన్నారై పిల్లల కోసం ఫారం 7: భారత్‌లో నివాసం ఉండే 18 ఏళ్లు నిండిన విదేశీ పౌరుల కోసం ఫారం 8: భారత్‌లో నివాసం ఉండే 18 ఏళ్ల లోపు విదేశీ పిల్లల కోసం ఫారం 9: ఆధార్ నంబర్ రద్దు కోసం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement