-
తొలి రౌండ్లోనే రష్మిక పరాజయం
షార్లోట్స్విల్ డబ్ల్యూ–75 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రష్మిక 2–6, 2–6తో గాబ్రియేలా ప్రైస్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
టైటిల్ పోరుకు యూకీ–అల్బానో జోడీ
మ్యూనిక్: భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడోసారి ఏటీపీ –250 టోర్నీలో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి జంట 6–1, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎర్లెర్–మెడ్లెర్ (ఆ్రస్టియా) ద్వయంపై గెలిచింది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో–ఫ్రెంచ్ జోడీ ఏడు ఏస్‌లు సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
సెమీఫైనల్లో రిత్విక్ జోడీ పరాజయం
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్–నిక్కీ పునాచా జోడీ 4–6, 6–3, 7–10తో మత్సుజెవ్‌స్కీ (పోలాండ్)–మాథ్యూ రొమియోస్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో అర్జున్–జీవన్ (భారత్) ద్వయం 4–6, 7–6 (7/5), 10–8తో జాన్సన్ (బ్రిటన్)–మన్సూరి (ట్యూనిషియా) జంటపై నెగ్గి ఫైనల్ చేరింది. -
మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని భారత్ గెలుపు
చాంగ్షా (చైనా): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు రెండో విజయం సాధించింది. చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1తో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–3, 6–2తో హావో చింగ్ చాన్‌ను ఓడించింది. రెండో మ్యాచ్ లో అంకిత రైనా 6–2, 4–6, 4–6తో ఎన్ షువో లియాంగ్ చేతిలో ఓటమి పాలైంది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన జోడీ 4–6, 6–1, 15–13తో హావో చింగ్ చాన్–ఎన్ షువో లియాంగ్ జంటపై గెలిచి భారత్‌కు విజయాన్ని అందించింది. టైబ్రేక్‌లో అంకిత జోడీ మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. -
మళ్లీ నంబర్‌వన్‌గా బోపన్న.. తన రికార్డు తానే తిరగరాసుకున్నాడు
ఫ్లోరిడా: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. గతవారం రెండో ర్యాంక్‌లో నిలిచిన 44 ఏళ్ల రోహన్ బోపన్న తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో సోమ వారం విడుదల చేసిన ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 95వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గత వారం 97వ ర్యాంక్‌లో నిలిచిన సుమిత్ రెండు స్థానాలు పురో గతి సాధించాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ 61 స్థానాలు ఎగబాకి 349వ ర్యాంక్‌లో నిలిచాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్‌లైట్స్
కాంగ్రెస్‌కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్‌కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement