-
పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐ కండిషన్ ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్.. మెగా టోర్నీని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే కరాచీ, లాహోర్, రావల్పిండిలను వేదికలుగా ఖరారు చేసింది.అవకాశమే లేదుఈ నేపథ్యంలో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? అన్న సందేహాలు తలెత్తాయి. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత జట్టు పాక్‌లో పర్యటించే అవకాశమే లేదని విశ్లేషకులు అంటున్నారు.గతంలో ఆసియా వన్డే కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దక్కించుకున్నప్పటికీ.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా ఆసియా కప్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడిన విషయం తెలిసిందే.బీసీసీఐ స్పందన ఇదేఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత ప్రభుత్వం ఎలా చెబితే మేము అలా నడుచుకుంటాం.కేంద్రం అనుమతినిస్తేనే టీమిండియాను పాకిస్తాన్‌కు పంపిస్తాం. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టే మేము ముందుకు వెళ్తాం’’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో రోహిత్ సేన విజేతగా నిలవగా.. శ్రీలంక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఇక ఆఖరిసారి 2017లో నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచిన పాకిస్తాన్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై ఈవెంట్ జరుగనుండటం బాబర్ ఆజం బృందానికి సానుకూలాంశంగా పరిణమించింది.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్#WATCH | Delhi: On the Champion Trophy to be held in Pakistan next year, BCCI vice-president Rajeev Shukla said, "In the case of the Champion Trophy, we will do whatever the Government of India will tell us to do. We send our team only when the Government of India gives us… pic.twitter.com/TeA3dZ5Twn— ANI (@ANI) May 6, 2024 -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
టీమిండియా సారధి రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకోనున్నాడు. త్వరలో ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికైన హిట్‌మ్యాన్ ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లకు ఎంపికైన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. 2007 ఎడిషన్ నుంచి వరుసగా అన్ని ఎడిషన్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. తొలి ప్రపంచకప్ ఛాంపియన్ జట్టైన టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఆతర్వాత 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ఎడిషన్లలోనూ భాగమయ్యాడు. తదుపరి ప్రపంచకప్ ఎడిషన్ హిట్‌మ్యాన్‌కు తొమ్మిదో ఎడిషన్ కానుంది. ప్రపంచ క్రికెట్లో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ ఉల్ హసన్ కూడా తొలి ఎనిమిది ఎడిషన్లలో పాల్గొన్నాడు. బంగ్లా ప్రపంచకప్ జట్టును ప్రకటించాల్సి ఉంది. రాబోయే ప్రపంచకప్‌లో షకీబ్ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. వయసు పైబడిన రిత్యా అతను ప్రపంచకప్ ఆడతాడో లేదో తెలీదు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనత కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది. హిట్‌మ్యాన్ ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 39 మ్యాచ్‌లు ఆడాడు. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత విరాట్ కోహ్లి.. అత్యధిక వికెట్ల రికార్డు షకీబ్ పేరిట ఉన్నాయి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ తొమ్మిదో ఎడిషన్ ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ఈ టోర్నీ జరుగనుంది.తొలి మ్యాచ్ యూఎస్ఏలోని డల్లాస్ నగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్ఏ జట్టు.. కెనడాతో తలడనుంది.మెగా టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా.. ఐర్లాండ్‌తో తలపడుతుంది. ప్రపంచకప్‌లో బిగ్ ఫైట్, దాయాదుల సమరం జూన్ 9న జరుగునుంది. ఈ మెగా సమరానికి న్యూయార్క్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. -
రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో రోహిత్ ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడని.. దాంతో సరదాగా అతడిని తాము ఏడిపించేవాళ్లమని పేర్కొన్నాడు.అయితే, రోహిత్‌కు మాత్రం అందరితో కలిసి ఉండటం ఇష్టమని.. అతడు గొప్ప మనసున్న వ్యక్తి అంటూ యువీ కొనియాడాడు. ఈసారి రోహిత్ శర్మ కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఇంత వరకూ నో ఐసీసీ టైటిల్స్!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ టైటిల్ అందించలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన భారత్.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ చేతులెత్తేసింది.ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లోనూ బోల్తాపడి తృటిలో ట్రోఫీని చేజార్చుకుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా వన్డే కప్-2023 మినహా ఒక్క మెగా ఈవెంట్లోనూ రోహిత్ సేన ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.రోహిత్‌కు ఇంగ్లిష్ రాదుఈ క్రమంలో ప్రస్తుతం అందరి కళ్లు టీ20 ప్రపంచకప్-2024 మీదే ఉన్నాయి. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఈసారైనా టైటిల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలుకానున్న ఈ ఐసీసీ టోర్నీకి యువరాజ్ సింగ్ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడుతూ యువీ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి అసలు ఇంగ్లిష్ రాదు. ముంబైలోని బోరివలీ వీధుల నుంచి వచ్చిన వాడు. చాలా సరదాగా ఉంటాడు.ఇంగ్లిష్ విషయంలో మాత్రం అతడిని మేము ఏడిపించేవాళ్లం. భాష సంగతి పక్కనపెడితే అతడి మనసు మాత్రం వెన్న. ఎంత ఎదిగినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. రోహిత్ శర్మలో గొప్ప గుణం అదే.నా బెస్ట్ ఫ్రెండ్ తాను సరదాగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న వాళ్లకు కూడా వినోదం పంచుతాడు. గొప్ప నాయకుడు. క్రికెట్ రంగంలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో రోహిత్ కూడా ఒకడు.ఈసారి రోహిత్ శర్మ వరల్డ్‌కప్ ట్రోఫీ ఎత్తాలని.. వరల్డ్‌కప్ మెడల్ మెడలో వేసుకుంటే చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇందుకు వందకు వంద శాతం అర్హుడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.అతడే సరైన కెప్టెన్ ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఉండటం బీసీసీఐ తీసుకున్న సరైన నిర్ణయమని ఈ సందర్భంగా యువీ అన్నాడు. ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు గెలిచిన రోహిత్ లాంటి వ్యక్తి టీ20 వరల్డ్‌కప్-2024లోనూ భారత్‌ను ముందుకు నడిపించడం సానుకూలాంశమని పేర్కొన్నాడు.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే! -
వరుసగా నాలుగో టీ20లో టీమిండియా జయకేతనం
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. నిన్న (మే 6) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 56 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (39), స్మృతి మంధన (22), హేమలత (22), రిచా ఘోష్ (24) రాణించడంతో 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్ అనంతరం మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 125 పరుగులుగా నిర్దారించారు. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన బంగ్లాదేశ్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వరుసగా నాలుగో మ్యాచ్‌లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లు దీప్తి శర్మ (3-0-13-2), ఆశా శోభన (3-0-18-2), రాధా యాదవ్ (3-1-12-1), పూజా వస్త్రాకర్ (3-0-15-1) బంగ్లా బ్యాటర్లను వణికించారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో దిలారా అక్తెర్ (21) టాప్ స్కోరర్‌గా నిలిచింది.నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ మే 9న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈ సిరీస్ విజయం మాంచి బూస్టప్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. -
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 ఎడిషన్ ఫిక్చర్లు, గ్రూప్‌ల వివరాలను ఐసీసీ ఇవాళ (మే 5) ప్రకటించింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి.గ్రూప్-ఏలో చిరకాల ప్రత్యర్దులు భారత్, పాక్‌లతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, క్వాలిఫయర్-1 ఉండగా.. గ్రూప్ బిలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్-2 జట్లు పోటీపడనున్నాయి. రెండు గ్రూప్‌ల్లోని జట్లు తమతమ గ్రూప్‌ల్లోని ఇతర జట్లతో చెరో మ్యాచ్ ఆడతాయి. గ్రూప్ దశ అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరుగుతుంది. రెండు సెమీస్‌లకు, ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డేస్ ఉన్నాయని ఐసీసీ ప్రకటించింది. 19 రోజుల పాటు జరిగే ఈ మెగా సమరం ఢాకా, సిల్హెట్ మైదానాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిక్చర్స్ లాంచింగ్ ప్రోగ్రాంను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్, బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తాన్ ప్రారంభించారు.దాయాదుల సమరం ఎప్పుడంటే.. పొట్టి ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు సిల్హెట్ మైదానం వేదిక కానుంది. భారత్ మ్యాచ్‌లు అక్లోబర్ 4 (న్యూజిలాండ్), 9 (క్వాలిఫయర్-1), 13 (ఆస్ట్రేలియా) తేదీల్లో జరుగనున్నాయి.మరోసారి హాట్ ఫేవరెట్‌గా ఆసీస్..డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మహిళల పొట్టి ప్రపంచకప్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు జరగగా.. ఆసీస్ ఏకంగా ఆరుసార్లు జగజ్జేతగా నిలిచింది. 2009లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాగా.. తొలి ఎడిషన్‌లో ఇంగ్లండ్.. 2016 ఎడిషన్‌లో వెస్టిండీస్ విజేతలుగా నిలిచాయి. 2016 ఎడిషన్‌లోనూ ఆసీస్ ఫైనల్ వరకు చేరింది అయితే తుది సమరంలో విండీస్ ఆసీస్‌కు ఊహించని షాక్ ఇచ్చి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆసీస్ 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఎడిషన్లలో విజేతగా నిలువగా.. భారత్ 2020లో ఫైనల్ దాకా వెళ్లి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement