-
సీఎం జగన్ ను కాపీ కొట్టిన చంద్రబాబు.. కానీ గెలుపు మాదే
-
శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ
శ్రీకాకుళం, సాక్షి: జనం అంతా జగన్ వెంటే.. మేమంతా సిద్ధం యాత్రతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీలో చేరారు. వీళ్లలో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు YSRCP కండువా కప్పుకున్నారు.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్సీపీలో చేరారు.సీఎం జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. -
సిక్కోలులో జన సంద్రం
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తొలి సూర్యకిరణాలు తాకే అరసవెల్లి సూర్యనారాయణమూర్తి సాక్షిగా జననేతను సిక్కోలు అక్కున చేర్చుకుంది. మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటన అనంతరం శ్రీకాకుళం జిల్లా అక్కివలసలోని రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలుకరించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే పరిసర గ్రామాలకు చెందిన పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రియతమ నేతను కళ్లారా చూడాలని, వీలైతే ఓ సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహం చూపారు.బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమైన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజు సుమారు 64 కి.మీ. మేర సాగి టెక్కలి నియోజకవర్గం అక్కవరం బహిరంగ సభతో ముగిసింది. రాత్రి బస శిబిరం వద్ద శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌ను కలిశారు. సీఎం వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు ఆరా తీసి దిశానిర్దేశం చేశారు.అనంతరం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో అక్కివలస నుంచి ప్రారంభమైన యాత్ర ఆమదాలవలస కొత్తరోడ్డు, మడపాం, నిమ్మాడ, పొడుగుపాడు, కోటబొమ్మాళి జంక్షన్, కన్నెవలస, చమయ్యపేట వరకు సాగింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం నేతలతో కలసి అక్కవరం బహిరంగ సభ ప్రాంగణం వద్దకు సీఎం చేరుకున్నారు. ‘సిద్ధం సిద్ధం.. సీఎం సీఎం’ అంటూ మిన్నంటిన నినాదాలతో సభా ప్రాంగణం సముద్ర హోరును తలపించింది. సీఎం మాట్లాడుతుండగా ఆకాశం మేఘావృతంఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైన యాత్రకు అక్కచెల్లెమ్మలు హారతులు పట్టారు. జగనన్న తెచ్చిన వలంటీర్లు, సచివాలయాలతో తమ పనులు సులభతరమైపోయాయని, కార్యాలయాలు చుట్టూ తిరిగే దుస్థితి తప్పిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పొద్దున్నే ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ పింఛన్ ఇస్తున్నారని, ఇంత మేలు చేసిన జగన్ బాబును చూడాలని వచ్చామని తమ ఆనందాన్ని పంచుకున్నారు.మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. సీఎం జగన్ అక్కవరం సభలో ప్రసంగిస్తుండగా మేఘాలు కమ్ముకున్నాయి. సభా ప్రాంగణంలో చినుకులు రాలడం, సమీపంలో వర్షం కురవడంతో హర్షాతిరేకాలు మిన్నంటాయి. జగన్ రాకతో తమ ప్రాంతం చల్లబడిందని, ఆయన అడుగుపెట్టిన చోట మంచే జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మహిళలు నినాదాలు చేశారు.♦ పుట్టుకతో వినికిడి లోపం కలిగిన తన కుమారుడు త్రిషాన్ రెండు చెవులకు 2022లో ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా చేయడంతో చిన్నగా మాట్లాడగలుగుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్ సీఎం జగన్ వద్ద ఆనందం వ్యక్తం చేశాడు. అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ఆయన సీఎం జగన్‌కు కలిశారు. ♦ ‘మేమంతా సిద్ధం’ యాత్ర మడపాం టోల్గేట్ వద్దకు చేరుకునేసరికి అభిమానులతో కిక్కిరిసిపోయింది. భారీ క్రేన్‌తో తెచ్చిన నవరత్నాల పథకాల మాలతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడ తనను కలసిన ఓ దివ్యాంగుడికి మూడు చక్రాల మోటార్ సైకిల్ అందజేస్తామని సీఎం జగన్ భరోసా వచ్చారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ బాధితురాలికి కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుటుంబం అంతా జగనన్న అభిమానులంమా కుటుంబం మొత్తం జగనన్న అభిమానులం. జగనన్న పాదయాత చేసినప్పుడు నేను చదువకుంటున్నా. మా జిల్లాకు వచ్చినప్పుడు సెల్ఫీ కూడా తీసుకున్నా. ఇప్పుడు మా పాప రెండో తరగతి చదువుతోంది. జగనన్నను చూడాలని రాత్రి నుంచి మారాం చేయడంతో ఉదయం 7 గంటలకే అక్కివలస తీసుకొచ్చాం. జగనన్న చేపట్టిన విద్య, వైద్య సంస్కరణలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తున్నాయి. వాటిని కళ్లారా చూస్తున్నాం. – పి.సంతోషిమణి, శ్రీకాకుళం మా తొలి ఓటు జగనన్నకే.. నాన్న అబ్దుల్ సలీమ్ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తుండగా అమ్మ నసీమాబేగం గృహిణి. తక్కువ ఆదాయం ఉన్న మాలాంటి కుటుంబాలకు జగనన్న దేవుడు. మా అక్క, నా చదువు పూర్తిగా జగనన్న విద్యా దీవెనతోనే పూర్తయింది. ఇంటి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం చేయడంతో సొంతిల్లు కట్టుకున్నాం. మా కుటుంబం ఆనందంగా ఉందంటే అది జగనన్న పుణ్యమే. మా అక్కకు, నాకు తొలిసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. తొలి ఓటు ఫ్యానుకే వేస్తాం. జగనన్నను చూశాకే అక్కివలస నుంచి ఇంటికి వెళతా. – నజీమా, విజయనగరం -
రేపు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా..
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్ బస్సు యాత్ర ముగియనుంది. యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు అక్కివలస(రాత్రి బస చేసిన ప్రాంతం) నుంచి బయల్దేరుతారు. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకుబయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి అక్కవరం హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం విమాశ్రయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 6.15 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. 6.30 గంటలకు విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టునుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు. చదవండి: మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్ మీడియా వింగ్ జనమే సైన్యంగా సంక్షేమసారథి యాత్ర సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. 43 నుంచి 45 డిగ్రీల మండుటెండల్లోనూ.. రాత్రి పొద్దుపోయినా సీఎం జగన్‌ను చూసేందుకు ప్రజలు ఆరాటపడుతున్నారు. సీఎం జగన్‌ను దగ్గరి నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే ఫోటో దిగేందుకు బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. అడుగడుగునా జనంతో మమేకమవుతూ.. బాధితులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. జనమే సైన్యంగా సంక్షేమ రథసారథి ప్రారంభించిన బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగియనుంది. ఇప్పటిదాకా 21 రోజులు పాటు 22 జిల్లాల్లో యాత్ర సాగింది. బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలు.. వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ 15 భారీ బహిరంగ సభల్లో(మంగళవారం సభతో సహా) పాల్గొని ప్రసంగించారు. -
ప్రగతి పథం...శ్రీకాకుళం గమనం...
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు అండగా నిలిచారు. పలాసలో రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేసి 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ వ్యాధులపై రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. ఇక్కడి కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరే అని తేలడంతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 807 గ్రామాలకు ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. సుమారు 5,57,633 మందికి తాగునీరు అందించారు. మూలపేట పోర్టు నిర్మాణంతో మత్స్యకారులకు ఆసరా దొరికింది. ► రూ.141.70 కోట్లతో 650 రైతు భరోసా కేంద్ర భవనాలు మంజూరు కాగా రూ.67.67 కోట్లతో 270 భవనాలు పూర్తి ► రూ.262 కోట్లతో 654 గ్రామ సచివాలయ భవనాలు మంజూరు కాగా రూ.146.74 కోట్లతో 360 భవనాలు పూర్తి ► రూ.31.20 కోట్లతో 195 డిజిటల్ లైబ్రరీ భవనాలు మంజూరుకాగా 22 భవనాల నిర్మాణం. ► రూ.93.62 కోట్లతో 535 విలేజ్ క్లినిక్ భవనాలు మంజూరు కాగా రూ.48.42 కోట్లతో 122 భవనాలు పూర్తి.. ఐదు రూరల్ పీహెచ్‌సీలు, 11 అర్బన్ హెచ్‌సీలు సాగుకు సాయం ► జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు, 7 ఇంటిగ్రేటె డ్ ల్యాబ్‌లు నిర్మించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 3.21 లక్షల మందికి రూ.1,919.46 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 87,158 మందికి రూ.85.14 కోట్లు అందజేశారు. ► రూ.424.74 కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలు సబ్సిడీపై అందించారు. ► 82,745 మెట్రిక్ టన్నుల ఎరువులు, 5592 లీటర్ల నానో యూరియా వంటివి అందించారు. ► చిన్న, సన్నకారు రైతుల కోసం 505 ట్రాక్టర్లు, మల్టిపుల్ క్రాప్ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్ హార్వెస్టర్స్ వంటివి అందించారు. ► 10వేల భూసార పరీక్షలు చేశారు. 27,049 కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చారు. ఉద్యోగాల కల్పన ► సచివాలయాల ఏర్పాటు ద్వారా 7880 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పంచారు. – ప్రతి పీహెచ్‌సీకి అదనంగా ఒక్కో డాక్టర్ వంతున 66 మంది నియామకం ► పీహెచ్‌సీల్లో 108, 104 వాహనాల్లో కొత్తగా 2199 మంది నియామకం ► ఎంప్లాయిమెంట్ కార్యాలయం, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 9018 ఉద్యోగాలు జలయజ్ఞానికి ఊతం ► జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వంశధార ఫేజ్ 2లోని స్టేజ్ 2 పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా రూ.176.35 కోట్లు వెచి్చంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మిస్తున్నారు. మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్ షోర్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.852 కోట్లు మంజూరు చేశారు. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65 కోట్లు మంజూరు చేశారు. ► మత్స్యకారుల సంక్షేమం, వివిధ ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా మూలపేటలో రూ.2,949.70 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మత్స్యకారుల కోసం రూ.365.81 కోట్లతో బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, వజ్రపుకొత్తూరు మండలంలోని నీళ్లపేటలో రూ.11.95 కోట్లతో జెట్టీ నిర్మిస్తున్నారు. మెరుగుపడిన మార్గాలు ► గడచిన ఐదేళ్లలో ఆర్అండ్బీ పరిధిలో రూ.526.69 కోట్లతో 633.4 కిలోమీటర్లకు సంబంధించి 432 రోడ్లు మంజూరు చేయగా చాలా వరకూ పూర్తయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78 కోట్లతో 484.43 కిలోమీటర్ల మేర 312 రోడ్లు మంజూరు కాగా 266 రోడ్ల పనులు జరుగుతున్నాయి. ► ఆర్సీపీఎల్డబ్ల్యూ కింద రూ.70.96 కోట్లతో 94.30 కిలోమీటర్ల పొడవున 23 రోడ్లు మంజూరు చేయగా వాటిలో రూ.55.55 కోట్లతో 21రహదారుల నిర్మాణం పూర్తయింది. ► పీఎంజీఎస్‌వై బ్యాచ్ 1 కింద రూ.51.27 కోట్లతో 11 పనులు మంజూరు కాగా 10 పనులు, బ్యాచ్ 2లో రూ.38.23 కోట్లతో 8 పనులు మంజూరు కాగా 6 పూర్తయ్యాయి. ► ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవు గల 312 పనులు చేపడుతున్నారు. రెన్యువల్ వర్క్స్ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవున 83 పనులు చేపడుతున్నారు. ► గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 102 గ్రామాలకు ఉపయోగపడేలా 42 సీసీ, బీటీ రోడ్లు వేశారు. నగరపాలక, పురపాలక సంఘాల్లో రూ.16.60 కోట్లతో 115 రహదారులను అభివృద్ధి చేశారు. మరో రూ.300 కోట్లతో జిల్లాలో 12 భారీ వంతెనలు నిర్మించారు. బలసలరేవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.87 కోట్లు మంజూరు చేశారు. ► పాతపట్నం 50 పడకల సామాజిక ఆస్పత్రిని రూ.4.2 కోట్లతో, జొన్నవలస ఆస్పత్రిని రూ.2.45 కోట్లతో, లావేరులో రూ.1.2 కోట్లతో, సోంపేట సామాజిక ఆస్పత్రిని రూ.4.60 కోట్లతో, బారువ సామాజిక ఆస్పత్రిని రూ.5.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. నాడు నేడు కింద 83 ఆస్పత్రులను రూ.47 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసన్నపేట ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ► ఇంటింటికి తాగునీరు సరఫరాకు రూ.1552.36 కోట్లతో 4822 పనులు ప్రారంభించగా, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. జగనన్న హౌసింగ్ కాలనీలో తాగునీరు అందించేందుకు 791 పనులను రూ.38.4 కోట్లతో చేపడుతున్నారు. సుపరిపాలన సుసాధ్యమయ్యేలా... ► జాతిపిత కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా జిల్లాలో 835 గ్రామ సచివాలయాలు, 95 వార్డు సచివాలయాల ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నారు. వీటి ద్వారా మొత్తం 512 రకాల సేవలు అందిస్తుండగా, ఇప్పటివరకూ 47,27,732 మందికి సేవలందాయి. ► విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా సామాన్య, పేద వర్గాలకు గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా రూరల్ ప్రాంతాల్లో 5 పీహెచ్‌సీలు, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర అర్బన్ ప్రాంతాల్లో 11 పీహెచ్‌సీలు నిర్మించారు. శ్రీకూర్మం ఆస్పత్రిలో చాలా మార్పులొచ్చాయి గతంలో శ్రీకూర్మం ఆస్పత్రి వద్దకు వచ్చేవాడిని. కూర్చోడానికి కూడా అవకాశం ఉండేది కాదు. పాడుబడిన భవనం ఉండేది. ఇరుకైన గదులు, ఎవ్వరూ కూడా సరిగ్గా ఉండేవారు కాదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్లినట్టుంది. ఈ ప్రభుత్వం వచ్చాక గదులు అందంగా తయారు చేశారు. అన్ని పరీక్షలు రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నారు. అన్ని సలహాలు చెబుతూనే మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. అలాగే మా గ్రామంలోకి డాక్టరమ్మలు వచ్చి ఆరోగ్యం కోసం అడుగుతున్నారు. అవసరమైన మందులు కూడా ఇంటి వద్దనే ఇస్తున్నారు. –గేదెల తవుడు, దువ్వుపేట, గార మండలం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement