-
Samsung : రూ.10,000 కోట్ల వ్యాపార లక్ష్యం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం శామ్సంగ్ టీవీల అమ్మకాల ద్వారా 2024లో భారత మార్కెట్లో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. రూ.10 వేల కోట్ల మైలురాయిని చేరుకోవడం ఇప్పటి వరకు ఏ కంపెనీ సాధించలేదని కంపెనీ వెల్లడించింది. మధ్య స్థాయి, ప్రీమియం టీవీల విభాగంలో పరిమాణం పరంగా వృద్ధిలో ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా విజువల్ డిస్ప్లే బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. ‘ప్రీమియం టీవీలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశాం. కంపెనీ విక్రయాల్లో ఈ విభాగం వాటా 40%. యూహెచ్డీ, పెద్ద స్క్రీన్ టీవీల విక్రయాలతో ఈ ఏడాది వృద్ధి ఉంటుంది. ప్రీమియం ఉత్పత్తులకు మెట్రోలు, చిన్న పట్టణాల నుంచీ డిమాండ్ ఉంది’ అని వివరించారు. సంస్థకు 21 శాతం వాటా.. శామ్సంగ్ భారత్‌లో 2022–23లో రూ.98,924 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇందులో 70 శాతం మొబైల్స్ అమ్మకాల ద్వారా కాగా మిగిలినది టీవీలు, ఇతర ఉపకరణాల ద్వారా సమకూరింది. దేశీయ టీవీల విపణిలో పరిమాణం పరంగా సంస్థకు 21 శాతం వాటా ఉంది. శామ్సంగ్ తాజాగా ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ టీవీలను భారత్‌లో ప్రవేశపెట్టింది. పిక్చర్ స్పష్టంగా, సహజత్వం ఉట్టిపడేలా ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటి ప్రారంభ ధర రూ.1.39 లక్షలు. ఓఎల్ఈడీ టీవీల ప్రారంభ ధర రూ.1.64 లక్షలు. కాగా, శామ్సంగ్ దేశీ విక్రయ టీవీల్లో 90% భారత్‌లో తయారైనవే. దేశంలో ఏటా అన్ని బ్రాండ్లలో కలిపి 1.2 కోట్ల యూనిట్ల టీవీలు అమ్ముడవుతున్నాయని అంచనా. -
మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ..
ఫీచర్ పోన్ నుంచి స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన తర్వాత క్రమంగా కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. వారి ఊహలకు తగ్గట్టుగానే కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టాయి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ టూల్‌కు కొద్దిగా సమాచారం అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్‌ను అందించే సామర్థ్యం ఉంటుంది. గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమెరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది. వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయడం వంటివి రియల్‌టైమ్‌లోనే జరుగుతాయి. మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్ తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లో ఏఐ ఆధ్వర్యంలో పనిచేసే స్నాప్‌డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది. మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, అతడు ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సర్కిల్ డ్రా చేసి సెర్చ్ చేస్తే ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు సెకన్లలో డిస్ప్లే అవుతాయి. మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఏఐ ఆ మాటలను మనకు తెలుగులోనే వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి అందిస్తుంది. సర్వీసులు ఉచితమేనా అధిక క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలే ప్రస్తుతానికి ఈ ఏఐ రంగంలో ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ఏఐలో ప్రాసెసర్లు, చిప్‌ల వాడకం అధికంగా ఉంటుంది. వాటికి పెద్దమొత్తంలో పెట్టుబడుతులు అవసరమవుతాయి. చిన్న కంపెనీలు ఆ ఖర్చును భరించలేవు. అదే పెద్ద కంపెనీల వద్ద అధికంగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఉంటారు. కాబట్టి వారికి సాధ్యం అవుతుంది. ఇదీ చదవండి: సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని అయితే కంపెనీలు వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే పరిస్థితులు కూడా రావొచ్చొని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఈ స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ ఇదే.. ధర ఎంతంటే?
డయాబెటిస్ బాధితులు ప్రతినిత్యం చక్కెర స్థాయి తెలుసుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడల్లా వేలిని సూదితో గుచ్చి నెత్తుటిచుక్కలు బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నెత్తుటిచుక్కల ద్వారానే ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్లూకోమీటర్లు చక్కెర స్థాయిని నిర్ధారించగలుగుతున్నాయి. ఇప్పటి వరకు డయాబెటిస్ బాధితులకు ప్రతిరోజూ ఈ నొప్పి తప్పడంలేదు. ఎలాంటి నొప్పి లేకుండానే, నెత్తుటి చుక్క చిందించకుండానే చక్కెర స్థాయిని కచ్చితంగా చెప్పగలిగే స్మార్ట్‌వాచీని కొరియన్ కంపెనీ ‘శామ్సంగ్’ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌వాచీ మీటల మీద చేతి మధ్యవేలు, ఉంగరంవేలు కొద్ది క్షణాలు అదిమిపెట్టి ఉంచితే చాలు, శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో స్క్రీన్ మీద చూపిస్తుంది. ‘శామ్సంగ్’ రూపొందించిన ఈ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ చక్కెర స్థాయితో పాటు శరీరంలో కొవ్వు పరిమాణం, కండరాల పరిమాణం వంటి వివరాలను కూడా చెబుతుంది. దీని ధర 81.26 డాలర్లు (సుమారు రూ.6750) మాత్రమే! -
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ కింగ్ ఇదే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత స్మార్ట్‌ఫోన్స్ విపణిలో శామ్సంగ్ హవా కొనసాగుతోంది. 2023లో 18 శాతం వాటాతో శామ్సంగ్ అగ్రస్థానంలో నిలిచినట్టు పరిశోధన కంపెనీ సైబర్‌మీడియా రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. గతేడాది 16 శాతం వాటాతో వివో రెండవ స్థానంలో, 13 శాతం వాటాతో వన్‌ప్లస్ మూడవ స్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే గతేడాది భారత స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్ 19 శాతం వృద్ధి చెందింది. 5జీ మోడళ్ల వాటా ఏకంగా 65 శాతానికి ఎగబాకింది. 5జీ స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2023లో 122% వృద్ధి సాధించడం విశేషం. ఫీచర్ ఫోన్లకూ గిరాకీ.. రూ.7–25 వేల ధర శ్రేణిలో 5జీ మోడళ్ల వాటా 58 శాతంగా ఉంది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 47 శాతం నమోదైంది. రూ.25,000లకుపైగా ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్స్ విభాగం గతేడాది 71 శాతం ఎగబాకింది. రూ.50,000పైగా విలువైన సూపర్ ప్రీమియం మోడళ్ల విక్రయాలు 65 శాతం పెరిగాయి. 2022తో పోలిస్తే ఫీచర్ ఫోన్ల విభాగంలో అమ్మకాలు గతేడాది 52 శాతం అధికం అయ్యాయి. 4జీ ఫీచర్ ఫోన్లు ఈ దూకుడుకు కారణం అయ్యాయి. 2జీ ఫీచర్ ఫోన్స్ 12 శాతం క్షీణించాయి. రిలయన్స్ జియో 38 శాతం వాటాతో ఫీచర్ ఫోన్స్ విభాగంలో ముందు వరుసలో ఉంది. ఐటెల్ 23 శాతం, లావా 15 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నాల్గవ త్రైమాసికంలో.. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ 29 శాతం దూసుకెళ్లింది. 19 శాతం వాటాతో షావొమీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. శామ్సంగ్ 18.9 శాతం, వివో 16, రియల్మీ 12, ఒప్పో 8, యాపిల్ 6 శాతం వాటా దక్కించుకున్నాయి. 2023 యాపిల్ అమ్మకాల్లో ఐఫోన్–15 సిరీస్ 50 శాతంపైగా వాటా చేజిక్కించుకుంది. ఇక 2024లో స్మార్ట్ఫోన్ల విపణి దేశవ్యాప్తంగా 7–8 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. 5జీ మోడళ్ల అమ్మకాలు 40 శాతం పెరిగే ఆస్కారం ఉంది. 4జీ ఫీచర్ ఫోన్స్ 10 శాతం దూసుకెళ్లవచ్చు. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్‌లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్‌లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement