-
ప్రశాంత్ - రణవీర్ సినిమా స్టార్ట్! జై హనుమాన్ కంటే ముందుగానే..!
-
డైరెక్టర్ కూతురి రెండో పెళ్లి.. స్టెప్పులతో అదరగొట్టిన స్టార్స్
ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఏప్రిల్ 15న జరిగిన ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, సూర్య, కమల్ హాసన్ సహా దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం ఎంతో వైభవంగా రిసెప్షన్ నిర్వహించగా బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా సౌత్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లేలా చేశారు. వీరితోపాటు శంకర్ రెండో కూతురు, హీరోయిన్ అదితి శంకర్ కూడా ఎంతో హుషారుగా చిందేయడం విశేషం. ఇక వీరంతా తమిళ హిట్ సాంగ్స్‌కు కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐశ్వర్య శంకర్ గతంలో క్రికెటర్ దామోదర్ రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో ఐశ్వర్య తన నుంచి విడాకులు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ కార్తికేయన్‌తో నిశ్చితార్థం జరగ్గా రెండు రోజులక్రితమే ఘనంగా వివాహం జరిపించారు. #RanveerSingh & #AditiShankar dancing for ThalapathyVijay & #Trisha's Apadi Podu Song 🤩🔥pic.twitter.com/RFXuZLSZo1 — Kolly Corner (@kollycorner) April 16, 2024 చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్ తనయుడు -
Deepika Padukone: ఫైనల్లీ ఆ టాటూని తొలగించిన దీపికా పదుకొణె!
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో దీపికొ పదుకొణె- రణ్వీర్ సింగ్ జంట ఒకటి. రామ్ లీలా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. 2018 నవంబర్ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ బ్యూటీ ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చిందనే విషయాన్ని రణ్వీర్ వెల్లడించాడు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. శనివారం దీపికా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేసింది.అందులో ఆమె మెడ కనిపించేలా వెనుక వైపు తిరిగి ఉంది. గతంలో ఆమె వీపు భాగంపై ఓ టాటూ ఉండేది. ఇప్పుడది కనిపించలేదు. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో రణ్వీర్ సింగ్‌తో పెళ్లి కంటే ముందు దీపికా పదుకొణె మరో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ఇద్దరి ప్రేమ విషయం బాలీవుడ్ అంతా తెలుసు. పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. కానీ కారణం ఏంటో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రణ్‌బీర్‌తో స్నేహం ఏర్పడడం..అది కాస్త ప్రేమగా మారడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే రణ్‌బీర్‌తో ప్రేమలో ఉన్న సమయంలో దీపికా తన వీపుపై RK(రణ్‌బీర్ కపూర్ షార్ట్ కట్) అని టాటూ వేయించుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ టాటూని చెరిపేయలేదు. దీంతో అప్పట్లో ఈ టాటూపై బాలీవుడ్లో పెద్ద చర్చే జరిగింది. కానీ దీపికా మాత్రం ఆ టాటూపై స్పందించలేదు. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. ప్రెగ్నెంట్ అయిన తర్వాత దీపికా ఆ టాటూని తొలగించిందనే నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
ఇప్పుడిదే ట్రెండ్.. రజనీ రెండు సినిమాల్లోనూ..!
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైభీమ్' ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం. ఇదిలా ఉంటే జూన్ నెలలో ప్రారంభం కానున్న రజనీ 171వ చిత్రానికి సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కారణం ఈ చిత్రానికి లోకేష్‌కనకరాజ్ దర్శకత్వం వహించడమే! సపోర్టింగ్ రోల్స్.. రజనీకాంత్ ఇటీవల కాలంలో తన చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల కోసం ఇతర భాషలకు చెందిన స్టార్ నటులను వాడుకుంటున్నారు. జైలర్ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్‌లు అతిథి పాత్రల్లో నటించారు. అలాగే తాజాగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. షారుక్ 'నో'.. రణ్వీర్ 'ఓకే' త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న రజనీకాంత్ 171 చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ముందుగా షారుక్ ఖాన్‌ను నటింపజేయడానికి లోకేష్ కనకరాజ్ ప్రయత్నించగా, ఆయన నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రానికి కళుగు (తెలుగులో గద్ద) అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్‌తో కలిసి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తాజా సమాచారం. అయితే ఆయన ఇందులో సపోర్టింగ్ పాత్రను పోషిస్తారా?లేక ప్రతినాయకుడిగా నటిస్తారా? అన్నది సస్పెన్స్! చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది? -
ఛీ, ఒంటి మీద దుస్తుల్లేకుండా కనిపించే ఆ హీరోనా?: నటుడు ఫైర్
ఇండియా ఫస్ట్ సూపర్ హీరో శక్తిమాన్.. ఈ సూపర్ హీరో పాత్రలో నటుడు ముకేశ్ ఖన్నా నటించాడు. నటించాడు అనడం కన్నా జీవించాడనే చెప్పాలి. అయితే కొన్నాళ్లుగా శక్తిమాన్ మళ్లీ రాబోతున్నాడని ప్రచారం జోరందుకుంది. అయితే ఈసారి టీవీలో కాకుండా వెండితెరపై రానుందని, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నోరు విప్పక తప్పట్లేదు ఈ క్రమంలో సదరు వార్తలపై ముకేశ్ ఖన్నా స్పందించాడు. 'రణ్వీర్ సింగ్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని కొన్ని నెలలుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై చాలామంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. నేను మాత్రం సైలెంట్‌గానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఛానల్స్ కూడా రణ్వీర్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని ప్రచారం మొదలుపెట్టాయో.. అప్పుడే ఇక నోరు విప్పక తప్పదని నిర్ణయించుకున్నాను. అయినా ఒంటిమీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్లు చేసే వ్యక్తి శక్తిమాన్‌గా కనిపిస్తాడా? ఇదేమైనా బాగుందా అసలు? ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? అతడు ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? నేనైతే నా అభిప్రాయం చెప్పాను. ఇప్పుడేమవుతుందో చూద్దాం.. విచ్చలవిడితనం సర్వసాధారణమైన విదేశాల్లో రణ్వీర్ తనకు నచ్చిన పాత్రలు చేస్తే బాగుంటుంది. నేను నిర్మాతలతో కూడా మాట్లాడాను. శక్తిమాన్ అంటే సూపర్ హీరో మాత్రమే కాదు సూపర్ టీచర్ అని నొక్కి చెప్పాను! ఒక నటుడు ఆ పాత్ర చేస్తున్నాడంటే చక్కగా మాట్లాడగలగాలి, జనాలు అతడు చెప్తే వినగలిగేలా ఉండాలి. కొందరు హీరోలు పేరుకే పెద్ద.. కానీ వారి ఇమేజ్ ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది' అని సెటైర్లు వేశాడు ముకేశ్. View this post on Instagram A post shared by Mukesh Khanna (@iammukeshkhanna) చదవండి: లైసెన్స్ పొందా.. దుబాయ్‌లోనే ఉంచా.. అందులో తిరుగుతుంటే మజా..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement