-
పుష్ప స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. బన్నీ రిప్లై అదిరిపోయింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ పుష్పకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసన మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పుష్ప.. పుష్ప.. పుష్ప.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. అయితే ఈ సాంగ్‌లో బన్నీ చేసిన షూ డ్రాప్ స్టెప్ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటోంది. ఈ స్టెప్ వేస్తున్న వీడియోను చూసిన పుష్ప వీరాభిమాని డేవిడ్ వార్నర్ రిప్లై ఇచ్చారు. ఓ డియర్.. ఎంత బాగా చేశావ్.. ఇప్పుడు నేను కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ కోసం కొంత వర్క్ చేయాలి' అంటూ కామెంట్ చేశాడు.అయితే డేవిడ్ వార్నర్ కామెంట్‌కు బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. మనిద్దరం కలిసినప్పుడు తప్పకుండా హుక్ స్టెప్ నేర్పిస్తానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. 'ఇది చాలా సులభం...మనం కలిసినప్పుడు ఎలా చేయాలో నీకు చూపిస్తా' అని కామెంట్స్‌లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా.. పుష్ప సినిమా నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్‌కు నటనకు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి బన్నీకి వీరాభిమాని అయిపోయారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పుష్ప డైలాగ్స్‌తో అలరిస్తుంటారు. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
Pushpa2 The Rule : ‘పుష్ప2’ మూవీ స్టిల్స్
-
పుష్ప-2 ఫస్ట్ సింగిల్.. రిలీజ్ టైమ్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ డేట్ అండ్ టైమ్‌ను ప్రకటించారు మేకర్స్.మే 1వ తేదీన ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024 -
పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘పుష్ప–2 ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ‘పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్...’ అంటూ సాగే టైటిల్ సాంగ్ తొలి లిరికల్ వీడియో ్రపోమోను విడుదల చేశారు మేకర్స్. పూర్తి పాటని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప: ది రైజ్’ (2021) పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘పుష్ప–2 ది రూల్’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సునీల్, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సీఈఓ: చెర్రీ. -
పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం (ఏప్రిల్ 24) రిలీజ్ చేశారు. కొద్దిరోజుల క్రితమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే పూర్తి పాటను కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ చిత్రం బన్నీ మార్కెట్ స్థాయిని పెంచేలా ఉంది. ఈ సినిమా సుమారు రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ థియేట్రికల్ హక్కులు రూ. 200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నార్త్‌లో ఇంతటి భారీ మొత్తానికి అమ్ముడుపోయిన తొలి సినిమాగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది.పుష్ప ది రైజ్ చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. తగ్గేదే లే అంటూ ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్‌ను విస్తరిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే రెండో భాగాన్ని తెరకెక్కించారు మేకర్స్ . ఈ చిత్రం కోసం సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారు పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన బలమని చెప్పవచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement