-
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్‌కు వచ్చి.. వరుసగా ఏడు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచాడు. అంతేకాదు ధనాధన్ ఇన్నింగ్స్‌తో వింటేజ్ తలాను గుర్తు చేస్తూ అభిమానులను అలరించాడు.కానీ పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌తో ఈ ఫీట్లకు తెరపడింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి.. రనౌట్ అయ్యాడు.నిజానికి రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 62) అవుటైన తర్వాత ఏడో స్థానం(పద్దెనిమిదో ఓవర్ ఆఖరి బంతి)లో క్రీజులోకి వచ్చిన ధోని ప్రమాదకరంగా మారతాడని భావించగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అనూహ్యంగా స్పిన్నర్ రాహుల్ చహర్‌ను బరిలోకి దించాడు.అప్పటికి పేసర్ హర్షల్ పటేల్ ఒక్క ఓవర్ మాత్రమే వేసి ఉన్నా.. చహర్ వైపే మొగ్గు చూపి సామ్ కరన్ కీలక సమయంలో ప్రయోగానికి దిగాడు. అయితే, అతడి అంచనాలను నిజం చేస్తూ రాహుల్ చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ధోని లాంటి అద్భుతమైన ఫినిషర్ క్రీజులో ఉన్నా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. కీలకమైన పందొమ్మిదో ఓవర్లో కేవలం 3 పరుగులే ఇవ్వడంతో పాటు మొయిన్ అలీ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో చెన్నై విజయానంతరం పంజాబ్ సారథి సామ్ కరన్ మాట్లాడుతూ.. ‘‘ప్రయోగాలు అన్నిసార్లూ ఫలితాలను ఇస్తాయనే నమ్మకం లేదు. కానీ నేను రాహుల్ చహర్ ఆత్మవిశ్వాసాన్ని చూసి అతడి చేతికి బంతినిచ్చాను.అతడు తన ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితం రాబట్టాడు. ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో సీఎస్కే విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలోనే ఛేదించి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. The artist performing his art 🎨 😎Chepauk roars to MS Dhoni's fireworks 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #CSKvPBKS | @ChennaiIPL pic.twitter.com/WE7AnyBR8e— IndianPremierLeague (@IPL) May 1, 2024 -
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ .. చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు ధోనికి.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు.అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపిఅయితే, చివరి ఓవర్ మూడో బంతికి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ధోని షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్ మిచెల్ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్‌కు చేరుకున్నాడు.కానీ సింగిల్ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆ తర్వాతి బంతికి సిక్స్ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా స్పందించాడు.ధోని అలా చేయడం సరికాదు‘‘ఎంఎస్ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్ గేమ్‌లో ధోని ఇలా సింగిల్‌కు నిరాకరించకుండా ఉండాల్సింది.ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ధోని చర్యను తప్పుబట్టాడు.చదవండి: గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం MS Dhoni denied to run 👀Daryl Mitchell literally ran 2 Runs 😅Next Ball, MS hits a huge SIX 👏If this has been done by Virat Kohli or Rohit Sharma, then people start calling them Selfish 😳What's your take on this 🤔 #CSKvPBKS #CSKvsPBKS #SRHvsRR pic.twitter.com/ElvrInMDaI— Richard Kettleborough (@RichKettle07) May 2, 2024 -
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రుతురాజ్ మెరిశాడు. 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రుతురాజ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన సీఎస్కే కెప్టెన్‌గా గైక్వాడ్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 509 పరుగులు చేసిన గైక్వాడ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే లెజెండ్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఐపీఎల్-2013లో 461 పరుగులు చేశాడు. తాజా సీజన్‌తో ధోని ఆల్‌టైమ్ రికార్డును గైక్వాడ్ బ్రేక్ చేశాడు. కాగా ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రుతురాజ్(509) కొనసాగుతున్నాడు. రెండో స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(500) పరుగులతో ఉన్నాడు. Most runs by a CSK captain in an IPL season:509* - R Gaikwad in 2024 (10 mat)461 - MS Dhoni in 2013 (18 mat)455 - MS Dhoni in 2018 (16 mat)416 - MS Dhoni in 2019 (15 mat)414 - MS Dhoni in 2008 (16 mat)Ruturaj Gaikwad becomes the first CSK captain to score 500+ runs in an… pic.twitter.com/T73Q8Y3aac— CricTracker (@Cricketracker) May 1, 2024 -
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. సీఎస్కే బ్యాటర్లు కాస్త తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టినప్పటికి రుతురాజ్ మాత్రం ఆచితూచి ఆడి తన జట్టుకు మెరుగైన స్కోర్‌ను అందిచాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. రుతురాజ్‌తో పాటు ధోని 14 పరుగులతో రాణించాడు.పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, రబాడ తలా వికెట్ సాధించారు. -
ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 150 మ్యాచ్‌ల విజయాలలో భాగమైన మొదటి ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించడంతో ధోని ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ధోనికి ఇది ఆటగాడిగా 150వ విజయం. ఐపీఎల్లో ఇప్పటివరకు 259 మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్.. 150 విజయాలు, 109 ఓటుముల్లో భాగమయ్యాడు.42 ఏళ్ల ధోని ఐపీఎల్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతనిథ్యం వహించాడు. సీఎస్కే తరపున 135 మ్యాచ్‌లు, పూణె తరపున 15 మ్యాచ్‌ల విజయాల్లో ధోని పలుపంచుకున్నాడు. ఇక సీఎస్కేను సారథిగా ధోని 5 సార్లు రికార్డు స్థాయిలో టైటిల్‌ను అందించాడు. అయితే ఈ ఏడాది సీజన్‌కు ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అప్పగించేశాడు. ఐపీఎల్లో అత్యధిక విజయాలను అందుకున్న ప్లేయర్స్ వీరే..ఎంఎస్ ధోని - 150రవీంద్ర జడేజా - 133రోహిత్ శర్మ - 133దినేష్ కార్తీక్ - 125సురేష్ రైనా - 122
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
హోం ఓటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
ఆదివారం రాహుల్ గాంధీ..
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం....
రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయండి
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
సై.. అంటే సై!
మహిళలే నిరే్ణతలు
ఆదివారం రాహుల్ గాంధీ..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement