-
లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు?
రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ రీటైల్ వ్యాపారాన్ని విజయ వంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా వ్యాపారంలో రాణిస్తోంది. తాజాగా ఇషా, భర్త ఆనంద్ పిరమల్ ఇంటికి సంబంధించి ఒక ముఖ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇషా ఖరీదైన ఇంటిని ప్రముఖ హాలీవుడ్ జంట కొనుగోలు చేసిందట. ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, ఈ డీల్ మాత్రం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇషా-ఆనంద్ పిరమల్ లాస్ ఎంజేల్స్లోని విలాసవంతమైన భవనాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ టాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ జంట కొనుగోలు చేసిందట. 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇంటిని 'క్వీన్ ఆఫ్ డ్యాన్స్' జెలో,బెన్ దంపతులు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు ఉన్నాయి. ప్రత్యేక జిమ్‌లు, స్పాలు, సెలూన్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి స్పెషల్ వసతులు కూడా లగ్జరీ హౌస్‌లో కొలువు దీరాయి. దాదాపు 61 మిలియన్ డాలర్ల (రూ. 508కోట్లు) ఇంటిని కొనుగోలు చేశారని కూడా ఇన్‌స్టా ఫ్యాన్ పేజీ నివేదించింది. కాగా ఇషాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందే అని చెప్పవచ్చు. ఇషా గర్భంతో ఉన్నపుడు తల్లి నీతాతో కలిసి ఆ ఇంట్లోనే గడిపింది. ఇద్దరు పిల్లలకు ఈ ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే ఈ ఇల్లు విక్రయించడానికి గల కారణాలు ఏంటి అనేదానిపై స్పష్టత లేదు. -
అచ్చం అనంత్ మామలాగే..క్యూట్ కృష్ణ ఫోటో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా ఇషా, 2018 డిసెంబరులో వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఇషా, ఆనంద్ జంటకు కవలలు - కృష్ణ (కుమారుడు) ఆదియా (కుమార్తె) జన్మించారు. అటు తల్లిగా, ఇటు వ్యాపార నిర్వహణలోనూ అంబానీ వారసురాలిగా తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ట్విన్స్‌తో సందడిగా కనిపించింది ఇషా. ఇషాతో ట్విన్స్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అయ్యాయి. ముఖ్యంగా ఇషా కుమారుడు కృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ ఫోటోలు అచ్చం మేనమామ అనంత్ అంబానీలా ఉండటం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ సూట్లో రాయల్ లుక్‌లో చిరునవ్వుల చిందిస్తున్న ఇషా కుమారుడు కృష్ణ, తమ్ముడు అనంత్ కార్బన్ కాపీలా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. " అచ్చం అనంత్ అంబానీ లాగానే ఉన్నాడు అని ఒకరు, "అనంత్ మాము జైసా లగ్తా హై" అని మరొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదుఆ చిన్నారి ధీరూభాయ్ అంబానీలా ఉన్నాడని మరికొందరు కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మామ, అల్లుళ్ల పోలికల ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
కుబేరుల బిడ్డలు : ఘనమైన బహుమతులు, వీటి విలువ తెలుసా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన 4 నెలల మనవడు గ్రాహ్కు రూ. 240 కోట్ల విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏయే సెలబ్రీటీలు తమ వారసులకు ఏయే ఖరీదైన గిఫ్ట్‌లు వార్తల్లో నిలిచాయి. నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి , అపర్ణ కృష్ణన్‌ల కుమారుడైన ఏకగ్రాహ్కు సుధా,మూర్తి దంపతులకు మూడో మనవడు . యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతామూర్తి వీరి పెద్ద కుమార్తె. అక్షత, రిషీలకు కృష్ణ , అనౌష్క అనే ఇద్దరు పిల్లలున్నారు. అంబానీ పెద్ద కోడలి గిఫ్ట్ ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు అంబానీ పెద్ద కోడలు కూడా ఖరీదైన బహుమతి దక్కించుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు. రూ. 451 కోట్ల విలువైన మౌవాద్ ఎల్' నెక్లెస్‌ను నీతా అంబానీ కోడిలికి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. కుమారుడికి పుట్టినరోజుకి పూనావాలా గిఫ్ట్ ఏంటంటే.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, DC కామిక్ పుస్తకాన్ని పోలిన బ్యాట్మొబైల్ను తన కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. 2015లో తన కుమారుడి 6వ పుట్టినరోజు సందర్భంగా, అదార్ పూనావల్ల తన Mercedes-Benz S-క్లాస్‌ని బ్యాట్‌మొబైల్ మోడల్లో తీర్చిదిద్దేలా చేశారు.ఈ మార్పులు పూర్తి చేయడానికి ఆరు నెలలకు పైగా పట్టిందట. శివ నాడార్ కూడా ప్రముఖ టెక్ సంస్థ హెసీఎల్ ఫౌండర్ పౌండర్, ఛైర్మన్ శివ్ నాడార్ 2014లో తన ఏకైక కుమార్తె రోష్ని కోసం ఒక లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. తూర్పు ఢిల్లీలోని ఫ్రెండ్స్ కాలనీలోని ఈ బంగ్లా విలువ రూ. 115 కోట్లు. ఇషా అంబానీ ట్విన్స్ కోసం ఇషా అంబానీ వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్న ఇషా అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖేష్ అంబానీ , నీతా అంబానీ ఏకైక కుమార్తె, ఇషా అంబానీ 2018లో బిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి సందర్భంగానే అజయ్ పిరమల్ స్వాతి పిరమల్ దంపతులు ఇషా , ఆనంద్ పిరమల్లకు ముంబైలోని ‘గులిటా’ అనే ఒక విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.450 కోట్లు అని సమాచారం. అలాగే ఇషా, ఆనంద్ దంపతులు ట్విన్స్ పుట్టిన సందర్భంగా అంబానీ ప్రత్యేకంగా తయారు చేసిన అల్మారాను బహుమతిగా ఇచ్చారు. 2022లో పుట్టిన కృష్ణ-ఆదియాలకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం విశేషం. బిల్‌గేట్స్ ముద్దుల బిడ్డ కోసం మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు , బిలియనీర్ బిల్ గేట్స్ తన కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నాసర్‌పై తనకున్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు. బిల్ గేట్స్ తన కూతురికి 277 కోట్ల రూపాయల విలువైన 124 ఎకరాలగుర్రపు ఫారమ్‌ను బహుమతిగా ఇచ్చాడు. అమెరికాలోని ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్లో ఉన్న ఈ గుర్రపు ఫారమ్‌ను ఎవర్గేట్ స్టేబుల్స్ అంటారు.ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత తన కుమార్తె రైడింగ్ కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ గిఫ్ట్ ఇచ్చారట. -
రాధిక మర్చంట్ డ్రెస్ ధర వింటే...
ఇషా అంబానీ నిర్వహించిన రోమన్ హోలీ ఈవెంట్లో కాబోయే మరదలు రాదికా మర్చంట్ శాటిన్ డ్రెస్‌లో ఆకర్షించింది. అందానికి తగ్గ స్టెయిలష్ బ్రాండ్లతో మరింత అందంగా కనిపించే రాధికా ఈ డ్రస్‌లో సినీ సెలబ్రెటీలను తలదన్నేలా కనిపించింది. కాక్టెయిల్ పార్టీలకు కరెక్ట్‌గా సరిపోయే డ్రస్‌లో అదిరిపోయింది. అందరి అటెన్షన్ ఆమె ధరించే డ్రస్పైనే పడింది. ఈ వేడుకలో ప్రముఖ సెలబ్రెటీలు, బాలీవుడ్ సినీ తారలు తమదైన స్టైయిలిష్ డిజైన్ వేర్లు, ఆభరణాలతో సందడి చేశారు. ఇందులో ఇషా అంబానీ గౌను డిజైనింగ్‌కే 100 గంటలు పట్టగా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన చీరతో స్టన్నింగ్ లుక్‌తో కనిపించింది. ఇక ఈ వేడుకలో రాధిక ధరించిన శాటిన్ డ్రెస్ ధర ఏకంగా రూ. 6.4 లక్షలు పలుకుతుందట. రాధిక ఆ డ్రెస్‌కి తగ్గట్టుగా అత్యంత లగ్జరియస్ ఆభరణాలను కూడా ధరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీలకు కాబోయే కోడలకు తగ్గ రేంజ్లో ఆమె డ్రస్ ధర ఉంది. అలాగే ఆమె నెక్కు ధరించిన నయీమ్ ఖాన్ గోల్డ్ ఆర్మీరీ జోడియాక్ క్లచ్ ధర ఏకంగా రూ. 1.67 లక్షలు. అంతేగాదు ఆమె ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా బంగారంతో డిజైన్ చేసిన లెహంగాతో అందర్నీ మంత్రముగ్ధులన్ని చేసిన సంగతి తెలిసిందే. ఆమె అందానికి తగ్గ సింపుల్ డిజైనింగ్ వేర్లతో అందర్నీ కట్టిపడేసే ఆకర్షణీయమైన అందం రాధిక సొంతం. (చదవండి: ఇషా అంబానీ దుస్తుల డిజైనింగ్‌కి అంత టైం పడుతుందా!) -
ఇషా అంబానీ దుస్తుల డిజైనింగ్‌కి అంత టైం పడుతుందా!
ఇషా అంబానీ శుక్రవారం సాయంత్రం అంబానీ నివాసంలో బల్గారీ సీఈఓ జీన్ క్రిస్టోఫ్ బాబిన్తో కలిసి 'రోమన్ హోలీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ముంబైకి చెందిన ప్రముఖ సెలబ్రెటీలంతా విచ్చేశారు. ఈ వేడుకల్లో ఇషా లుక్ అందర్నీ కట్టిపడేసింది. ఈ రోమన్ హోలీ వేడుకల కోసం అని ఆమె దుస్తులను రూపొందించడానికి చాలా సమయం తీసుకుందట. దీన్నీ ప్రముఖ డిజైనర్ ఆశ్విన్ త్యాగరాజన్ రూపొందించారు. ఇది చక్కటి ఎండ్రాయిడరీ వర్క్‌తో కూడిన లాంగ్ లెంగ్త్ బనారసీ గౌను అని త్యాగరాజన్ అన్నారు. దీన్ని రూపొందించడానికి తమకు ఏకంగా వంద గంటలు పైనే పట్టిందన్నారు. కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణ, టాలీవుడ్ నటి తాప్సీ పన్ను, ఐశ్వర్య రాజేష్ వంటి భారతీయ తారలు త్యాగరాజన్ రూపొందించే ఈ బనారస్ డ్రస్లంటే బహు ప్రీతి. ఇక త్యాగరాజన్ ప్రత్యేకత పర్యావరణ హితంగా దుస్తులను రూపొందించడం. పైగా అవి మన అమ్మలు, అమ్మమ్మల వారసత్వ చీరలు లేదా లెహంగాలతో కొత్తదనం సృష్టించడంలో మంచి నైపుణ్యం గల డిజైనర్ త్యాగరాజన్. చాలామంది సెలబ్రెటీలు మన పూర్వ సంప్రదాయల్ని అనుకరించేందుకు ఇష్టపడుతుండటంలో త్యాగరాజన్ డిజైన్వేర్లకు ఇంతల మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆమె దుస్తులకు సంబంధించిన నైలాన్ని పూర్తిగా సముద్రాలు, ఫిషింగ్ నెట్లు, వస్త్ర ఫైబర్ల వ్యర్థాలను నుంచి ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసి శుద్ది చేసి వాటితో తయారైన నైలాన్‌తో తయారు చేస్తుంది. అంటే ఇక్కడ డిపాలిమరైజేషన్ , శుద్ధికరణతో వచ్చే కొత్త పాలిమర్లను థ్రైడ్లు మార్చడం ద్వారా ఈ కొత్త నైలాన్ని సృష్టిస్తారని చెప్పొచ్చు. అందువల్లే త్యాగరాజన్ డిజైన్వేర్లకు పర్యావరణ అనూకూలమైన ఫ్యాషన్ బ్రాండ్‌గా మంచి పేరొచ్చింది. నిజంగానే బ్రాండ్‌కి తగ్గట్టే త్యాగరాజన్ రూపొందించే డ్రస్‌లు సంప్రదాయంగా ఓ పండుగ వాతవరణం తలిపించే లుక్‌ని, కొత్త ఫ్యాషన్‌ని అందిస్తాయి. (చదవండి: వందేళ్ల క్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement