-
ప్రభుత్వ బడిలో ప్రగతి కెరటాలు
తల్లిదండ్రులు కష్టపడితేనే పూట గడిచే కుటుంబాలకు చెందిన పిల్లలు వీరు. సీఎం వైఎస్ జగన్ సంకల్పంతో అత్యాధునికంగా మారిన ప్రభుత్వ బడుల నుంచి ఐక్యరాజ్య సమితిలో మెరిసిన మెరుపు తీగలు. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 550 నుంచి 590 మార్కులు సాధించి, ప్రతిభను నిరూపించుకున్న ఆణిముత్యాలు.నానాజీ అంకంరెడ్డి, సాక్షి అమరావతి: ప్రభుత్వ బడులు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని టాపర్లుగా నిలిచిన వారికి ఏటా ’జగనన్న ఆణిముత్యాలు’ పేరిట వైఎస్ జగన్ ప్రభుత్వం సత్కరిస్తోంది. రాష్ట్రంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు 22 వేల మందిని ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట నగదు ప్రోత్సాహకాలతో సత్కరించి, పేద విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు.. ఇలాంటి పేదింటి రత్నాలను ప్రభుత్వ ప్రతినిధులుగా 10 మందిని ఎంపిక చేసి ఐక్యరాజ్య సమితికి పంపించారు. అప్పటి వరకు కనీసం జిల్లా కేంద్రాన్ని కూడా చూడని ఈ విద్యార్థులు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకులో ప్రసంగించడం చరిత్ర సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన మార్పులు, మనబడి నాడు – నేడుతో సమకూరిన సదుపాయాలు, ఆధునిక ల్యాబ్స్‌తో జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌లో టాపర్లుగా నిలిచిన మరో ఏడుగురు విద్యార్థులు జపాన్ వెళ్లి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఈ స్థాయిలో ప్రోత్సహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. పేదింటి ఆణిముత్యాలే రాష్ట్ర ప్రతినిధులు 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పేదల పిల్లల విద్యాభివృద్ధిపై దృష్టి సారించారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేశారు. స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి, బోధన ప్రమాణాలు పెంచి, సర్కారు స్కూళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఇదే అంశాన్ని తెలియజేస్తూ గతేడాది ఆగస్టులో న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో ఏపీ విద్యా సంస్కరణలను తెలియజెబుతూ ఏర్పాటు చేసిన స్టాళ్లు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల అభివృద్ధిని స్వయంగా తెలుసుకుంటామని పలు దేశాల ప్రతినిధులు కోరడంతో పాటు ఐక్యరాజ్య సమితికి ప్రతినిధులను పంపాలని ఆహా్వనించారు. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ సదస్సులకు అత్యున్నత అధికారులను పంపిస్తారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పాఠశాలల అభివృద్ధిపై మాట్లాడేందుకు విద్యార్థులే సరైన ప్రతినిధులని సీఎం జగన్ భావించారు. అందుకే ఈ ఆణిముత్యాలను అంతర్జాతీయ వేదికలపై ప్రతినిధులుగా పంపించారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయని మన పిల్లలు 2022–23 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలను 150 మందిని ఎంపిక చేసి, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై పరీక్ష పెట్టారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మందికి ఇంటర్వ్యూలు చేసి, వారి నుంచి 10 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు వీరంతా ప్రభుత్వ ఖర్చుతో అమెరికా వెళ్లి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో స్వయంగా మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత అరుదుగా మాత్రమే ప్రవేశం లభించే అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో సైతం వీరు మాట్లాడే అవకాశం లభించింది. పేదింటి పిల్లలైనా, ప్రభుత్వ చేయూతతో అంతర్జాతీయ స్థాయి విజ్ఞానాన్ని సముపార్జించుకొన్న వీరంతా సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. సీఎం జగన్ ఆదర్శవంతమైన సంస్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు. జపాన్ సకురా సైన్స్ ఫెయిర్‌కూ ఏపీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నాడు – నేడు పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్‌సై్పర్డ్ రీసెర్చ్ (ఇన్‌సై్పర్) పోటీల్లో సత్తా చాటుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులు దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపే ఆకర్షణీయమైన అంశాలు, నమూనాలు తయారు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో లేబొరేటరీలు అత్యాధునికంగా తీర్చిదిద్దడంతో మన విద్యార్థులు గత నాలుగేళ్లుగా ఏటా 40 వేలకు పైగా ప్రాజెక్టులు చేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతున్నాయి. గత నాలుగేళ్లుగా జాతీయ పోటీలకు దాదాపు 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు ప్రభుత్వం పేటెంట్ హక్కులు కూడా ఇస్తుంది. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్‌సై్పర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. ఇక్కడే కాదు.. 2019 నుంచి 2022 వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏడుగురు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించి, ‘జపాన్ సకురా’ అంతర్జాతీయ పోటీలకు ఎంపికై జపాన్‌లో పర్యటించి వచ్చారు.ప్రభుత్వ బడిలో కొత్త ఆవిష్కరణలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించడంతో విద్యార్థులు చేస్తున్న ప్రయోగాలు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకడంతో పాటు పేటెంట్లు సైతం అందుకుంటున్నారు. గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి.కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునేవారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను రూపొందించింది. చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె.ప్రణయ 15 రోజులు కూరగాయలు పాడవకుండా నిల్వ చేసుకునే గార్లిక్ బ్యాగ్‌ను రూపొందించింది. చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి.చరణ్ తేజ బైక్‌పై వెనుక కూర్చున్న వారికి రక్షణగా ఉండే సైడ్ సీట్‌ను తయారుచేశాడు. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురూ వారు నిత్యం చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించడమే కాదు.. గత నవంబర్‌లో జపాన్ వెళ్లి వచ్చారు. మరో నలుగురు విద్యార్థులు వచ్చే నెలలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.అత్యంత సామాన్యుల పిల్లలకే అవకాశం ⇒ ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరు జెడ్పీ స్కూల్లో చదువుకున్న పసుపులేటి గాయత్రి గతేడాది పదో తరగతిలో 590 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. జగనన్న ఆణిముత్యాలు అవార్డు కింద రూ.50 వేలు అందుకుంది. కూలి పనులు చేసే తండ్రి కష్టంపైనే బతుకుతున్న ఈ కుటుంబానికి జగనన్న విద్య, సంక్షేమ పథకాలు దన్నుగా నిలిచాయి. ⇒ కర్నూలు జిల్లా కౌతాళం మండలం పొదలకుంటకు చెందిన మించాలవారి సోమనాథ్, గంగమ్మలకు నలుగురు సంతానంలో ఒకరైన శివలింగమ్మ ఆదోని కేజీబీవీలో పదో తరగతిలో 541 మార్కులు సాధించింది. ⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన వంజవాకం యోగీశ్వర్ తండ్రి నాగరాజు సామాన్య రైతు. చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్న యోగీశ్వర్ గతేడాది పదో తరగతిలో 586 మార్కులు సాధించి జిల్లాలో రెండోస్థానంలో నిలిచాడు. ⇒ విజయనగరంలో మెకానిక్‌గా పనిచేస్తున్న అల్లం రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మిల కుమార్తె రిషితారెడ్డి స్థానిక కస్పా మున్సిపల్ కార్పొరేషన్ హైసూ్కల్లో పదో తరగతిలో 587 మార్కులు సాధించింది. ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన షేక్ ఫాతిమా భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటోంది. ఈమె రెండో కూతురు అమ్మాజాన్ వేంపల్లిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివి గతేడాది పదో తరగతిలో 581 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలు సత్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది. ఇప్పుడు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. ⇒ నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన సి.రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీడ్రైవర్. తల్లి రామలక్ష్మమ్మ ఇంటి వద్ద బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. రాజేశ్వరి నంద్యాలలోని ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదివి 583 మార్కులు సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ బాలిక ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ చదువుతోంది. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రామారావు, మణి దంపతుల రెండో కుమార్తె మోతుకూరి చంద్రలేఖ స్థానిక కేజీబీవీలో చదువుకుని గతేడాది పదో తరగతిలో 523 మార్కులు సాధించింది. జిల్లా టాపర్‌గా నిలిచి జగనన్న అణిముత్యాలు సత్కారం కింద రూ.50 వేల నగదు బహుమతి అందుకుంది. ⇒ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన దడాల సింహాచలం ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. ఈయన రెండో సంతానమైన డి.జ్యోత్స్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో చదువుకుని పదో తరగతిలో 589 మార్కులు సాధించి జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. ప్రస్తుతం కృష్ణాజిల్లా ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్ చదువుతోంది. ⇒ పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరుపల్లి గ్రామానికి చెందిన జి.గణేష్ అంజన సాయి ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాలలో చదువుకుని గతేడాది పదో తరగతిలో 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. ఇతని తండ్రి గోపి కౌలు రైతు కాగా, తల్లి లక్ష్మి గృహిణి. -
నాడు–నేడుకు దేశం ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ అంశం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. నాడు–నేడు ద్వారా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడాన్ని ఉత్తరాది రాష్ట్రాలు కొనియాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల పరిస్థితులు, ప్రస్తుతం సీఎం జగన్ హయాంలో పాఠశాలల స్థితిగతులపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కళ్లకు కట్టినట్లు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నాడు–నేడు షార్ట్ వీడియోలు ట్రెండీగా మారాయి. ఏపీలోని నాడు–నేడుపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ► రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విద్యాసంస్థలను పట్టించుకోలేదు. ► విద్య, మధ్యాహ్న భోజన విషయంలో సైతం సర్కారీ బడులపై బాబు చిన్నచూపు చూశారు. ► 2014–19 మధ్య దాదాపు 1,785 పాఠశాలలను మూసివేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.► 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీ సీట్లతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ► 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో..సీఎం జగన్ అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.సోషల్ మీడియాలో పలువురి కామెంట్లు ఇలా..► ఇది కేవలం విజనరీ సీఎం జగన్ వల్లే సాధ్యం► నాకు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అంటే ఇష్టం.. మంచి విద్య, అద్భుతమైన ఆట స్థలాలు ► అవును ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు అవసరమే► దేశంలో ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలి► ఏపీ సీఎం జగన్ కింగ్ ట్రెండింగ్‌లో కావ్య వీడియోసీఎం జగన్ విద్యా వ్యవస్థలో నాడు–నేడు ద్వారా తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులను గుర్తిస్తూ ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ‘కావ్య’ ఓ వీడియోను రూపొందించారు. ►విద్యా వ్యవస్థలో దేశంలోనే ఏపీ సరికొత్త అడుగులు వేసిందని, గతంలో ఉన్న అధ్వాన పరిస్థితిని సమూలంగా మార్చివేసిందంటూ ప్రశంసలు కురిపించారు. ►అత్యాధునిక ఫర్నిచర్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేశారని.. ఆ రోజుల్లో మనకు ఇటువంటి సౌకర్యాలు లేవే అంటూ.. సీఎం జగన్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, ఐబీ సిలబస్‌ను పరిచయం చేయడం అభినందనీయమని, ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని, బడుగు, బలహీన వర్గాల వారికి చదువుపై ఆసక్తి పెరిగిందంటూ వీడియో చేశారు. ►ఆ వీడియోను యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయడంతో పదిలక్షలకు పైగా నెటిజన్లు వీడియో చూసి, వేల సంఖ్యలో షేర్ చేస్తూ ‘సూపర్ ఏపీ స్కూల్స్’ అంటూ కితాబు ఇస్తున్నారు. ►మరికొంత మంది నాడు–నేడుపై షార్ట్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఉత్తరాది జనం ఫిదా అవుతున్నారు. ►యూపీ, హరియాణా, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా విద్య ఉంటే బాగుంటుందంటూ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ►దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఇదే తరహా నాణ్యమైన విద్య దేశం మొత్తం తీసుకురావాలని, సీఎం జగన్‌ను కొనియాడుతూ లైకులు, కామెంట్లు, షేర్ చేస్తున్నారు. -
థాంక్యూ జగన్ మామయ్య..
-
ఆనందాల ఏలుబడి
ప్రభుత్వ బడుల్లో కల్పించిన సదుపాయాలు 1. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు 2. శుద్ధి చేసిన తాగునీరు 3. పూర్తి స్థాయి మరమ్మతులు 4. ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ 5. విద్యార్థులు, సిబ్బందికి ఫరి్నచర్ 6. గ్రీన్ చాక్‌బోర్డులు 7. భవనాలకు పెయింటింగ్ 8. ఇంగ్లిష్ ల్యాబ్ 9. కాంపౌండ్ వాల్; 10. కిచెన్ షెడ్ 11. అదనపు తరగతి గదుల నిర్మాణం సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యకు జగనన్న ప్రభుత్వం పట్టం కట్టింది. అలా ఇలా కాదు.. అక్షరానికి అగ్రాసనం వేసి, సౌకర్యాలకు సమున్నత స్థానం కల్పించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. నిధులు కేటాయించి సర్కారు బడి రూపురేఖల్ని సమూలంగా మార్చింది. కార్పొరేట్ విద్యా రంగం ఈర‡్ష్యపడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలు కల్పించారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. తెలుగు, ఇంగ్లిషులో టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేసి విద్యా రంగంలో సంస్కరణల పట్ల తన నిబద్ధత చాటుకుంది. సర్కారు బడిలో డిజిటల్ శకం ఒకప్పుడు బ్లాక్ బోర్డులపై రాసే సుద్దముక్కలు లేక ఇబ్బందులు పడిన దశ నుంచి ప్రభుత్వ బడి డిజిటల్ బోధనతో సరికొత్త హంగులు సంతరించుకుంది. స్కూల్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే చిన్నారులు ఆసక్తి చూపుతారన్న ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల సదుపాయాలు కల్పించారు. సరికొత్తగా.. నాడు–నేడులో పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేశారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రా«థమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు. దేశంలో 25 వేలఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఒక విప్లవం. . అమ్మ ఒడితో అండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. ‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది చదువుతున్నారు. వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్య కోసం 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. టెక్ ప్రపంచంలో రాణించేలా.. ప్రస్తుత టెక్ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులపై స్కూల్ స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల్ని ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు పట్టం విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. -
Fact check: చదువులపై విషం కక్కిన నారా వారి కూలీ..
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కూల్లో స్టాఫ్‌కు ప్రత్యేక, ఆధునిక సదుపాయాల కల్పన ఆ పత్రికకు కనబడవు. ఒకేసారి 25 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రభుత్వమే. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడులు అద్భుతంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు, బోధనకు ఐఎఫ్‌పీ స్క్రీన్ల ఏర్పాటు జరిగాయి. వీటిని కావాలనే విస్మరించి ఆధారాలు లేని రాతలతో ఎల్లో మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాఠశాల అభివృద్ధిలో టీచర్లను భాగస్వామ్యం చేయడం తప్పేనా? ఒకప్పటి బ్లాక్ బోర్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ బోధన సాగుతోంది. విద్యార్థులు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు 2019–20 విద్యా సంవత్సరంలో ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగాయి. నాడు–నేడు మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలు బాగుపడ్డాయి. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందిస్తున్నారు. 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ రికార్డు. ఇవన్నీ పూర్తి పారదర్శకత కొనసాగేందుకు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఏం అవసరమో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. వీటిని తప్పంటోంది ఈనాడు పత్రిక. మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లల్లో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ. జగన్ పాలనలో ► విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు సమకూరాయి. ►గత నాలుగేళ్లలో అర్హత కలిగిన 25 వేల మంది టీచర్లు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ఇందులో నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారికీ అవకాశం లభించింది. ►నాడు–నేడుతో ప్రతి బడిలోనూ 12 రకాల సదుపాయాలు. ►బోధనకు డిజిటల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు. ►బడుల్లోకి కొత్త ఫర్నిచర్. ►మన బడికి అంతర్జాతీయ కీర్తి. ►కోవిడ్ కష్ట కాలంలో నెలల తరబడి పాఠశాలలు మూతబడినా ప్రతి టీచర్‌కు ఠంచన్‌గా వేతనాలు. ►బడిలో పాఠాలు చెప్పడం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం తప్ప ఏ ఉపాధ్యాయుడికీ అదనపు పనులు అప్పగించలేదు. ►మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఉన్నారు. వారికి ప్రతినెలా వేతనాలు చెల్లించేందుకు ‘టాయిలెట్ మెయింటనెన్స్ ఫండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత స్థానిక ఉపాధ్యాయులు తీసుకున్నారు. చంద్రబాబు పాలనలో ► 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో చంద్రబాబు జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచారు. నూరు శాతం ఫలితాలు తేవాలని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో సాధ్యం కాదని ఆ ప్రధానోపాధ్యుడు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంతే అదే వేదికపై ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ► 2003లో మంత్రిగా చేసిన నిమ్మల కిష్టప్ప గోరంట్లలో నిర్వహించిన జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టమని అనుచరులను రెచ్చగొట్టారు. ►మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ అవసరం తీర్చుకునేవారు. ►జన్మభూమి సభ్యులే పేరెంట్స్ కమిటీల్లో చేరిపోయి పప్పు, బియ్యం ఎత్తుకెళితే అడిగినందుకు ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు చేశారు. ►ఉపాధ్యాయులను నియమించకుండా నూరు శాతం ఫలితాలు తేవాలని ఒత్తిడి చేశారు. సాధ్యం కాదని చెబితే వెంటనే సస్పెండ్ చేసేవారు. ఈ రాతలు టీచర్లను అవమానించడమే గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయినులు పట్టణాలకే గాని మండల స్థాయి పాఠశాలలకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. బ్లాక్ బోర్డులౖపె రాసేందుకు సుద్దముక్క కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకు, స్టాఫ్‌కు అన్ని సదుపాయాలు కల్పించింది కళ్లకు కనిపిస్తున్నాయి. తప్పుడు రాతలు రాసి టీచర్ల మనోభావాలను కించపరచడం దుర్మార్గం. ఉపాధ్యాయుల విధులు, సిబ్బంది విధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ టీచర్ కూడా మరుగుదొడ్లు కడిగింది లేదు. గతంలో ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు స్థానిక బడుల్లో ఉండలేక కష్టాలు పడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పాఠశాలకైనా నిర్భయంగా వెళ్లే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. – గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు (వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement