-
గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో భాగమైన గౌతం గంభీర్.. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చాలా కాలం పాటు ప్రాతినిథ్యం వహించిన ఈ మాజీ ఓపెనర్ ఎన్నో రికార్డులు సాధించాడు.అంతేకాదు కెప్టెన్‌గా కేకేఆర్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు గంభీర్. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా కెరీర్ సాఫీగా సాగకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడు గౌతీ.ఈ క్రమంలో గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన ఈ బీజేపీ ఎంపీ.. తాజా ఎడిషన్‌లో మళ్లీ కేకేఆర్ గూటికి చేరాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆటగాడి పేరు ఈ సందర్భంగా వెల్లడించాడు.‘‘క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కాదు... ఐపీఎల్లో కెప్టెన్‌గా ఉన్నపుడు నన్ను భయపెట్టిన ఒకే ఒక్క బ్యాటర్ రోహిత్ శర్మ. అతడు బరిలో ఉన్నాడంటే ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి.ఎందుకంటే రోహిత్ శర్మను ఆపడం ఎవరితరం కాదు. అందుకే అతడి కోసం తప్ప మరే ఇతర బ్యాటర్ కోసం కూడా నేను ఇన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. ఒక్కోసారి రాత్రుళ్లు నిద్రపోకుండా మరీ వ్యూహాలు రచించిన సందర్భాలు ఉన్నాయి’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ శుక్రవారం తలపడనున్న తరుణంలో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆడిన తొమ్మిదింట గెలిచి రెండో స్థానంలో ఉండగా.. ముంబై పదింట కేవలం మూడు గెలిచి తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.Game recognises game 🙌🏽"The only batsman I feared in IPL was @ImRo45", @GautamGambhir praises the Indian captain's batting prowess! 😳Will he lead #TeamIndia to glory in the #T20WorldCup2024?📺 | #MIvKKR | TODAY, 6:30 PM | #IPLOnStar pic.twitter.com/eEav5GbKG5— Star Sports (@StarSportsIndia) May 3, 2024 -
కోహ్లి స్ట్రైక్‌రేటుపై గంభీర్ వ్యాఖ్యలు.. వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. మీడియా అత్యుత్సాహం వల్లే తమ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు.అదే విధంగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి కూడా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అప్పటి లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాజా సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా అవతారమెత్తిన గంభీర్.. ఇటీవలి మ్యాచ్ సందర్భంగా కోహ్లిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.గొడవ పడితే చూడాలనిఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఓ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘మేము ఇద్దరం గొడవ పడితే చూడాలని అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వాళ్లను ఈ వీడియోలు నిరాశపరిచి ఉంటాయి’’ అని చమత్కరించాడు.ఈ విషయంపై తాజాగా స్పందించిన గౌతం గంభీర్ కోహ్లి వ్యాఖ్యలతో ఏకీభవించాడు. టీఆర్పీ రేటింగ్‌ల కోసమే మీడియా ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను, విరాట్ కోహ్లి ఎలాంటి వాళ్లమో, తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో వారికి తెలియదన్న గౌతీ.. వీలైతే పాజిటివిటీని పెంచే అంశాలను చూపించాలన్నాడు.ఎవరికి వారే ప్రత్యేకంతాను, కోహ్లి పరిణతి చెందిన వ్యక్తులం కాబట్టి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోమని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు భిన్నంగా ఉంటాడు.మాక్స్వెల్ ఆడినట్లు కోహ్లి ఆడకపోవచ్చు. కోహ్లి తీరుగా మాక్స్వెల్ షాట్లు బాదలేకపోవచ్చు. పదకొండు మంది సభ్యులున్న జట్టులో ఎవరికి వారే ప్రత్యేకం. బ్యాటింగ్ ఆర్డర్లో 1- 8 వరకు విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉంటే స్కోరు 300 కావొచ్చు లేదంటే 30 పరుగులకే ఆలౌట్ కావచ్చు.జట్టును గెలిపించినపుడు స్ట్రైక్‌రేటు 100 ఉన్నా బాగానే అనిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 180 స్ట్రైక్‌రేటు కూడా మన కంటికి కనిపించదు. మ్యాచ్ జరిగే వేదిక, పిచ్ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు.. ఇలా భిన్న అంశాలపై స్ట్రైక్‌రేటు ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు’’ అంటూ విరాట్ కోహ్లికి గంభీర్ మద్దుతుగా నిలిచాడు. కాగా ఈ సీజన్లో కోహ్లి ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 145.76 స్ట్రైక్‌రేటుతో 430 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. -
సహనం కోల్పోయిన గంభీర్... అంపైర్‌తో గొడవ! ఆఖరికి..
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ సహనం కోల్పోయాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ల నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. సొంతగడ్డపై టాస్ ఓడిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఓవర్ త్రో.. ఓ సింగిల్అయితే, కేకేఆర్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ సందర్భంగా గౌతం గంభీర్ తీవ్ర అసహానికి గురయ్యాడు. పద్నాలుగో ఓవర్లో పంజాబ్ స్పిన్నర్ రాహుల్ చహర్ ఆఖరి బంతిని అవుట్ సైడాఫ్ దిశగా షార్ట్‌బాల్‌గా సంధించాడు. అప్పుడు క్రీజులో ఉన్న ఆండ్రీ రసెల్ ఆ బంతిని కవర్స్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో ఫీల్డర్ అశుతోష్ శర్మ ఇన్సైడ్ సర్కిల్లోనే బంతిని ఆపేసి.. వికెట్ కీపర్ జితేశ్ శర్మ వైపునకు విసిరాడు. అయితే, అది ఓవర్ త్రో అయింది. దీంతో మరో ఎండ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్‌ను పిలిచి రసెల్ సింగిల్ తీశాడు. పరుగు ఇవ్వడం కుదరదుకానీ ఆన్ ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి ఈ సింగిల్‌ను పరుగుల ఖాతాలో చేర్చేందుకు నిరాకరించాడు. అశుతోశ్ బంతిని ఆపేసిన తర్వాత.. తాను తాను ఓవర్ పూర్తైందని కాల్ ఇచ్చానని.. కాబట్టి ఈ ఓవర్ త్రో కారణంగా వచ్చిన పరుగు లెక్కలోకి రాదని స్పష్టం చేశాడు.ఇందుకు రసెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, డగౌట్లో ఉన్న కేకేఆర్ మెంటార్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి వారికి సమీపంలో ఉన్న ఫోర్త్ అంపైర్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో గంభీర్ ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఫోర్త్ అంపైర్‌తో వాదించాడు.pic.twitter.com/eICqVXG8kE— Nihari Korma (@NihariVsKorma) April 27, 2024అంపైర్‌తో గంభీర్ వాదనఅయితే, అతడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో గౌతీ ముఖం మాడ్చుకుని అసంతృప్తిగా పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉంటే.. కేకేఆర్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జానీ బెయిర్ స్టో అజేయ విధ్వంసకర శతకం(48 బంతుల్లో 108)తో పంజాబ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.చదవండి: KKR vs PBKS: టీ20లలో సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఇదే తొలిసారి.@PunjabKingsIPL are roaring again 🦁A special victory at the Eden Gardens for #PBKS who secure the highest successful run chase in the IPL and T20s ❤️Scorecard ▶️ https://t.co/T9DxmbgIWu#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/FNxVD8ZeW6— IndianPremierLeague (@IPL) April 26, 2024 -
భారత కెప్టెన్‌గా అతడి స్థాయిని ఎవరూ అందుకోలేరు: గంభీర్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు కెప్టెన్‌గా ధోని సాధించిన ఘనతలను అందుకోవడం ఇక ముందు ఎవరికీ సాధ్యం కాదనడంలో సందేహం లేదన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా ఎవరెన్ని విజయాలు సాధించినా ధోని మూడు ఐసీసీ ట్రోఫీల ముందు దిగదుడుపేనని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య సోమవారం మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ కెప్టెన్, ప్రస్తుత మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కేతో పోరును తాను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు మెంటార్‌గా ఇందులో ఎటువంటి మార్పులేదన్నాడు. సీఎస్కేపై పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇక ధోని గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘నేను ఈ మ్యాచ్ గెలవాలనే కోరుకుంటున్నాను. నేనే కాదు.. నా స్థానంలో ధోని ఉన్నా తన జట్టే గెలవాలని కోరుకుంటాడు. స్నేహితులుగా ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంది. అంతమాత్రాన పోటీ పడటంలో ఎవరూ తగ్గరు కదా!.. ఏదేమైనా టీమిండియా కెప్టెన్‌గా ధోని మాదిరి మరెవరూ విజయవంతం కాలేదన్నది నిజం. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం మామూలు విషయం కాదు. కొంతమంది భారత కెప్టెన్లు విదేశాల్లో చారిత్రక విజయాలు సాధించవచ్చు.. మరికొందరు టెస్టు మ్యాచ్‌లలో గెలిపించవచ్చు. అయినా మూడు ఐసీసీ ట్రోఫీల కంటే అవేమీ పెద్దవి కావు’’ అని గంభీర్.. ధోని నాయకత్వ నైపుణ్యాలను కొనియాడాడు. కాగా ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే ప్రపంచకప్-2011 గెలిచిన భారత జట్టులో గంభీర్ సభ్యుడన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ ఫైనల్లో 75, వన్డే ఫార్మాట్ ఫైనల్లో 97 పరుగులు చేసి ఈ ట్రోఫీలు గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఎల్లప్పుడూ ధోనిని ఏదో రకంగా విమర్శించే ఈ కేకేఆర్ మెంటార్ ఈసారి ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. కాగా కేకేఆర్ సారథిగా సీఎస్కేతో 11సార్లు పోటీపడ్డ గంభీర్ ఐదుసార్లు గెలిచాడు. 2012 ఫైనల్లో సీఎస్కేను ఓడించి టైటిల్ గెలిచాడు కూడా! View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
IPL 2024, DC VS KKR: కేకేఆర్ తొలిసారి ఇలా..!
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలిసారి సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి రికార్డుల్లోకెక్కింది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై బంపర్ విక్టరీతో కేకేఆర్ ఈ ఘనత సాధించింది. గతంలో ఏ సీజన్లోనూ కేకేఆర్ సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కేకేఆర్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ, ఢిల్లీపై వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 4 పరుగుల స్వల్ప తేడాతో బయటపడిన కేకేఆర్.. ఆతర్వాత ఆర్సీబీ (7 వికెట్ల తేడాతో), ఢిల్లీపై (106 పరుగుల తేడాతో) ఘన విజయాలు సాధించింది. ఈ సీజన్లో అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న కేకేఆర్.. ఆర్సీబీ, ఢిల్లీలను వారి సొంత మైదానాల్లో ఓడించి శభాష్ అనిపించుకుంది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్.. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలో, గంభీర్ మెంటార్షిప్లో, చంద్రకాంత్ పండిట్ శిక్షణలో టైటిల్ రేసులో దూసుకుపోతుంది. ఐపీఎల్ అరంగేట్రం నుంచి కొనసాగుతున్న కేకేఆర్.. రెండు సార్లు (2012, 2014) ఛాంపియన్‌గా, ఓ సారి రన్నరప్‌గా (2021) నిలిచింది. గౌతమ్ గంభీర్ (ప్రస్తుత మెంటార్) కేకేఆర్‌ను రెండుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 2021 సీజన్లో కేకేఆర్ రన్నరప్‌గా నిలిచినప్పుడు ఆ జట్టుకు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించాడు. కేకేఆర్ ఛాంపియన్స్ లీగ్‌లోనూ ఓసారి రన్నరప్‌గా (2014) నిలిచింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ ఇది రెండో అతి భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement