-
చేపల కూర తిని ఇద్దరి మృతి
యశవంతపుర: చేపల కూర తిని ఇద్దరు మృతి చెందగా, 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హాసన జిల్లా అరకలగూడు తాలూకా బసవహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామంలోని చెరువు వర్షాభావంతో అడుగంటింది. కొద్దిమేర నీరు ఉంది. దీంతో గ్రామస్తులు శుక్రవారం చెరువులోని చేపలు పట్టుకొని కూర చేసుకొని తిన్నారు. కొద్ది సేపటి తర్వాత 15 మంది వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వారిని అరకలగూడు, హాసన ఆస్పత్రికి తరలించగా రవికుమార్, పుట్టమ్మలు మృతి చెందారు. మిగతా 13 మంది చికిత్స పొందుతున్నారు. గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సీ సత్యభామ సందర్శించారు. -
రవి మృతదేహం కోసం..
ప్రజల కోసమే ప్రాణమిచ్చిండు 16 ఏళ్ల వయస్సులో విప్లవోద్యమంలోకి వెళ్లిన నా తమ్ముడు రవి 48 ఏళ్ల వయస్సులో ఎన్కౌంటర్లో చనిపోయిండు. ముప్పై ఏళ్లకు పైగా విప్లవోద్యమంలో పన్జేసిండు. ఉద్యమంలోకి పోయిన నుంచి ఒక్కసారి కూడా ఇంటి ముఖం చూడలె. ఎప్పటికై నా క్షేమంగా ఇంటికి వస్తడనుకున్నం. గిట్ల శవమై వస్తడనుకోలె. ప్రజల కోసం పోరుబాట పట్టిండు. ప్రజల కోసమే ప్రాణమిడిసిండు. నా తమ్ముని జన్మ ధన్యమైంది’ ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గత మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దండకారణ్య కమిటీ సభ్యుడు కాసవేణ రవి పెద్దన్న వెంకటేశ్ కన్నీటి వేదన.బెల్లంపల్లి: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు, బెల్లంపల్లికి చెందిన కాసవేణ రవి అలియాస్ అశోక్ అలియాస్ వినయ్ (48) మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పడిన యాతన అంతా ఇంతా కాదు. మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరగగా శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు రవి మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత నారాయణపూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇబ్బందులేర్పడ్డాయి. రవి మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు బుధవారం మధ్యాహ్నం భీమదేవరపల్లి మండలం వంగర స్వస్థలం నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరి వెళ్లారు. దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా, పోలీసుల తనిఖీల మధ్య 12 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారు. బుధవారం ఉదయం నారాయణపూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మార్చురీలో భద్రపర్చిన రవి మృతదేహాన్ని సోదరుడు వెంకటేశ్, బంధువులు గుర్తించి బోరున విలపించారు.కిడ్నీ నుంచి తూటాలు..కుటుంబ సభ్యులు రవి మృతదేహాన్ని గుర్తించగా వైద్యులు స్కాన్ చేశారు. అతడి శరీరంలోని తూటాలను పరిశీలించిన నారాయణపూర్ ప్రభుత్వాస్పత్రి వైద్యులు పోస్టుమార్టం చేయడం సాధ్యంకాదని చెప్పారు. జగ్దల్పూర్ నుంచి ప్రత్యేక వైద్యులను శుక్రవారం ఉదయం రప్పించి మరోసారి రవి మృతదేహాన్ని స్కాన్ చేసి చూసిన తర్వాత పోస్టుమార్టం చేశారు. కాగా, కిడ్నీని ఆనుకుని మూడు తూటాలు ఉండటంతో నిపుణులైన వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో స్వస్థలానికి చేరుకున్నారు. కాగా, శనివారం స్వగ్రామం వంగరలో రవి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అతడి సోదరుడు వెంకటేశ్ తెలిపారు. -
రైలు నుంచి పడి గర్భిణి మృతి
కొరుక్కుపేట: చైన్నె నుంచి సీమంతం కోసం తమ స్వగ్రామానికి వవెళుతున్న ఓ గర్భిణి విరుదాచలం సమీపంలో రైలు నుంచి పడి మృతి చెందింది. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెన్‌కాశీ జిల్లా కరంకోవిల్ సమీపంలోని మేలనీలితనల్లూర్ తూర్పు వీధికి చెందిన సురేష్ కుమార్ (25) చైన్నెలోని ఓ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి చైన్నె పెరియార్ నగర్ త్రిశూలానికి చెందిన బిఎస్సీ పట్టభద్రురాలు కస్తూరి (22)తో 9 నెలల క్రితం వివాహమైంది. కస్తూరి ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఈ నేపథ్యంలో కస్తూరి కుటుంబ సభ్యులు సీమంతం చేయాలని నిర్ణయించారు. దీనికితోడు గ్రామంలో ఆలయ వేడుకలు జరుగుతున్నాయని, ఆదివారం సీమంతానికి ఏర్పాట్లు చేశారు. గురువారం సురేష్ కుమార్ తన భార్య, బంధువులు కొల్లాం ఎక్స్‌ప్రెస్ రైలులో స్వగ్రామానికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేశారు. అందరూ ఆ రైలులో ఎస్–9 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ రైలు రాత్రి 8 గంటలకు ఉలుందూరుపేట వద్దకు వెళ్లే సరికి కస్తూరికి వాంతులు అయ్యాయి. వెంటనే బంధువుల సాయంతో పెట్టెలో చేతులు కడుక్కోవడానికి వచ్చాడు. దానికి దగ్గరగా ప్రవేశ ద్వారం ఉంది. కస్తూరి వాంతులు చేసుకుంటూ అక్కడే నిలబడి ఉంది. ఆ సమయంలో రైలు వేగంగా వెళుతుండడంతో కదలిక రావడంతో కిందపడిపోయింది. ఇది చూసి షాక్‌కు గురైన మహిళ బంధువులు కేకలు వేశారు. వెంటనే బాక్స్‌లోని ప్రమాద గొలుసును లాగి రైలును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ గొలుసు పని చేయలేదు. తరువాత అత్యవసర లివర్ని లాగారు. అప్పటికి రైలు దాదాపు 7 కిలోమీటర్లు దూరం వెళ్లి ఆగింది. కుటుంబ సభ్యులందరూ దిగి ఽఆ ప్రాంతానికి నడిచి వెళ్లారు. కానీ రాత్రి సమయం కావడంతో కస్తూరి జాడ తెలియలేదు. అనంతరం రైలులో విరుదాచలం రైల్వేస్టేషన్‌కు వచ్చి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కస్తూరి కోసం గాలిస్తున్నారు. దాదాపు 2 గంటల తర్వాత కస్తూరి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దక్షిణ రైల్వే సరైన విచారణకు ఆదేశించింది. కస్తూరికి వివాహమై 9 నెలలు కావస్తుండడంతో ఆర్డీఓ. విచారణకు సిఫారసు చేశారు. -
హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై తలకిందులైన కారు
బి.కొత్తకోట: ప్రకృతి అందాలు తిలకించి, చల్లటి వాతావరణం అనుభూతితో వెనుదిరిగిన ఓ కుటుంబ ఆనందం క్షణాల్లో ఆవిరైంది. ప్రయాణిస్తున్న కారు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో లోయలోకి పడకుండా చేసిన ప్రయత్నాల్లో కారు తలకిందులై పడింది. అందులోని ముగ్గురు సురక్షితంగా బయటపడగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. బి.కొత్తకోటకు 18 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకలోని గౌనిపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి, రజిత భార్యాభర్తలు. వేసవి సెలవులు కావడంతో విహార యాత్రకు వెళ్లేందుకు వీరి కుమార్తె, కుమారుడు ఆరవ తరగతి చదువుతున్న గగన, ఒకటవ తరగతి చదువుతున్న సుజిత్రెడ్డిలతో కలిసి బుధవారం ఉదయం కారులో మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ వచ్చారు. కొండపై ప్రకృతి అందాలను తిలకించి చల్లటి వాతావరణంలో సేదతీరారు. కొన్ని గంటల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యేందుకు వెనుదిరిగారు.కొండపై నుంచి కిందకు వస్తుండగా రేణిమాను మలుపు ముందున్న మలుపు వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాసులురెడ్డి కారు బ్రేక్‌లు ఫెయిల్ అయినట్టు గుర్తించారు. ఎడమవైపు లోయలు ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశాలు గుర్తించి కారును కుడివైపు తిప్పారు. అప్పటికే చేతి బ్రేక్‌ను వేసి కారును నిలిపే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాలేదు. దీంతో కారును కుడివైపునకు మళ్లించి కొండను ఢీకొని నిలిపేలా ప్రయత్నించారు. అయితే కొండబండను ఢీకొన్న కారు ఒక్కసారిగా రోడ్డుపై తలకిందులుగా పడిపోయింది. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో అగ్నికి ఆహుతి అయ్యేలా ఉందని ఆందోళనకు గురైన శ్రీనివాసులురెడ్డి కారులోంచి బయటకు వచ్చేందుకు డోర్లు తెరచుకునే పరిస్థితి లేదని గుర్తించారు.దీంతో కుడికాలితో బలంగా తన్ని అద్దాలను పగులగొట్టారు. తర్వాత భార్య, పిల్లులు కారులోంచి బయటపడ్డారు. అద్దాలను తన్నడంతో శ్రీనివాసులురెడ్డి కుడి పాదానికి తీవ్ర గాయంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ప్రమాద ఘటనను గుర్తించి స్థానికులు బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. పాదానికి అయిన గాయానికి బ్యాండేజి కట్టి కారులో బి.కొత్తకోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. కాగా ప్రమాద సమయంలో కారులోనే ఉన్న భార్య రజిత, పిల్లలు గగన, సుజిత్రెడ్డిలకు ఎలాంటి గాయాలు కాలేదు. అదృష్టవశాత్తు కారు ఎడమవైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే కారు 30 అడుగులపైనుంచి కిందకు పడి ఉండేది. -
ఇద్దరు కుమార్తెలతో తల్లి బలవన్మరణం
సాక్షి, చెన్నై: భర్తతో అభిప్రాయ భేదాలు విడాకుల వరకు వెళ్లడంతో తీవ్ర మనో వేదనకు గురైన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో పాటు తానూ బలవన్మరణానికి పాల్పడింది. దిండుగల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. దిండుగల్ జిల్లా తాడి కొంబు పరిధిలోని కామాక్షిపురం శక్తినగర్‌కు చెందిన శ్రీనివాసన్(42), మేనక (35) దంపతులకు హిందు మహావిని(16), తన్యశ్రీ(11) కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు స్థానికంగా సీబీఎస్ఈ పాఠశాలలో పది, ఆరు తరగతులు చదువుతున్నారు. మహావిని ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితిలో కొద్ది రోజులుగా ఈ దంపతుల మధ్య జరిగిన గొ డవ విడాకుల కోసం కోర్టు వరకు వెళ్లింది.నందవనం రోడ్డులో తాను నడుపుతున్న టూ వీలర్ సర్వీస్ సెంటర్ లో వాటర్ మోటార్ పనిచేయక పోవడంతో సోమవారం ఇంట్లో ఉన్న మోటారును తీసుకెళ్లేందు కు శ్రీనివాసన్ ప్రయత్నించాడు. దీనిని మేనకతో పాటు పిల్లలు అడ్డుకున్నారు. తమ గొడవలు విడా కుల కోసం కోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో శ్రీనివా సన్ చర్యలపై మేనక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాయంత్రం అతడిని పోలీసులు పిలిపించి చీవాట్లు పెట్టారు. రాత్రి పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన శ్రీనివాసన్ ఇంట్లో ఉన్న తన బట్టలను తీసుకెళ్లేందుకు వెళ్లాడు.ఇంటి తలుపులు తెరవక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో కిటికి తలుపులు పగుల కొట్టి చూశారు. లోపల గది లో తన ఇద్దరు కుమార్తెలతో పాటుగా మేనక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టా నికి తరలించారు. శ్రీనివాసన్‌ను విచారించగా తాను పొద్దుపోయే వరకు పోలీసు స్టేషన్లోనే ఉన్న ట్లు చెప్పాడు. మనస్తాపంతో ఉన్న మేనక పిల్లలతో పాటు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పో లీసులు నిర్ధారించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement