-
‘కొడుక్కి పిల్లను అడిగితే నాకు ఇచ్చారు’.. టికెట్ గురించే!
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బస్తర్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు లోక్‌సభ టికెట్ దక్కిన వైనం గురించి హాస్యభరితంగా చెప్పారాయన. "ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీయే పోటీ చేస్తోంది. నాకు టిక్కెట్ ఎందుకు వచ్చింది.. నేను అడగలేదు. అంతగా అయితే నా కొడుక్కి నా ఇవ్వమన్నాను. నేను నా కొడుక్కి వధువును (టికెట్) అడిగాను. కానీ వారు నాకు ఇచ్చారు" అని హాస్యోక్తులు పూయించారు. అలాగే మోదీ పాలనను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు మన దేశం అమ్ముడవుతోందని, మన రాజ్యాంగానికి ముప్పు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కవాసీ లఖ్మాపై జగదల్ పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. దంతేశ్వరి ఆలయం ముందు నోట్లు పంచినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నోట్ల పంపిణీ సమాచారం అందిన వెంటనే మంత్రి కేదార్ కశ్యప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు బీజేపీ కూడా ఇదివరకే మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. #WATCH | Lok Sabha elections 2024 | Congress candidate from Bastar (Chhattisgarh), Kawasi Lakhma says, "I am not contesting the elections, Congress party will contest the elections...Why did I get a ticket? I had not asked for one...If it is being insisted, give the ticket to my… pic.twitter.com/WSPUJ17I9O — ANI (@ANI) March 28, 2024 -
కుమార్తెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికిన ఎడిటర్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఓ తండ్రి తన కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించాక, ఆమెను హెలికాప్టర్లో అత్తవారింటికి పంపారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని పట్టి తహసీల్ ఉపాధ్యాయపూర్ గ్రామానికి చెందిన కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివకు అత్యంత ఘనంగా వివాహం జరిపించారు. అనంతరం ఆమెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికారు. సుల్తాన్‌పూర్‌లోని శంకర్‌గఢ్‌కు చెందిన సత్యప్రకాష్ పాండే కుమారుడు సతీష్ పాండేతో శివకు వివాహం జరిగింది. ప్రతాప్‌గఢ్‌లోని రాణి రామ్ ప్రియా గార్డెన్లో వీరి వివాహ వేడుక జరిగింది. అనంతరం కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివను తన స్వగ్రామం ఉపాధ్యాయపూర్ నుండి హెలికాప్టర్లో అత్త వారింటికి పంపించారు. హెలికాప్టర్లో వధూవరులు కూర్చున్నారు. ఆ సమయంలో వీరిని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ముంబై నుండి ప్రచురితమయ్యే ‘అభ్యుదయ వాత్సల్యం’ పత్రికకు కృపాశంకర్ తివారీ చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు అలోక్ రంజన్ తివారీ ఎటర్నల్ కార్పొరేట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ. -
క్యా సీన్ హై.. వధువుకి పాదాభివందనం చేసిన వరుడు
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైంది. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దల అంగీకారంతో చేసుకునే పెళ్లి అయినా ఎప్పటికీ గుర్తిండిపోవాలనుకునే విధంగా ఆనందంగా జరుపుకోవాలనుకుంటారు. అచ్చం అలాగే అస్సాం రాజధాని గౌహతిలో ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. అతిథులంతా వచ్చేశారు. పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యుల హడావిడీతో మండపం అంతా సందడి వాతావరణం నెలకొంది. హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే వధువు వరుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అయితే అనంతరం పెళ్లి కొడుకు కల్లోల్ దాస్ కూడా తన భార్య పాదాలను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్యర్యానికి లోనవుతూ చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ వీడియోను స్వయంగా కల్లోల్ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా ఆమరింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే తన భార్యను ఎంతగానో గౌరవిస్తున్నానని, అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశానని కల్లోల్ దాస్ ప్రతిస్పదించాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడిని తన భార్య కాళ్లు పట్టుకోకుండా ఎవరూ ఆపలేదు. వాస్తవానికి ఇంకా అతన్ని ప్రోత్సహించారు. అవును ప్రతి పెళ్లి ఇలాగే ఉండాలి. సమాన గౌరవం, సమానమైన విలువ ఉండాలి. మీ ఇద్దరిని దేవుడు ఆశిర్వదించాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. సమస్య మళ్లీ మొదటికి! -
పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది.. అప్పుడు ఏమైందంటే..
‘పెళ్లి జరగాలంటే?’ అనే ప్రశ్నకు ‘రెండు మనసులు కలవాలి’ అనే సిన్మా డైలాగ్ చెబుతాం. బెంగళూరు విషయానికి వస్తే మాత్రం ‘వధూవరులు టైమ్‌కు ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలి’ అనే జవాబే వినిపిస్తుంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అనేది తరచుగా వార్తల్లో ఉండే అంశం. బెంగళూరులో ఒక వధువు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. మరో వైపు పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది. దీంతో బ్రైడల్ కారును విడిచి పరుగెత్తుతూ మెట్రో రైలు ఎక్కింది వధువు. ముహుర్తం టైమ్‌కు ముందుగానే ఫంక్షన్ హాల్‌కు చేరుకుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు మెట్రో ఆటోమేటిక్ ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ‘మెట్రోవాలే దుల్హనియా లేజాయేంగే’ ‘ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ ‘స్మార్ట్ థింకింగ్’... ఇలాంటి రకరకాల కామెంట్స్ నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి. -
‘ఇదేందిది... హల్దీ ఫంక్షన్లో ఇంత అవసరమా?’
దేశంలోని చాలా ప్రాంతాల్లో హోరెత్తించే పాటలకు నృత్యాలు లేకుండా వివాహాలు పూర్తికావు. పెళ్లిలో వధువు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక పెళ్లి కూతురే స్వయంగా నృత్యం చేస్తే, అతిథుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇటువంటి సమయంలో తమ ఇంటి అమ్మాయి వేరొకరి ఇంటికి వెళ్లిపోతున్నదనే బాధ ఆడపిల్ల తరపువారి ముఖాల్లో కనిపిస్తుంది. పెళ్లికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వధువు తన హల్దీ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అదే సమయంలో ఆమె, ఆమె తల్లి కూడా రోదిస్తుంటారు. అలా ఏడుస్తూనే పెళ్లికుమార్తె డాన్స్ చేస్తూ ఉంటుంది. దేశిమోజిటో అనే పేరుతో సోషల్‌మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో వధువు డాన్స్ చేస్తూవుంటుంది. అక్కడే ఉన్న ఆమె బంధువులు ఆమె నృత్యాన్ని చూస్తుంటారు. ఇంతలో పెళ్లి కుమార్తె భావోద్వేగానికి లోనవుతోంది. కన్నీళ్లను నియంత్రించుకోలేకపోతుంది. పక్కనేవున్న తల్లి కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతటి భావోద్వేగాల మధ్య కూడా వధువు ఆపకుండా తన నృత్యాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ వీడియోకు 3.5 లక్షలకుపైగా వ్యూస్ దక్కాయి. యూజర్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి డ్రామాలు పెరిగిపోయాయని, అందుకే ఈ రోజుల్లో సినిమాలు ఆడడం లేదని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ఇది బాలీవుడ్ అందించిన బహుమతి అని మరొక యూజర్ రాశారు. ఇది కూడా చదవండి: నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు.. Performance nahi rukni chahiye pic.twitter.com/JxNEEbbP4U — desi mojito 🇮🇳 (@desimojito) December 7, 2023
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 04-24)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement