-
ఇదెక్కడి బాదుడురా సామీ.. 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 22) జరుగుతున్న నాకౌట్ (ఛాలెంజర్) మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ ఓపెనర్ జోష్ బ్రౌన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు బాదాడు. తొలి బంతి నుంచే శివాలెత్తిన బ్రౌన్.. బిగ్‌బాష్ లీగ్‌లో రెండో వేగవంతమైన సెంచరీని (41 బంతుల్లో) నమోదు చేశాడు. బ్రౌన్ విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హిట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. Josh Brown scored an insane 140 in just 57 balls with 12 sixes for Brisbane Heat in the BBL....!!! 🤯 pic.twitter.com/O2hZWNKyLu — Mufaddal Vohra (@mufaddal_vohra) January 22, 2024 బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో బ్రౌన్, కెప్టెన్ నాథన్ మెక్ స్వీని (33) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. చార్లీ వాకిమ్ 7, మ్యాట్ రెన్షా 6, మ్యాక్స్ బ్రయాంట్ 9, పాల్ వాల్టర్ 0, జిమ్మీ పియర్సన్ 4 పరుగులు చేయగా.. మైఖేల్ నెసర్ 6, జేవియర్ బార్ట్లెట్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, బాయ్స్, లాయిడ్ పోప్ తలో రెండు వికెట్లు.. థామ్టన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, బిగ్‌బాష్ లీగ్ 2023-24 ఎడిషన్ చివరి అంకానికి చేరింది. ఈ మ్యాచ్‌తో ప్రస్తుత ఎడిషన్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతారు. బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రయికర్స్లో గెలిచిన జట్టు ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌తో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. సిడ్నీ సిక్సర్స్ క్వాలిఫయర్‌లో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. జనవరి 24న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం?
BBL 2024- Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఇప్పటికే జట్టు యాజమాన్యానికి తెలియజేసినట్లు ఆసీస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా జాన్ హేస్టింగ్స్ రిటైర్మెంట్ తర్వాత బీబీఎల్ సీజన్ 8 సందర్భంగా మాక్సీ మెల్బోర్న్ స్టార్స్ నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు. తొలి రెండు సీజన్లలో కెప్టెన్‌గా అదరగొట్టిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. టీమ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే, ఆ రెండు పర్యాయాల్లో తొలుత మెల్బోర్న్ రెనెగేడ్స్.. తర్వాత సిడ్నీ సిక్సర్స్ చేతిలో మెల్బోర్న్ స్టార్స్ ఓడిపోయింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడి టైటిల్‌ను చేజార్చుకుంది. అనంతర ఎడిషన్లలో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన స్టార్స్.. బీబీఎల్ 12 సీజన్లో కెప్టెన్ మాక్స్వెల్ సేవలు కోల్పోయింది. కాలు విరిగిన కారణంగా మాక్సీ గతేడాది సీజన్‌కు దూరం కాగా.. తాజాగా జరుగుతున్న పదమూడో ఎడిషన్‌తో తిరిగి జట్టుతో చేరాడు. ఈ క్రమంలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం 243 పరుగులు మాత్రమే చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. మాక్సీ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడి హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన మెల్బోర్న్ స్టార్స్.. తర్వాత కోలుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. కానీ.. ఆ తర్వాత పాత కథే పునరావృతమైంది. మరుసటి మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓడి ఫైనల్ చేరే అవకాశాలు చేజార్చుకుంది మెల్బోర్న్ స్టార్స్. తద్వారా పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా నిరాశచెందిన మాక్స్వెల్ కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది. కాగా ఐదేళ్లపాటు మెల్బోర్న్ స్టార్స్ సారథిగా కొనసాగిన గ్లెన్ మాక్స్వెల్.. 35 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. అదే విధంగా అతడి ఖాతాలో 31 ఓటములు కూడా ఉన్నాయి. కాగా మాక్సీ స్టార్స్‌తో కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకోవాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడితో మరో రెండేళ్లు బంధం కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీబీఎల్ చరిత్రలో మెల్బోర్న్ స్టార్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోవడం గమనార్హం. చదవండి: చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్ ఆధిక్యం! తిలక్ రీ ఎంట్రీతో.. -
ఆసీస్ స్టార్ ప్లేయర్ మార్ష్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ ఓపెనర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మార్ష్ తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. బీబీఎల్‌లో జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు. మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు తన చివరి మ్యాచ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన షాన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. మార్ష్.. తన చివరి మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై 49 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 64 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. మార్ష్ తన రెనెగేడ్స్ సహచరుడు, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే తాను కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2008-19 మధ్యలో షాన్ మార్ష్ ఆస్ట్రేలియా తరఫున 38 టెస్ట్‌లు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. ఇందులో అతను 13 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5000 పైచిలుకు పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ అదరగొట్టిన మార్ష్ 2008-17 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 71 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 20 హాఫ్ సెంచరీల సాయంతో 132 స్ట్రయిక్‌రేట్‌తో 2477 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన మార్ష్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్).. ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా (616 పరుగులు) నిలిచాడు. ఆసీస్ దిగ్గజ ఆటగాడు జెఫ్ మార్ష్ పెద్ద కొడుకైన 40 ఏళ్ల షాన్ మార్ష్.. ప్రస్తుత ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు స్వయానా అన్న అవుతాడు. -
హెలికాప్టర్లో నేరుగా గ్రౌండ్లో ల్యాండ్ అయిన వార్నర్..!
బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రైవేట్ హెలికాప్టర్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ల్యాండ్ అయ్యాడు. సొదరుడి వివాహానికి హాజరైన వార్నర్.. అక్కడి నుంచి నేరుగా తాను ఆడబోయే మ్యాచ్‌కు వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హెలికాప్టర్లో చేరుకున్నాడు. Full journey of David Warner in Helicopter to SCG for Big Bash match. 🔥 - What an entry.....!!!!pic.twitter.com/TwTsQe9954 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 సాధారణంగా ఏ క్రికెటర్‌కు కూడా ఇలాంటి అవకాశం లభించదు. వార్నర్ కోసం బిగ్‌బాష్ లీగ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. టెస్ట్, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ ఆడనున్న తొలి మ్యాచ్ కావడంతో అతడి గౌరవార్దం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్ చీఫ్ ప్రకటించాడు. గత బీబీఎల్ సీజన్ సందర్భంగా వార్నర్ సిడ్నీ థండర్స్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగానే అతను ఇవాళ (జనవరి 12) సిడ్నీ సిక్సర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. David Warner has arrived at SCG in Helicopter for the Big Bash match. - The entertainer is here....!!!!pic.twitter.com/7knZ9BUX58 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 కాగా, వార్నర్ కొద్ది రోజుల కిందట ఇదే సిడ్నీ మైదానంలోనే తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చివరి టెస్ట్ ప్రారంభానికి ముందు వార్నర్ వన్డేల నుంచి కూడా వైదొలుగుతన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం వార్నర్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు టీ20 ఫార్మాట్లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. బిగ్‌బాష్ లీగ్ అనంతరం వార్నర్ యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఆడతాడు. ఈ లీగ్ అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా వార్నర్ అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. త్వరలో విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సైతం అందుబాటులో ఉంటానని వార్నర్ ప్రకటించాడు. వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటివరకు కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతను ఓ సెంచరీ (102) సాయంతో 201 పరుగులు చేశాడు. -
ఏంటి బ్రో ఇది.. నాటౌట్‌కు ఔట్ ఇచ్చేసిన థర్డ్ అంపైర్! వీడియో వైరల్
బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా శనివారం మెల్బోర్న్ వేదికగా సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసింది. క్లియర్‌గా నాటౌట్ అయినప్పటికీ థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్‌గా ప్రకటించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అసలేం జరిగిందంటే? సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇమాడ్ వసీం బౌలింగ్‌లో జేమ్స్ విన్స్ స్ట్రైయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు. బౌలర్ వసీమ్ బంతి ఆపేందుకు ప్రయత్నించగా అతడి తాకుతూ బంతి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో బౌలర్‌తో పాటు మెల్బోర్న్ ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీల్ చేశారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫీర్ చేశారు. రిప్లేలో బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చినట్లు క్లియర్‌గా కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి సిద్దమయ్యాడు. అయితే అనూహ్యంగా బిగ్‌స్క్రీన్‌లో ఔట్ కన్పించింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో గందరగోళం నెలకొంది. అయితే థర్డ్ నాటౌట్ బటన్‌కు బదులుగా తప్పుడు బటన్ నొక్కడంతో ఇలా జరిగింది. తన తప్పిదాన్ని గ్రహించిన థర్డ్ అంపైర్ వెంటనే నాటౌట్ బటన్ నొక్కడంతో బ్యాటర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 157 పరుగుల లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిడ్నీ బ్యాటర్లలో జేమ్స్ విన్స్ (79) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ — KFC Big Bash League (@BBL) January 6, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement