-
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపున్‌కుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.19.3 ఓవర్లలో 147 పరుగులకు గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35) పర్వాలేదన్పించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.No RCB RCB fans will pass without liking this. ❤️🔥💫⭐Vintage RCB | Just RCB is RCBing | Can RCB vs GT | Faf du Plessis | Only RCB #RCBvsGT #GTvsRCB #ViratKohli pic.twitter.com/Ou5XvqxCv1— crazy (@cricrazyNandu) May 4, 2024 -
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన పరిచాడు.కళ్లు చెదిరే త్రోతో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారూఖ్ ఖాన్‌ను రనౌట్ చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన విజయ్ కుమార్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా ఆఫ్‌సైడ్ డిఫెన్స్ ఆడాడు.అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న షారూఖ్ ఖాన్ క్విక్ సింగిల్ కోసం ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ స్ట్రైక్‌లో ఉన్న తెవాటియా మాత్రం నో అంటూ వెనుక్కి వెళ్లమని కాల్ ఇచ్చాడు. అయితే షారూఖ్ ఖాన్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసే లోపే మెరుపు వేగంతో బంతిని అందుకున్న విరాట్ బౌలర్ ఎండ్‌లో స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ రిఫర్ చేయగా.. రీప్లేలో కూడా రనౌట్‌గా తేలింది. కోహ్లి సంచలన త్రో చూసిన అందరూ బిత్తరపోయారు. కామెరాన్ గ్రీన్ అయితే కోహ్లి వైపు చూస్తూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
ఐపీఎల్-2024లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(2), వృద్దిమాన్ సహా(1) తీవ్ర నిరాశపరిచారు. వీరిద్దరితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయిసుదర్శన్(6) పరుగులు చేశాడు. 19 పరుగులకే 3 విట్లుల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రమంలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), గుజరాత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరితో పాటు రాహుల్ తెవాటియా(35) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. -
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్ మొదటిలో పర్వాలేదన్పించిన గిల్.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ తీవ్ర నిరాశపరిచాడు. స్లో వికెట్‌పై ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోవడానికి గిల్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఆడిన గిల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గిల్.. విజయ్‌కుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గిల్ ఔట్ కాగానే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇండియన్ క్రికెట్ ప్రిన్స్‌కు ఏమైందని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 32.22 సగటుతో 322 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టులో శుబ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. స్టాండ్‌బై జాబితాలో గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. pic.twitter.com/tjQXP5LDRS— Rajgeeta Yadav (@rajgeetacricket) May 4, 2024 -
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుస ఓటుములతో సతమతమవుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై.. తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరుస్తున్నప్పటికి.. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం తన వంతు న్యాయం చేస్తున్నాడు.కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వరల్డ్‌కప్-2024కు ముందు బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉండటం భారత జట్టు కలిసిచ్చే ఆంశం.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు దాదాపు లేకపోవడంతో మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు.ఈ ఏడాది ఐపీఎల్లో మరో మ్యాచ్ తర్వాత ముంబై భావితవ్యం తేలిపోనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైతే ప్లే ఆఫ్స్ రేసు అధికారికంగా నిష్క్రమిస్తోంది. ఒకవేళ అది జరిగితే మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం బెటర్. అది టీమిండియాకు బాగా కలిసిస్తోందని ఈఎస్పీఈన్ క్రిక్ ఈన్ఫోలో జాఫర్ పేర్కొన్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement