500 నోటు.. ఒకవైపే ప్రింటింగ్! | Sakshi
Sakshi News home page

500 నోటు.. ఒకవైపే ప్రింటింగ్!

Published Thu, Jan 12 2017 5:48 PM

500 నోటు.. ఒకవైపే ప్రింటింగ్! - Sakshi

పెద్దనోట్ల రద్దు కష్టాలు సామాన్యులకు ఇంకా తొలగిపోలేదు. నిన్న కాక మొన్న మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తికి గాంధీ బొమ్మ లేకుండా 2వేల రూపాయల నోటు వస్తే.. ఇప్పుడు అదే రాష్ట్రంలో మరోవ్యక్తికి ఏకంగా 500 రూపాయల నోటు ఒకవైపు మాత్రమే ప్రింట్ అయ్యి వచ్చింది. ఖర్గోన్ జిల్లాలోని ఒక ఏటీఎంలో డ్రా చేసినప్పుడు ఈ కొత్త 500 నోటు వచ్చింది. హేమంత్ సోనీ అనే వ్యక్తి సెగావ్ గ్రామంలోని ఒక ఏటీఎం కేంద్రానికి వెళ్లి తన ఏటీఎం కార్డుతో రూ. 1500 డ్రా చేశాడు. మూడు 500 నోట్లు రాగా, వాటిలో ఒకటి ఒకవైపు తెల్ల కాగితం మాత్రమే ఉందని సోనీ చెప్పాడు. 
 
దాంతో సంబంధిత బ్యాంకు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా వెంటనే వాళ్లు ఆ నోటు తీసుకుని రెండు వైపులా ప్రింటింగ్ ఉన్న మరో కొత్త నోటు ఇచ్చారు. రిజర్వు బ్యాంకు నుంచి తమకు రావడమే ఆ నోట్లు అలా వచ్చాయని బ్యాంకు అధికారులు అంటున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత ఆ నోట్లను మార్చి కొత్త నోట్లు ఇస్తున్నామని చెప్పారు. ఇకమీదట ఏటీఎంలో పెట్టే ముందే నోట్లన్నింటినీ తనిఖీ చేస్తామని ఆ బ్రాంచి డిప్యూటీ మేనేజర్ చెప్పారు. ఇది కేవలం ప్రింటింగ్‌లో తప్పే తప్ప.. దొంగనోటు కానే కాదని ఆయన స్పష్టం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement