ఇన్‌చార్జ్‌ సీపీగా వీవీ శ్రీనివాసరావు

VV Srinivasa rao as Incharge cp - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: నగర ఇన్‌చార్జ్‌ పోలీసు కమిషనర్‌గా వీవీ శ్రీనివాస రావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం శాంతిభద్రతల విభాగం అదనపు సీపీగా పని చేస్తున్న ఆయన మహేందర్‌రెడ్డి డీజీపీగా వెళ్లడంతో ఈ బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీపీగా బాధ్యత లు చేపట్టే ముందు బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌కు మహేందర్‌రెడ్డి సీపీ బాధ్యతలను శ్రీనివాసరావుకు అప్పగించారు. నగరానికి కొత్త పోలీసు కమిషనర్‌ నియమితులయ్యే వరకు శ్రీనివాసరావు బాధ్యతలు నిర్వహించనున్నారు. 

Back to Top