ముగిసిన రెండో విడత పరిషత్‌ ఎన్నికల ప్రచారం | Sakshi
Sakshi News home page

ముగిసిన రెండో విడత పరిషత్‌ ఎన్నికల ప్రచారం

Published Wed, May 8 2019 4:37 PM

Second Phase Parishad Elections Campaign Is Ended Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రెండో విడత పరిషత్ ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రం ముగిసింది. 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 179 జెడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. మేడ్చల్ - మల్కాజ్ గిరి మినహా మిగతా జిల్లాల్లో రెండో విడత పోలింగ్ జరగనుంది. ఎల్లుండి ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌ నిర్వహించనున్నారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరగనుండగా ఎంపీటీసీలకు పింక్ కలర్,  జెడ్పీటీసీలకు వైట్ కలర్ కేటాయించారు.

48 గంటల ముందు స్థానికేతర నేతలు ఎన్నికలు జరిగే మండలాల్లో ఉండకూడదని ఆదేశాలు జారీఅయ్యాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటలనుంచి పోలింగ్ ముగిసేవరకు ఆయా ప్రాంతాలలో మద్యం దుకాణాలు బంద్‌కానున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలనుంచి రెండో విడత ఎన్నికలు ముగిసే వరకు పరిషత్ ఎన్నికల ప్రచారాన్ని, ఎన్నికల చిహ్నాలను కూడా ప్రసారం చేయవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement