రైతులంటే లెక్కలేదా? | Sakshi
Sakshi News home page

రైతులంటే లెక్కలేదా?

Published Fri, Apr 7 2017 2:26 AM

రైతులంటే లెక్కలేదా? - Sakshi

ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజం
మఠంపల్లి: రైతాంగం పం డించిన పంటలకు మద్దతు ధర అందించడంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ విఫలమ య్యారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలను ఆయన ప్రారంభించారు.  ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులంటే లెక్కలేదని దుయ్యబట్టారు.

 కాంగ్రెస్‌ హయాంలో పంటలకు భారీగా ధరలు పలికితే ప్రస్తుతం అన్ని పంటలకు కూడా రూ.1000 నుంచి రూ.4 వేలు పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం మీçనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు.  దేశంలోనే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణలో నమోదైందని, ఇది సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సంబరాలు జరుపుకోవడం శోచనీయమన్నారు.

Advertisement
Advertisement