ప్రయాణికుల సర్కస్ ఫీట్లు.. | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల సర్కస్ ఫీట్లు..

Published Wed, May 6 2015 2:56 PM

ప్రయాణికుల సర్కస్ ఫీట్లు.. - Sakshi

హైదరాబాద్ సిటీ: రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు పిలునివ్వడంతో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్ని డిపోల్లోనే నిలిచిపోయాయి. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రైవేట్ వాహనాలపై సర్కస్ ఫీట్లు చేసేందుకు కూడా వెనుకాడడంలేదు.


నిజామాబాద్ పట్టణంలో తీసిన ఈ ఫోటోను ఒక్కసారి గమనిస్తే రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావం ప్రజలపై ఎలా ఉందో తెలుస్తోంది. ఒక పక్క ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో బస్సులు నడవకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుంటే.. ఇదే అదునుగా వారు దొరికనకాడికి దోచుకుంటూ.. ఇష్టానికి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా పభుత్వం, అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement