హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌: 2,3 రోజుల్లో నిర‍్ణయం | LockDown in Hyderabad, Etela Rajender Latest Press Meet - Sakshi Telugu
Sakshi News home page

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌: 2,3 రోజుల్లో నిర‍్ణయం

Published Mon, Jun 29 2020 1:14 PM

Minister Etela Rajender Press Meet On Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలు కరోనా వైరస్‌కు భయపడుతున్నారని, హైదరాబాద్‌లో అవసరమైతే లాక్‌డౌన్‌ విధించే ఆలోచన చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో కొన్ని వేల మందికి చికిత్స అందిస్తుంటే.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అర్ధరాత్రులు వచ్చిన వారికి కూడా చికిత్స అందిస్తున్నాం. వైద్య శాఖలో 258 మందికి పాజిటివ్ వచ్చింది. హెడ్ నర్సు ఒకరు చనిపోయారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పని చేసే వైద్య సిబ్బందిలో 36 మందికి కరోనా వచ్చింది. వైద్య సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దు. (తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్‌)

మన దేశంలో మరణాలు ఎక్కువగా లేవు. దేశంలో మరణాలు 3 శాతమే. మన రాష్ట్రంలో డెత్ రేట్ 1.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో పక్కాగా లాక్‌డౌన్‌ అమలు చేసుకున్నాం. కరోనా విషయంలో పల్లెల్లో భయం లేదు. హైదరాబాద్ విషయంలో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. నగరంలో కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్‌తో చర్చించాం. ఐసీఎమ్‌ఆర్‌ గైడ్ లైన్స్ ప్రకారం చికిత్స చేస్తున్నాం. రేపటి నుంచి పెద్ద మొత్తంలో కరోనా పరీక్షలు చేస్తాం’’ అని అన్నారు.

Advertisement
Advertisement