ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వాలి

ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వాలి


- టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు

- 2018 చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019 కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు  చెప్పారు. 2018 చివర్లో.. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఆయన శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించా రు. మంత్రులు, పార్టీ నేతలతో మాట్లాడారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలని కోరుకుంటోందని, ఇందుకు భారీగా కసరత్తు చేస్తోందని, అదే జరిగితే రాష్ట్రంలో షెడ్యూల్‌ కంటే ముందే ఎన్నికలు వస్తాయ న్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో దీనిపై చర్చ జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు పార్టీని త్వరగా సిద్ధం చేయాలని పిలుపుని చ్చారు. మంత్రులు కీలక బాధ్యతలు తీసుకోవాలని, ప్రతినెలా జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల మాదిరిగా భారీ సభలు నిర్వహిం చాలని సూచించారు. ఇకపై తాను కూడా పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని, ప్రతిరోజూ పార్టీ నేతలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు.మన ఓటు బ్యాంకు పెరిగింది

రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఇటీవల తానొక సర్వే చేయించానని, దాని ప్రకారం టీడీపీ ఓటు బ్యాంకు పెరిగిందని చంద్రబా బు తెలిపారు. సాధారణ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం టీడీపీ ఓటు బ్యాంకు 16.13 శాతం పెరిగిందని, అదే సమయంలో వైఎస్సార్‌ సీపీ ఓటు బ్యాంకు 13.45 శాతం తగ్గిందని, కాంగ్రెస్‌కు కేవలం ఒక్క శాతంగానే ఉందని వివరించారు. ఇటీవల మున్సిపాల్టీల్లో జరిగిన వార్డు ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీల ఓటు బ్యాంకును తేల్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజల సంతృప్తస్థాయి 52 శాతానికే పరిమితమైందని చంద్రబాబు చెప్పారు. తా ను పార్టీ కోసం కష్టపడి పని చేస్తుంటే, కొంద రు స్వలాభం కోసం పనిచేస్తున్నారని, వారివ ల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని అసహ నం వ్యక్తం చేశారు. గొడవలతో బజారున పడి పార్టీకి చెడ్డ పేరు తెచ్చారని పేర్కొన్నారు.సోషల్‌ మీడియాను కట్టడి చేస్తాం..

సోషల్‌ మీడియాను కట్టడి చేస్తామని సీఎం  పునరుద్ఘాటించారు. ప్రస్తుతం అందుబా టులో ఉన్న భద్రతాపరమైన చర్యలతోపాటు మరికొన్ని విధివిధానాలను రూపొందించి సోషల్‌ మీడియాను నియంత్రిస్తామని చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడ రూరల్‌ మండలం గుంటుపల్లిలో పరిష్కార వేదిక కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసభ్య పదజాలం వాడుతూ సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

Back to Top