రెండో వన్డే: భారత్‌దే బ్యాటింగ్‌ | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 26 2019 8:05 AM

India Won The Toss And Elected To Bat First - Sakshi

మౌంట్‌ మాంగనీ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. మౌంట్‌ మాంగనీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో బ్యాటింగ్‌ వైపు మొగ్గు చూపాడు. ఈ పిచ్‌ తొలుత పేసర్లకు అనుకూలించినా, మ్యాచ్‌ సాగేకొద్దీ బ్యాటింగ్‌కు సహకరిస్తోంది. పరుగుల వరద లేకుండా తొలి వన్డే సాధాసీధాగా జరగ్గా ఈ మ్యాచ్‌లో మాత్రం భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పుల్లేకుండా భారత్‌ బరిలోకి దిగుతుండగా.. కివీస్‌ మాత్రం రెండు మార్పులు చేసింది.

సోధి, గ్రాండ్‌హోమ్‌లు జట్టులోకి రాగా సాంట్నర్‌, సౌతీలకు ఉద్వాసనకు గురయ్యారు. తొలి వన్డేలో అలవోక గెలుపుతో న్యూజిలాండ్‌ పర్యటనలో శుభారంభం చేసిన టీమిండియా.. ఆ ఊపును రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని భారత్‌ భావిస్తుండగా... సొంతగడ్డపై పట్టు జారకుండా చూసుకునే ప్రయత్నంలో కివీస్‌ ఉంది. 7 ఓవర్లకు భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 34 పరుగులు చేసింది.

తుది జట్లు
భారత్‌:
రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రాయుడు, ధోని, జాదవ్, శంకర్, కుల్దీప్, చహల్, భువనేశ్వర్, షమీ. 
న్యూజిలాండ్‌: గప్టిల్, మున్రో, విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాస్‌ టేలర్, లాథమ్, నికోల్స్,సోధి, ఫెర్గూసన్, బ్రాస్‌వెల్, బౌల్ట్‌, గ్రాండ్‌హోమ్‌

Advertisement
Advertisement