‘నష్ట పరిహారం’పై వాదనలు షురూ | Sakshi
Sakshi News home page

‘నష్ట పరిహారం’పై వాదనలు షురూ

Published Tue, Oct 2 2018 12:58 AM

ICC Dispute Resolutions Committee Set to Hear BCCI-PCB Case - Sakshi

దుబాయ్‌: భారత్‌ కారణంగా తమ బోర్డుకు జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇప్పించాలని కోరుతూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వివాదాల పరిష్కార ఫోరమ్‌ను ఆశ్రయించింది. ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం జరగాల్సిన ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో పాక్‌ రూ. 512 కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్‌ చేస్తోంది.

ఈ అంశంపై సోమవారం పాక్‌ వాదనలు విన్న ఐసీసీ ప్యానెల్‌... బీసీసీఐ సమాధానాన్ని కోరింది. అయితే భారత బోర్డు డబ్బు చెల్లించేందుకు ఏమాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది.  భారత ప్రభుత్వం అంగీకరించేంత వరకు పాకిస్తాన్‌తో ఎలాంటి సిరీస్‌లు ఆడబోమని కూడా బీసీసీఐ తేల్చి చెప్పింది. పాక్‌ విషయంలో తమ ధోరణిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది.     

Advertisement
Advertisement