భారత యువతితో మ్యాక్స్‌వెల్‌ డేటింగ్‌!

Glenn Maxwell Dating With Indian Woman - Sakshi

సిడ్నీ: ఆసీస్‌ హార్డ్‌ హిట్టర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ భారత యువతితో డేటింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన విని రామన్‌తో మ్యాక్స్‌వెల్‌ ప్రేమాయణం సాగిస్తున్నట్లు సమాచారం. వారిద్దరూ చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్న ఫోటోలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే వీరి ప్రేమాయణ పెళ్లి పీటల వరకూ వెళుతుందా.. లేదా డేటింగ్‌ వరకే సరిపెడతారా అనేది త్వరలోనే తెలుస్తుంది.

మ్యాక్స్‌వెల్‌, విని రామన్‌ ఒక్కటైతే భారత అమ్మాయిని పెళ్లాడిన ఆసీస్‌ రెండో క్రికెటర్‌గా అతడు నిలుస్తాడు. అంతకుముందు ఆసీస్‌ పేసర్‌ షాన్‌ టైట్‌ భారత యువతినే పెళ్లాడాడు. ఐపీఎల్‌ 2014 సమయంలో ఓ వేడుకలో పరిచయమైన మషూమ్‌ సింఘా ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మ్యాక్స్‌వెల్‌కు భారత్‌లోనూ ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అతడి మెరుపులను అభిమానులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తారు. కాగా ఈ మధ్యే ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో మాత్రం అతడు పెద్దగా రాణించలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top