ఆస్ట్రియా సైక్లిస్ట్ ప్రపంచ రికార్డు | Sakshi
Sakshi News home page

ఆస్ట్రియా సైక్లిస్ట్ ప్రపంచ రికార్డు

Published Fri, Oct 31 2014 3:43 PM

Austrian cyclist sets new world hour record

పారిస్: ఆస్ట్రియా సైక్లిస్ట్ మథియస్ బ్రాండ్లె సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. సైకిల్పై గంటకు అత్యధిక దూరం వెళ్లిన వ్యక్తిగా నిలిచాడు. బ్రాండ్లె సైకిల్పై గంటకు 51.85 కిలోమీటర్లు దూరం ప్రయాణించాడు. దీంతో గత నెలలో జర్మనీ సైక్లిస్ట్ జెన్స్ వోయిజిట్ (51.15 కి.మీ)నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టాడు. జెన్స్ కంటే బ్రాండ్లె 700 మీటర్ల దూరం ఎక్కువగా ప్రయాణించాడు. బ్రాండ్లె స్విట్జర్లాండ్లో గురువారం ఈ ఫీట్ నమోదు చేశాడు.

Advertisement
Advertisement