సోషల్‌ మీడియా | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా

Published Tue, Jan 29 2019 1:42 AM

Opinion In Social media - Sakshi

కనీస ఆదాయం
‘‘దేశంలో లక్షలాదిగా ఉన్న సోదర సోదరీమణులంతా పేదరికంతో కొట్టుమిట్టాడుతుంటే మేము కొత్త భారతదేశాన్ని నిర్మించలేం. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రతి నిరుపేదకీ కనీస ఆదాయం కల్పిస్తాం. తద్వారా పేదరికాన్నీ, ఆకలినీ తరిమి వేయడానికి మా పార్టీ కృషి చేస్తుందని మాట ఇస్తున్నాను. ఇది మా విజన్, మా హామీ’’ – రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధినేత

భద్రత
‘‘కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుసుకుని కొందరి ఖాతాల విషయంలో ట్విట్టర్‌ వివక్షా పూరితంగా వ్యవహరించడంపై ఫిర్యాదు చేశా. ఇది జాతీయ భద్రతకు, ప్రజాస్వామ్యానికీ ముప్పు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరిపించడానికి సూచనలు కూడా చేశా’’ – ఇష్కారణ్‌ సింగ్‌ భండారీ, లాయర్‌

బ్రూస్‌ లీ ఆత్మ
‘‘రెండోసారి మణికర్ణిక సినిమా చూశా. నిజం చెప్పాలంటే బ్రూస్‌ లీ ఆత్మ కంగనా రనౌత్‌లో ప్రవేశించిందేమోనని నాకు అనిపించింది. గురుత్వాకర్షణ శక్తి నిరాకరించే పోరాటాలు కూడా కంగనా ముఖంలోని తీవ్రమైన హావభావాల వలన నమ్మశక్యంగా అనిపించాయి’’ – రామ్‌ గోపాల్‌ వర్మ, దర్శకుడు

సరిహద్దు

‘‘టోర్ఖమ్‌ సరిహద్దు దగ్గర ఎగుమతులు, దిగుమతులు సవ్యంగా సాగ డానికి తగిన సదుపాయాలను కల్పించాలని సూచించా. దీంతో ద్వైపాక్షిక వాణిజ్యం మెరుగవ్వడంతోపాటు, సోదర దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి’’  – ఇమ్రాన్‌ ఖాన్, పాక్‌ ప్రధాని

వ్యక్తిగతం

‘‘కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇలా దిగజారుడు ఆరోపణలు చేయడం బాధాకరం. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే వ్యక్తిగత, మతపరమైన అంశాలను లేవనెత్తుతూ తక్కువస్థాయి వ్యాఖ్యలు చేయడాన్ని నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అనంత్‌ కుమార్‌ మానుకోవాలి. అది అతడి కుసంస్కారానికి నిదర్శనం, మన హిందూ గ్రంథాల నుంచి అతడేమీ నేర్చుకోలేదని అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు, ప్రయత్నించి మంచి మనిషిగా మారొచ్చు’’ – దినేష్‌ గుండూ రావు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు
 

Advertisement
Advertisement