Sakshi News home page

ఒకేసారి ఎన్నికలు.. జాతికి మంచిది కాదు

Published Mon, Mar 12 2018 3:02 AM

Swapandas Gupta on elections - Sakshi

హైదరాబాద్‌: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తున్న విధానం బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో పలు సమస్యలు, ఇబ్బందులు, అడ్డంకులు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు స్వపన్‌దాస్‌ గుప్తా అన్నారు. జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బేగంపేట సెస్‌ ప్రాంగణంలో ‘వన్‌ నేషన్‌– వన్‌ పోల్‌’అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తే జాతీయ, స్థానిక సమస్యలు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తాయని, ఇది జాతికి అంత మంచిది కాదన్నారు. విడివిడిగా ఎన్నికలు జరిగితే మార్పునకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 1985కు ముందు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్‌ను, ఆ తర్వాత జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రామకృష్ణ హెగ్డే సారధ్యంలోని జనతాపార్టీ మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ  మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు లక్షలాదిమంది పోలీసులను నియమించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ పదే పదే ఎన్నికలు రావడం దేశానికి మంచిదికాదన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ హోం సెక్రటరీ పద్మనాభయ్య సహా పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement