ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

సాక్షి, అమరావతి : రెండు సెలవు రోజుల అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నేడు (సోమవారం) సభలో ఏపీ ప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఓవరాల్‌గా ఈ సమావేశాల్లో 27 అంశాలపై చర్చించాలని అధికార పక్షం ప్రతిపాదించగా, 15 అంశాలపై చర్చ జరపాలని బీజేపీ ప్రతిపాదించింది. పది పని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించగా మధ్యలో ఆరు రోజులపాటు సెలవులు వచ్చాయి. 10, 13, 14, 15, 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో సభ జరగనున్న విషయం తెలిసిందే.

Back to Top