యువ భారతీయునికి గ్లోబల్ సిటిజెన్ అవార్డు | Sakshi
Sakshi News home page

యువ భారతీయునికి గ్లోబల్ సిటిజెన్ అవార్డు

Published Thu, Oct 9 2014 2:32 AM

The young Indian's Global Citizen Award

న్యూయార్క్: ప్రతిష్టాత్మక గ్లోబల్ సిటిజెన్ అవార్డును, తద్వారా లక్ష డాలర్ల నగదు పురస్కారాన్ని ఓ యువ భారతీయుడు గెలుచుకున్నారు. పారిశుద్ధ్య వసతులు కల్పించడంలో చేసిన కృషికిగానూ అనూప్ జైన్ అనే భారతీయుడు 2014 సంవత్సరానికి ‘వెయిస్‌లిట్జ్ గ్లోబల్ సిటిజెన్’ పురస్కారానికి ఎంపికయ్యారు.

2011లో బీహార్‌లో హుమనుర్ పవర్ (హెచ్‌పీ) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన అనూప్ జైన్ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య సదుపాయాలను కల్పించడంలో చొరవ తీసుకున్నారు. ఆయన చేసిన ఈ కృషే ప్రపంచ అవార్డు గెలుచుకునేందుకు దోహదపడింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement