అటవీ అధికారులపై మావోయిస్టుల దాడి | Sakshi
Sakshi News home page

అటవీ అధికారులపై మావోయిస్టుల దాడి

Published Sun, Apr 8 2018 2:11 AM

Maoists attack on forest officials

చర్ల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో  కొనసాగు తున్న చెరువు నిర్మాణ పనులను నిలిపివేయాలని పలు మార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోని అటవీశాఖాధి కారులపై మావోయిస్టులు శనివారం దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బీజాపూర్‌ జిల్లా భైరంఘడ్‌ అటవీ ప్రాంతంలో చెరువుల నిర్మాణ పనులు సాగుతున్నాయి.

ఈ పనులను నిలిపి వేయా లం టూ మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించినట్లు సమా చారం. ఆ హెచ్చరికలను లెక్క చేయని అటవీ అధికారులు పనులు కొనసా గిస్తుం డటంతో ఆగ్రహించిన మావోలు అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి ఆర్‌కే ఠాకూర్, గార్డు సంపత్‌లను కట్టేసి కొట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని వదిలేసి వెళ్లడంతో స్థానికుల సమాచారం మేరకు ఉన్న తాధికారులు రాయ్‌పూర్‌ తరలించారు.

నాలుగు టిప్పర్ల దహనం
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపో యారు. వాహన డ్రైవర్లు, రోడ్డు పనులు చేస్తున్న కూలీలను తీవ్రంగా కొట్టారు. సుకుమా జిల్లా ఉల్‌వగిడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామారం– మడేచుట్టీ మార్గంలో రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. టిప్పర్ల ద్వారా మెటల్‌ తరలి స్తుండగా శనివారం ఉదయం అక్కడికి చేరుకున్న మావోయిస్టులు నాలుగు టిప్పర్లకు నిప్పంటించారు. రెండు కాంక్రీట్‌ మిల్లర్లను సైతం దహనం చేశారు. పనులు నిలిపివేయాలంటూ పలుమార్లు హెచ్చరించినా వినకపోవడం వల్లనే వీరిని కొట్టినట్టు తెలిసింది. 

Advertisement
Advertisement