మధ్యప్రదేశ్ గవర్నర్ కుమారుడి హత్య | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ గవర్నర్ కుమారుడి హత్య

Published Wed, Mar 25 2015 12:57 PM

madhyapradesh governer son murdered

లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేష్ యాదవ్ కుమారుడు శైలేశ్ యాదవ్ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపంలో అతడి మృతదేహం బయటపడింది. కొడుకు మరణవార్త వినగానే గవర్నర్ రాంనరేష్ షాక్కు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇటీవలె మధ్యప్రదేశ్లో బయటపడిన పబ్లిక్ ఎగ్జాం కుంభకోణంలో శైలేష్ యాదవ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇది మరింత వివాదాస్పదమై విపక్షాల నిరసనలు తీవ్రమయ్యాయి.

2013లో సం చలనం సృష్టించిన ఎంపీపీఈబీ (మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు) కుంభకోణంలో పలువురు రాజకీయ నేతలు, అధి కారుల ప్రమేయం ఉందని, వీరంతా ప్రభుత్వ ఉద్యోగాలను తమవారికి కట్ట బెట్టేందుకు, ముందే ప్రశ్నా పత్రాలు లీక్‌ చేయించడం దగ్గర్నుంచి, ఇంట ర్వ్యూల వరకూ అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. ఇందులో గవర్నర్‌ రాంనరేష్ యాదవ్ కొడుకు పేరు రావడంతో, ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఎవరు ఎత్తిడి చేసినా పదవికి రాజీ నామా చేయనని అప్పట్లో గవర్నర్‌ రామ్‌నరేశ్‌ యాదవ్‌ తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement