థ్యాంక్స్ చెప్పిన హీరోయిన్ | Sakshi
Sakshi News home page

థ్యాంక్స్ చెప్పిన హీరోయిన్

Published Thu, Mar 5 2015 12:35 PM

థ్యాంక్స్ చెప్పిన హీరోయిన్

తన అభిమానులకు సోనమ్ కపూర్ కృతజ్ఞతలు తెలియజేశారు. స్వైన్ ఫ్లూ నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని, తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్నవారందరికి ధన్యవాదాలని చెప్పారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఓ చిత్రం షూటింగ్లో ఉన్న ఆమెకు స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. స్వైన్ ఫ్లూ గుర్తించిన మరుక్షణమే ఆమెను ముంబై ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారు.

Advertisement
Advertisement