షారుఖ్ ఖాన్‌ కన్నా ఆయనే పెద్ద స్టార్‌! | Sakshi
Sakshi News home page

షారుఖ్ ఖాన్‌ కన్నా ఆయనే పెద్ద స్టార్‌!

Published Wed, May 25 2016 7:04 PM

షారుఖ్ ఖాన్‌ కన్నా ఆయనే పెద్ద స్టార్‌!

ప్రతి విషయంలోనూ తనదైన వ్యాఖ్యలు చేస్తూ.. విశ్లేషణలు చేస్తూ మీడియా దృష్టిలో పడటం దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు కొత్తేమీ కాదు. గతంలో ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కమల్ హసన్ చేసిన తప్పే ఇప్పుడు షారుఖ్ చేస్తున్నారని, కమల్ తన స్టార్‌డమ్‌ను రజనీకాంత్‌కు కోల్పోయిన తరహాలోనే షారుఖ్‌ తన సూపర్‌ స్టార్‌ ఇమేజీని సల్మాన్‌ చేతిలో పెడుతున్నాడని, సల్మాన్‌ బాలీవుడ్ మెగాస్టార్‌ అవతరిస్తుంటే.. కింగ్‌ ఖాన్‌ మాత్రం సాధారణ ఫ్యాన్‌గా మిగిలిపోతున్నాడని వర్మ విశ్లేషించాడు.

తాజాగా సల్మాన్ 'సుల్తాన్‌' ట్రైలర్‌ విడుదలై.. దుమ్మురేపుతున్న నేపథ్యంలో వర్మ ఈ అంశంపై స్పందించాడు. 'సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటికే షారుఖ్‌ కన్నా పెద్ద స్టార్‌ అయ్యాడు. స్టార్‌ డమ్‌ అంటే కలెక్షన్లు మాత్రమే. ఏ స్టార్ హీరో గత మూడు సినిమాలు బిగ్గెస్ట్‌ కలెక్షన్లు రాబడుతాయో అతను  అతిపెద్ద సూపర్ స్టార్‌ అవుతాడు' అని వర్మ చెప్పుకొచ్చాడు. షారుఖ్ సినిమాల ఎంచుకొనే పద్ధతి కమల్‌ హసన్‌ తరహాలో సాగుతున్నదని, ఇదిలాగే కొనసాగితే ఆయన సూపర్‌ స్టార్‌డమ్‌కు దెబ్బతప్పదన్నాడు

Advertisement
Advertisement