సంచలనం.. పోర్న్‌ స్టార్‌తో వర్మ వీడియో | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 11 2018 1:45 PM

RGV Finally Directed Porn Star Mia Malkova - Sakshi

విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. పోర్న్‌ స్టార్‌ను డైరెక్ట్‌ చేయాలన్న తన కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. ఓ ప్రముఖ పోర్న్‌ స్టార్‌ తో ప్రత్యేక వీడియో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వర్మ తెలియజేశాడు. 

అడల్ట్‌ చిత్రాల్లో నటించే మియా మల్కోవా అనే నటిని పెట్టి ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ పేరిట వర్మ వీడియోను తీశాడంట. ‘‘సన్నీ లియోన్‌తో చేసే అవకాశం దక్కకపోయినప్పటికీ.. మీతో చేసిన ఈ అనుభవాన్ని మాత్రం మరువలేను. మీకు కృతజ్ఞతలు అంటూ మియాను ఉద్దేశించి వర్మ వరుస ట్వీట్లు చేశాడు. ‘‘నువ్వో అందమైన పెయింటింగ్‌.. నేనో ఫ్రేమ్‌ మేకర్‌’’ అంటూ వర్మ పేర్కొన్నాడు. 

ఇక వర్మ డైరెక్షన్‌లో యూరప్‌లో గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ షూటింగ్‌ జరిగిందని నటి మియా మల్కోవా కూడా ట్వీట్‌ చేశారు. ఇండియన్‌ తెరపై సన్నీ లియోన్‌ తర్వాత కనిపించబోయే శృంగార తారను తానేనంటూ ఆమె పేర్కొంటూ వీడియోకు సంబంధించిన కొన్ని నగ్న ఫోటోలను ఆమె పోస్టు చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ ను జనవరి 16న విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించటంతో.. అది ఎంత సెన్సేషన్‌ కాబోతుందోనన్న చర్చ అప్పుడే మొదలైపోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement