పూజ ఎన్టీఆర్‌తో జతకలిసింది! | Sakshi
Sakshi News home page

Published Mon, May 14 2018 12:47 PM

Pooja Hegde Joins In Shooting For NTR Trivikram Movie - Sakshi

జైలవకుశ సినిమా లాంటి హిట్‌ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తీసిన త్రివిక్రమ్‌తో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మళ్లీ తన కలం బలం చూపిస్తాడని అంటోంది చిత్రయూనిట్‌. 

ఓ నవల ఆధారంగా త్రివిక్రమ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. తమన్‌ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. నేటి(సోమవారం) నుంచి జరిగే షూటింగ్‌లో పూజ పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. కానీ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. 

Advertisement
Advertisement