మానసికంగా కుమిలిపోయా! | Sakshi
Sakshi News home page

మానసికంగా కుమిలిపోయా!

Published Sat, Oct 20 2018 1:13 AM

MeToo: Sacred Games’ Elnaaz Norouzi accuses Namaste England director Vipul Shah harassment - Sakshi

‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు విపుల్‌ షా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సాక్రెడ్‌ గేమ్స్‌ ఫేమ్, ఇరానియన్‌ యాక్టర్‌ ఎల్నాజ్‌ నరౌజీ ఆయనపై ఆరోపణలు చేశారు. ‘‘నమస్తే ఇంగ్లాండ్‌’ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌లో భాగంగా నేను విపుల్‌ షాను కలిశా. నన్ను ఒక పాత్రæ కోసం ఆడిషన్స్‌కు పిలిచారు విపుల్‌. ఆఫీస్‌లో అతన్ని కలిసిన ప్రతిసారీ నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ సారి స్క్రిప్ట్‌ వినడం కోసం రూమ్‌కి రమ్మని పిలిచి ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. మానసికంగా కుమిలిపోయాను. లైంగికంగా ఆయనకు సహకరించపోతే అవకాశం రాదని అర్థం అయ్యింది.

ప్రముఖులు తమ పవర్‌ను ఇలా తప్పుడు మార్గంలో ఊపయోగించకూడదనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెబుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు నరోజి. ‘ఆంఖేన్, నమస్తే లండన్, యాక్షన్‌ రీప్లే’ వంటి సినిమాలతో డైరెక్టర్‌గా మెప్పించిన విపుల్‌ ‘సింగ్‌ ఈజ్‌ కింగ్, హాలీడే’ వంటి సినిమాలతో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ప్రముఖ గుజరాతీ రచయిత, జర్నలిస్ట్‌ హర్‌కిసాన్‌ మోహతాకు సంబంధించిన 21 నవలల హక్కులను కూడా కొన్నారు విపుల్‌. ఇప్పుడీ ఈ లైంగిక ఆరోపణలు అతని కెరీర్‌ని ఎటు మలుపు తిప్పుతాయన్న ఆసక్తి బాలీవుడ్‌లో నెలకొంది. 

Advertisement
Advertisement