మల్టీ స్టారర్‌ సినిమాలో అనసూయ! | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 24 2018 1:08 PM

Anasuya In Anil Ravipudi Multi Starrer - Sakshi

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర అనసూయకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్టార్‌ ఇమేజ్‌ తీసుకొచ్చింది. చాలా రోజులుగా వెండితెర మీద సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న అనసూయ కల ఈ సినిమాతో నెరవేరింది. రంగస్థలం సినిమాలో రామ్‌ చరణ్, సమంతల నటనకు ఎంత పేరు వచ్చిందో అనసూయకు కూడా అదే స్థాయిలో గుర్తింపు వచ్చింది. దీంతో మరిన్ని సినిమాల్లో ఈ గ్లామరస్‌ యాంకర్‌కు అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా ఓ క్రేజీ మల్టీ స్టారర్‌ సినిమాలో అనసూయ నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్‌హిట్ సాధించిన అనిల్‌ రావిపూడి.. వెంకటేష్‌, వరణ్‌ తేజ్‌ల కాంబినేషన్‌లో ‘ఎఫ్‌2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ పేరుతో మల్టీ స్టారర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో అనసూయను కీలక పాత్రకు తీసుకున్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం స్పందించలేదు.

Advertisement
Advertisement